కీర్తనల గ్రంథము 89 : 1 (IRVTE)
ఎజ్రా వంశం వాడైన ఏతాను దైవ ధ్యానం. యెహోవా కృపాకార్యాలను నేను కలకాలం గానం చేస్తాను. రాబోయే తరాలకు నీ నమ్మకత్వాన్ని ప్రకటిస్తాను.
కీర్తనల గ్రంథము 89 : 2 (IRVTE)
నేను అంటున్నాను, నిబంధన విశ్వసనీయత శాశ్వతంగా స్థాపించావు. నీ సత్యం పరలోకంలో శాశ్వతంగా స్థిరపరచావు.
కీర్తనల గ్రంథము 89 : 3 (IRVTE)
నేను ఏర్పరచుకున్న వాడితో ఒడంబడిక చేసుకున్నాను. నా సేవకుడు దావీదుతో ప్రమాణం చేశాను.
కీర్తనల గ్రంథము 89 : 4 (IRVTE)
శాశ్వతంగా ఉండేలా నీ సంతానాన్ని స్థిరపరుస్తాను, తరతరాలకు నీ సింహాసనం సుస్థిరం చేస్తాను. QSS సెలా.SE
కీర్తనల గ్రంథము 89 : 5 (IRVTE)
యెహోవా, ఆకాశాలు నీ అద్భుతాలను ప్రస్తుతిస్తాయి, పవిత్రుల సమావేశంలో నీ విశ్వసనీయతకు స్తుతులు కలుగుతున్నాయి.
కీర్తనల గ్రంథము 89 : 6 (IRVTE)
ఆకాశాల్లో యెహోవాకు సాటి ఎవడు? దైవపుత్రుల్లో యెహోవాలాంటి వాడెవడు?
కీర్తనల గ్రంథము 89 : 7 (IRVTE)
పవిత్రుల సభలో ఆయన గౌరవనీయుడైన దేవుడు. తన చుట్టూ ఉన్న వారందరిలో ఆయన సంభ్రమాశ్చర్యాలుగొలిపే వాడు.
కీర్తనల గ్రంథము 89 : 8 (IRVTE)
యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీలాంటి బలిష్టుడెవడు? నీ విశ్వాస్యత నిన్ను ఆవరించి ఉంది.
కీర్తనల గ్రంథము 89 : 9 (IRVTE)
ఉప్పొంగే సముద్రాన్ని నువ్వు అదుపులో ఉంచుతావు, అలలు ఉవ్వెత్తుగా లేస్తే నువ్వు వాటిని అణచివేస్తావు.
కీర్తనల గ్రంథము 89 : 10 (IRVTE)
చచ్చిన దానితో సమానంగా నువ్వు రాహాబును* రాహాబును రాక్షసి నలిపేశావు. నీ బాహుబలంతో నీ శత్రువులను చెదరగొట్టి వేశావు.
కీర్తనల గ్రంథము 89 : 11 (IRVTE)
ఆకాశాలు నీవే, భూమి కూడా నీదే. లోకాన్నీ దానిలో ఉన్నదంతా నువ్వే చేశావు.
కీర్తనల గ్రంథము 89 : 12 (IRVTE)
ఉత్తర దక్షిణ దిక్కులను నువ్వే సృష్టించావు. తాబోరు హెర్మోనులు నీ నామాన్నిబట్టి ఆనందిస్తున్నాయి.
కీర్తనల గ్రంథము 89 : 13 (IRVTE)
నీకు బలిష్టమైన హస్తం ఉంది. నీ హస్తం దృఢమైనది. నీ కుడిచెయ్యి ఘనమైనది.
కీర్తనల గ్రంథము 89 : 14 (IRVTE)
నీతిన్యాయాలు నీ సింహాసనానికి ఆధారాలు. కృప, నమ్మకత్వం నీకు ముందుగా నడుస్తాయి.
కీర్తనల గ్రంథము 89 : 15 (IRVTE)
నిన్ను ఆరాధించే వాళ్ళు ధన్యులు! యెహోవా, నీ ముఖకాంతిలో వాళ్ళు నడుస్తారు.
