కీర్తనల గ్రంథము 85 : 1 (IRVTE)
యెహోవా, నువ్వు నీ దేశాన్ని దయ చూశావు, యాకోబు వంశస్తుల క్షేమాన్ని తిరిగి ఇచ్చావు. [QBR]
కీర్తనల గ్రంథము 85 : 2 (IRVTE)
నీ ప్రజల పాపాలు క్షమించావు, వారి పాపాలన్నీ కప్పివేశావు. సెలా.
కీర్తనల గ్రంథము 85 : 3 (IRVTE)
నీ ఉగ్రతనంతా మానుకున్నావు, నీ తీవ్ర కోపాన్ని చల్లార్చుకున్నావు. [QBR]
కీర్తనల గ్రంథము 85 : 4 (IRVTE)
మా రక్షణకర్తవైన దేవా, మమ్మల్ని ఉద్ధరించు. మా మీద నీ కోపం చాలించు. [QBR]
కీర్తనల గ్రంథము 85 : 5 (IRVTE)
మా మీద కలకాలం కోపంగా ఉంటావా? తరతరాలుగా నీ కోపం సాగిస్తావా? [QBR]
కీర్తనల గ్రంథము 85 : 6 (IRVTE)
నీ ప్రజలు నీ వలన సంతోషించేలా నువ్వు మళ్ళీ మమ్మల్ని బ్రతికించవా? [QBR]
కీర్తనల గ్రంథము 85 : 7 (IRVTE)
యెహోవా, నీ కృప మాకు చూపించు, నీ రక్షణ మాకు అనుగ్రహించు. [QBR]
కీర్తనల గ్రంథము 85 : 8 (IRVTE)
యెహోవా దేవుడు తెలియచేసే మాట నేను వింటాను, ఆయన తన ప్రజలతో తన నమ్మకమైన అనుచరులతో శాంతితో మసలుతాడు. అయితే వాళ్ళు మళ్ళీ మూర్ఖులు కాకూడదు. [QBR]
కీర్తనల గ్రంథము 85 : 9 (IRVTE)
ఆయన పట్ల భయభక్తులున్న వారికి ఆయన రక్షణ అతి సమీపంగా ఉంది. అప్పుడు మన దేశంలో మహిమ నిలిచి ఉంటుంది. [QBR]
కీర్తనల గ్రంథము 85 : 10 (IRVTE)
నిబంధన విశ్వసనీయత, నమ్మకత్వం కలుసుకున్నాయి, నీతిన్యాయాలు, శాంతిసమాధానాలు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. [QBR]
కీర్తనల గ్రంథము 85 : 11 (IRVTE)
భూమిలోనుంచి విశ్వాస్యత మొలుస్తుంది. ఆకాశం నుంచి విజయం తొంగిచూస్తుంది. [QBR]
కీర్తనల గ్రంథము 85 : 12 (IRVTE)
యెహోవా తన మంచి దీవెనలనిస్తాడు. మన భూమి దాని పంటనిస్తుంది. [QBR]
కీర్తనల గ్రంథము 85 : 13 (IRVTE)
నీతి ఆయనకు ముందుగా నడుస్తుంది. ఆయన అడుగుజాడలకు దారి ఏర్పరస్తుంది. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: