కీర్తనల గ్రంథము 90 : 1 (IRVTE)
దేవుని మనిషి మోషే ప్రార్థన. ప్రభూ, తరతరాలుగా నువ్వే మాకు నివాసస్థానం.
కీర్తనల గ్రంథము 90 : 2 (IRVTE)
పర్వతాలు ఉనికిలోకి రాకముందే, భూమినీ లోకాన్నీ నువ్వు సృష్టించకముందే, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే దేవుడివి.
కీర్తనల గ్రంథము 90 : 3 (IRVTE)
నువ్వు మనుషులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుషులారా, తిరిగి రండి, అంటావు.
కీర్తనల గ్రంథము 90 : 4 (IRVTE)
నీ దృష్టిలో వెయ్యేళ్ళు గడిచిపోయిన నిన్నలాగా ఒక రాత్రిపూటలాగా ఉన్నాయి.
కీర్తనల గ్రంథము 90 : 5 (IRVTE)
వరదలో కొట్టుకుపోయినట్టు నువ్వు వారిని లాక్కెళ్ళిపోతావు, వాళ్ళు నిద్ర పోతారు. పచ్చ గడ్డిలాగా వాళ్ళు పొద్దున్నే చిగురిస్తారు.
కీర్తనల గ్రంథము 90 : 6 (IRVTE)
ఉదయాన అది మొలిచి పెరుగుతుంది, సాయంకాలం అది వాడిపోయి ఎండిపోతుంది.
కీర్తనల గ్రంథము 90 : 7 (IRVTE)
నీ కోపం చేత మేము హరించుకుపోతున్నాం, నీ ఉగ్రత మమ్మల్ని భయపెడుతూ ఉంది.
కీర్తనల గ్రంథము 90 : 8 (IRVTE)
మా అపరాధాలను నువ్వు నీ ఎదుట ఉంచుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి.
కీర్తనల గ్రంథము 90 : 9 (IRVTE)
నీ ఉగ్రత భరిస్తూ మా జీవితం గడుపుతున్నాం. నిట్టూర్పులాగా మా జీవితకాలం త్వరగా గడిచిపోతుంది.
కీర్తనల గ్రంథము 90 : 10 (IRVTE)
మా బలము* బలము అహంకారం డెభ్భై ఏళ్ళు. ఆరోగ్యంగా ఉంటే ఎనభై ఏళ్ళుకూడా ఉండొచ్చు. అయినా మా శ్రేష్ట కాలం కష్టాలూ దుఃఖాలే. అవును, అవి త్వరగా గడిచిపోతాయి. మేము ఎగిరిపోతాం.
కీర్తనల గ్రంథము 90 : 11 (IRVTE)
నీ కోపం ఎంత తీవ్రమో ఎవరికి తెలుసు? నీ ఆగ్రహం దానికి తగిన భయాన్ని రేపుతుందని ఎవరికి తెలుసు?
కీర్తనల గ్రంథము 90 : 12 (IRVTE)
కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు.
కీర్తనల గ్రంథము 90 : 13 (IRVTE)
యెహోవా, తిరిగి రా! ఎంతకాలం పడుతుంది? నీ సేవకుల పట్ల జాలి పడు.
కీర్తనల గ్రంథము 90 : 14 (IRVTE)
ఉదయాన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా రోజులన్నీ ఉల్లాసంగా ఆనందంగా గడుపుతాం.
కీర్తనల గ్రంథము 90 : 15 (IRVTE)
నువ్వు మమ్మల్ని బాధించిన రోజుల లెక్కప్రకారం మేము కష్టాలు అనుభవించిన సంవత్సరాలకు తగ్గట్టుగా మమ్మల్ని సంతోషపరచు.
కీర్తనల గ్రంథము 90 : 16 (IRVTE)
నీ సేవకులకు నీ పని చూపించు, మా సంతానం నీ వైభవాన్ని చూడనివ్వు.
కీర్తనల గ్రంథము 90 : 17 (IRVTE)
మా యెహోవా దేవుని ప్రసన్నత మా మీద ఉండు గాక. మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. నిజంగా, మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17