కీర్తనల గ్రంథము 89 : 16 (IRVTE)
నీ నామాన్ని బట్టి వాళ్ళు రోజంతా ఆనందిస్తారు, నీ నీతిలో వాళ్ళు నిన్ను పొగడుతారు.
కీర్తనల గ్రంథము 89 : 17 (IRVTE)
వాళ్ళ వైభవోపేతమైన బలం నువ్వే. నీ దయవల్ల మాకు విజయం కలిగింది.
కీర్తనల గ్రంథము 89 : 18 (IRVTE)
మా డాలు యెహోవాది. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధుడు.
కీర్తనల గ్రంథము 89 : 19 (IRVTE)
ఒకప్పుడు నువ్వు దర్శనంలో నీ భక్తులతో మాట్లాడావు. నువ్విలా అన్నావు, నేను ఒక శూరుడికి కిరీటం పెట్టాను. ప్రజల్లోనుంచి ఎన్నుకుని అతణ్ణి హెచ్చించాను.
కీర్తనల గ్రంథము 89 : 20 (IRVTE)
నా సేవకుడైన దావీదును నేను ఎన్నుకున్నాను. నా పవిత్ర తైలంతో అతన్ని అభిషేకించాను.
కీర్తనల గ్రంథము 89 : 21 (IRVTE)
నా చెయ్యి అతనికి తోడుగా ఉంటుంది, నా బాహుబలం అతన్ని బలపరుస్తుంది.
కీర్తనల గ్రంథము 89 : 22 (IRVTE)
ఏ శత్రువూ అతన్ని మోసగించలేడు, దుర్మార్గులు ఎవరూ అతన్ని అణచలేరు.
కీర్తనల గ్రంథము 89 : 23 (IRVTE)
అతని శత్రువులను అతని ఎదుటే పడగొడతాను. అతన్ని ద్వేషించే వాళ్ళను నేను చంపేస్తాను.
కీర్తనల గ్రంథము 89 : 24 (IRVTE)
నా సత్యం, నా కృప అతనికి తోడుగా ఉంటుంది. నా నామాన్నిబట్టి అతనికి విజయం వస్తుంది.
కీర్తనల గ్రంథము 89 : 25 (IRVTE)
సముద్రం మీద అతని చేతినీ నదుల మీద అతని కుడిచేతినీ నేను ఉంచుతాను.
కీర్తనల గ్రంథము 89 : 26 (IRVTE)
నువ్వు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గం అని అతడు నన్ను పిలుస్తాడు.
కీర్తనల గ్రంథము 89 : 27 (IRVTE)
నేను అతన్ని నా పెద్దకొడుకుగా చేసుకుంటాను, భూరాజులందరికంటే ఉన్నత స్థితి ఇస్తాను.
కీర్తనల గ్రంథము 89 : 28 (IRVTE)
నా కృప శాశ్వతంగా అతనిపట్ల ఉండేలా చేస్తాను. నా ఒడంబడిక అతనితో ఎప్పుడూ ఉంటుంది.
కీర్తనల గ్రంథము 89 : 29 (IRVTE)
అతని సంతానం శాశ్వతంగా ఉండేలా చేస్తాను ఆకాశమున్నంత వరకూ అతని సింహాసనాన్ని నేను నిలుపుతాను.
కీర్తనల గ్రంథము 89 : 30 (IRVTE)
అతని సంతానం నా ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితే, నా ఆజ్ఞలను అనుసరించకపోతే,
కీర్తనల గ్రంథము 89 : 31 (IRVTE)
వాళ్ళు నా నియమాలను ఉల్లంఘించి నా న్యాయవిధులను పాటించకపోతే,
కీర్తనల గ్రంథము 89 : 32 (IRVTE)
నేను వారి తిరుగుబాటుకు బెత్తంతో, వారి దోషానికి దెబ్బలతో శిక్షిస్తాను.
కీర్తనల గ్రంథము 89 : 33 (IRVTE)
అయితే నా కృపను అతని నుంచి తీసివేయను. నామాట తప్పను.
కీర్తనల గ్రంథము 89 : 34 (IRVTE)
నా ఒడంబడిక నేను రద్దు చేయను. నా పెదాల మీది మాట మార్చను.
