కీర్తనల గ్రంథము 88 : 1 (IRVTE)
ఒక పాట, కోరహు వారసుల కీర్తన. ప్రధాన సంగీతకారుని కోసం, మహలతు లయన్నోతు అనే రాగంతో పాడేది. ఎజ్రా వంశం వాడైన హేమాను మస్కిల్ (దైవ ధ్యానం) యెహోవా, నా రక్షణకర్తవైన దేవా, రేయింబవళ్ళు నేను నీకు మొరపెడుతున్నాను.
కీర్తనల గ్రంథము 88 : 2 (IRVTE)
నా ప్రార్థన విను. నా మొర జాగ్రత్తగా ఆలకించు.
కీర్తనల గ్రంథము 88 : 3 (IRVTE)
నా ప్రాణం కష్టాల్లో ఇరుక్కుపోయింది. నా జీవితం చావుకు దగ్గరగా ఉంది.
కీర్తనల గ్రంథము 88 : 4 (IRVTE)
సమాధిలోకి దిగిపోయే వాడిగా ప్రజలు నన్ను ఎంచుతున్నారు. నేను నిస్సహాయుడిలాగా ఉన్నాను.
కీర్తనల గ్రంథము 88 : 5 (IRVTE)
చచ్చినవాళ్ళ మధ్య నన్ను వదిలేశారు. మృతుడు సమాధిలో పడి ఉన్నట్టు నేనున్నాను. నువ్విక పట్టించుకోని వాడిలాగా అయ్యాను. వాళ్ళు నీ ప్రభావం నుంచి తెగతెంపులు చేసుకున్నారు.
కీర్తనల గ్రంథము 88 : 6 (IRVTE)
నువ్వు నన్ను లోతైన గుంటలో, చీకటి తావుల్లో అగాధాల్లో ఉంచావు.
కీర్తనల గ్రంథము 88 : 7 (IRVTE)
నీ ఉగ్రత నా మీద భారంగా ఉంది. నీ అలలన్నీ నన్ను ముంచుతున్నాయి. QSS సెలా. SE
కీర్తనల గ్రంథము 88 : 8 (IRVTE)
నీ మూలంగా నా సన్నిహితులు నన్ను దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళ దృష్టిలో నువ్వు నన్ను నీచునిగా చేశావు. నేను ఇరుక్కు పోయాను, తప్పించుకోలేను.
కీర్తనల గ్రంథము 88 : 9 (IRVTE)
బాధతో నా కళ్ళు అలసిపోయాయి. యెహోవా, రోజంతా నేను నీకు మొరపెడుతున్నాను, నీవైపు నా చేతులు చాపాను.
కీర్తనల గ్రంథము 88 : 10 (IRVTE)
మృతులకోసం నువ్వు అద్భుతాలు చేస్తావా? చచ్చిన వాళ్ళు లేచి నిన్ను స్తుతిస్తారా? QSS సెలా. SE
కీర్తనల గ్రంథము 88 : 11 (IRVTE)
సమాధిలో నీ కృపను ఎవరైనా చాటిస్తారా? శ్మశానంలో నీ విశ్వసనీయతను ఎవరైనా వివరిస్తారా?
కీర్తనల గ్రంథము 88 : 12 (IRVTE)
చీకట్లో నీ అద్భుతాలు తెలుస్తాయా? మరుభూమిలో నీ నీతి తెలుస్తుందా?
కీర్తనల గ్రంథము 88 : 13 (IRVTE)
అయితే యెహోవా, నేను నీకు మొరపెడతాను. ఉదయాన నా ప్రార్థన నీ దగ్గరికి వస్తుంది.
కీర్తనల గ్రంథము 88 : 14 (IRVTE)
యెహోవా, నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? నీ ముఖాన్ని నాకెందుకు దాస్తున్నావు?
కీర్తనల గ్రంథము 88 : 15 (IRVTE)
చిన్నప్పటి నుంచి నేను కష్టాల్లో ఉన్నాను, మరణం అంచుల్లో ఉన్నాను. నీ భయాందోళనలను నేను అనుభవించాను. నేను నిస్సహాయుణ్ణి.
కీర్తనల గ్రంథము 88 : 16 (IRVTE)
నీ కోపాగ్ని నన్ను ముంచెత్తింది. భయపెట్టే నీ పనులు నన్ను హతమార్చాయి.
కీర్తనల గ్రంథము 88 : 17 (IRVTE)
నీళ్లలాగా రోజంతా అవి నన్ను చుట్టుముట్టాయి. నన్ను కమ్మేశాయి.
కీర్తనల గ్రంథము 88 : 18 (IRVTE)
నా మిత్రులనూ బంధువులనూ నువ్వు నాకు దూరం చేశావు. చీకటి ఒక్కటే నా చుట్టం.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18