కీర్తనల గ్రంథము 9 : 1 (IRVTE)
ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ముత్ లబ్బెన్ రాగం. హృదయ పూర్వకంగా నేను యెహోవాకు ధన్యవాదాలు చెల్లిస్తాను. యెహోవా, నీ ఆశ్చర్య కార్యాలన్నిటి గురించి నేను చెబుతాను.
కీర్తనల గ్రంథము 9 : 2 (IRVTE)
మహోన్నతుడైన యెహోవా! నేను నీ గురించి సంతోషించి హర్షిస్తాను. నీ నామానికి స్తుతి కీర్తన పాడుతాను.
కీర్తనల గ్రంథము 9 : 3 (IRVTE)
నా శత్రువులు వెనుదిరిగినప్పుడు, వాళ్ళు తొట్రుపడి నీ ఎదుట నాశనం అవుతారు.
కీర్తనల గ్రంథము 9 : 4 (IRVTE)
ఎందుకంటే, నా న్యాయయుక్తమైన పనిని నువ్వు సమర్థించావు. నీ సింహాసనం మీద ఒక నీతిగల న్యాయమూర్తిగా నువ్వు కూర్చున్నావు.
కీర్తనల గ్రంథము 9 : 5 (IRVTE)
నీ యుద్ధ నినాదంతో అన్యజాతులను నువ్వు భయభీతులను చేశావు. నువ్వు దుర్మార్గులను నాశనం చేశావు. వాళ్ళ జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచివేశావు.
కీర్తనల గ్రంథము 9 : 6 (IRVTE)
తమ పట్టణాలను నువ్వు జయించినప్పుడు శిథిలాలు కూలినట్టు శత్రువు కూలిపోయాడు. వాళ్ళ గుర్తులన్నీ చెరిగిపోయాయి.
కీర్తనల గ్రంథము 9 : 7 (IRVTE)
కాని యెహోవా శాశ్వత కాలం ఉంటాడు. న్యాయం తీర్చడానికి ఆయన తన సింహాసనాన్ని స్థాపిస్తాడు.
కీర్తనల గ్రంథము 9 : 8 (IRVTE)
యెహోవా లోకానికి న్యాయమైన తీర్పు తీరుస్తాడు. జాతుల కోసం న్యాయమైన నిర్ణయాలు చేస్తాడు.
కీర్తనల గ్రంథము 9 : 9 (IRVTE)
పీడిత ప్రజలకు యెహోవా బలమైన ఆశ్రయం. ఆపత్కాలంలో బలమైన అండ.
కీర్తనల గ్రంథము 9 : 10 (IRVTE)
యెహోవా, నీ నామం తెలిసిన వాళ్ళు నిన్ను నమ్ముతారు. ఎందుకంటే, నిన్ను వెదికే వాళ్ళను నువ్వు విడిచిపెట్టవు.
కీర్తనల గ్రంథము 9 : 11 (IRVTE)
సీయోనులో ఏలుతున్న యెహోవాకు స్తుతులు పాడండి. ఆయన చేసిన వాటిని జాతులకు చెప్పండి.
కీర్తనల గ్రంథము 9 : 12 (IRVTE)
ఎందుకంటే, రక్తపాతానికి శాస్తి చేసే దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. పీడిత ప్రజల కేకలు ఆయన మరచిపోడు.
కీర్తనల గ్రంథము 9 : 13 (IRVTE)
యెహోవా, నా మీద దయ చూపించు. నన్ను ద్వేషించేవాళ్ళు నన్ను ఎలా పీడిస్తున్నారో చూడు. మరణద్వారం నుంచి నన్ను తప్పించగలిగిన వాడివి నువ్వే.
కీర్తనల గ్రంథము 9 : 14 (IRVTE)
నీ స్తుతి నేను ప్రచురం చేసేలా నన్ను తప్పించు. సీయోను కుమార్తె ద్వారాల్లో నీ రక్షణలో హర్షిస్తాను!
కీర్తనల గ్రంథము 9 : 15 (IRVTE)
జాతులు తాము తవ్విన గుంటలో తామే పడిపోయారు. తాము రహస్యంగా పన్నిన వలలో వారి కాళ్ళే చిక్కాయి.
కీర్తనల గ్రంథము 9 : 16 (IRVTE)
యెహోవా తనను ప్రత్యక్షం చేసుకున్నాడు. తీర్పును ఆయన అమలు చేశాడు. దుర్మార్గుడు తన క్రియల్లో తానే చిక్కుకున్నాడు. QSS సెలా.SE
కీర్తనల గ్రంథము 9 : 17 (IRVTE)
దుర్మార్గులను తిప్పి పాతాళానికి పంపడం జరుగుతుంది. దేవుణ్ణి మరిచిన జాతులన్నిటికీ అదే గతి.
కీర్తనల గ్రంథము 9 : 18 (IRVTE)
అక్కరలో ఉన్నవాణ్ణి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. పీడిత ప్రజల ఆశలు శాశ్వతంగా చెదిరిపోవడం జరగదు.
కీర్తనల గ్రంథము 9 : 19 (IRVTE)
యెహోవా లేచి రా, మనుషులకు మా మీద జయం కలగనివ్వకు. నీ సముఖంలో జాతులకు తీర్పు వస్తుంది గాక.
కీర్తనల గ్రంథము 9 : 20 (IRVTE)
యెహోవా, వాళ్ళను భయభీతులకు గురిచెయ్యి. తాము కేవలం మానవమాత్రులేనని జాతులు తెలుసుకుంటారు గాక. QSS సెలా. SE

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20