కీర్తనల గ్రంథము 89 : 35 (IRVTE)
అతని సంతానం శాశ్వతంగా ఉంటుంది అతని సింహాసనం సూర్యుడున్నంత కాలం నా ఎదుట ఉంటుంది
కీర్తనల గ్రంథము 89 : 36 (IRVTE)
చంద్రుడున్నంత కాలం అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది.
కీర్తనల గ్రంథము 89 : 37 (IRVTE)
నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేశాను దావీదుతో నేను అబద్ధమాడను. QSS సెలా. SE
కీర్తనల గ్రంథము 89 : 38 (IRVTE)
అయితే నువ్వు మమ్మల్ని నిరాకరించి వదిలేశావు, నీ అభిషిక్తుని మీద నువ్వు కోపంతో ఉన్నావు.
కీర్తనల గ్రంథము 89 : 39 (IRVTE)
నీ సేవకుని ఒడంబడిక విడిచిపెట్టేశావు. అతని కిరీటాన్ని నేల మీద పడేసి అపవిత్రపరచావు.
కీర్తనల గ్రంథము 89 : 40 (IRVTE)
అతని గోడలన్నీ నువ్వు పగలగొట్టావు. అతని కోటలను పాడు చేశావు.
కీర్తనల గ్రంథము 89 : 41 (IRVTE)
దారిన పోయేవాళ్ళంతా అతన్ని దోచుకున్నారు. తన పొరుగువాళ్లకు అతడు నిందకు ఆస్పదమయ్యాడు.
కీర్తనల గ్రంథము 89 : 42 (IRVTE)
అతని విరోధుల కుడిచేతిని నువ్వు హెచ్చించావు. అతని శత్రువులందరికీ నువ్వు ఆనందం కలిగించావు.
కీర్తనల గ్రంథము 89 : 43 (IRVTE)
అతని కత్తిమొన తొలగించావు యుద్దంలో అతన్ని నిలవకుండా చేశావు.
కీర్తనల గ్రంథము 89 : 44 (IRVTE)
అతని వైభవానికి చరమగీతం పాడావు. అతని సింహాసనాన్ని నేలమట్టం చేశావు.
కీర్తనల గ్రంథము 89 : 45 (IRVTE)
అతని యువప్రాయాన్ని కుదించావు. సిగ్గుతో అతన్ని కప్పావు. QSS సెలా. SE
కీర్తనల గ్రంథము 89 : 46 (IRVTE)
యెహోవా, ఎంతకాలం? నువ్వు శాశ్వతంగా దాక్కుంటావా? ఎంతకాలం నీ కోపం మంటలాగా మండుతూ ఉంటుంది?
కీర్తనల గ్రంథము 89 : 47 (IRVTE)
నా ఆయుష్షు ఎంత స్వల్పమో తలచుకో. పనికిరాని దేనికోసం నువ్వు మనుషులందరినీ సృష్టించావు?
కీర్తనల గ్రంథము 89 : 48 (IRVTE)
చావకుండా బతికేవాడెవడు? లేక మృత్యులోకంనుంచి తన జీవాన్ని తప్పించుకోగల వాడెవడు? QSS సెలా.SE
కీర్తనల గ్రంథము 89 : 49 (IRVTE)
ప్రభూ, నీ విశ్వసనీయతతో నువ్వు దావీదుతో ప్రమాణం చేసి మొదట చూపిన నీ కృపా కార్యాలు ఏవి?
కీర్తనల గ్రంథము 89 : 50 (IRVTE)
ప్రభూ, నీ సేవకులకు వచ్చిన నిందను బలమైన రాజ్యాలన్నిటి నుంచి వచ్చిన అవమానాన్ని నా గుండెలో నేనెలా భరిస్తున్నానో తలచుకో.
కీర్తనల గ్రంథము 89 : 51 (IRVTE)
యెహోవా, నీ శత్రువులు నిందలు మోపుతున్నారు, నీ అభిషిక్తుని అడుగులపై వాళ్ళు నిందలు మోపుతున్నారు.
కీర్తనల గ్రంథము 89 : 52 (IRVTE)
యెహోవాకు శాశ్వతంగా స్తుతి కలుగు గాక. ఆమేన్‌, ఆమేన్‌.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52