కీర్తనల గ్రంథము 91 : 1 (IRVTE)
సర్వోన్నతుడి చాటున నివసించే వాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 2 (IRVTE)
ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు, అని నేను యెహోవాను గురించి చెబుతాను. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 3 (IRVTE)
వేటగాడు పన్నిన ఉచ్చు నుంచి ప్రాణాంతకవ్యాధి నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 4 (IRVTE)
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకుతుంది. ఆయన నమ్మకత్వం నిన్ను కాపాడే కవచంగా ఉంటుంది. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 5 (IRVTE)
రాత్రిలో కలిగే భయభ్రాంతులకు, పగటివేళ ఎగిరి వచ్చే బాణాలకూ నువ్వు భయపడవు. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 6 (IRVTE)
చీకట్లో తచ్చాడే రోగానికిగానీ మధ్యాహ్నం సోకే వ్యాధికి గానీ నువ్వు బెదిరిపోవు. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 7 (IRVTE)
నీ పక్కన వేయి మంది, నీ కుడిపక్కన పదివేల మంది నేలకూలినా అది నీ దరిదాపులకు రాదు. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 8 (IRVTE)
దుర్మార్గులకు పడే శిక్ష నువ్వు చూస్తూ ఉంటావు. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 9 (IRVTE)
యెహోవా నా ఆశ్రయం. మహోన్నతుణ్ణి నీకు కూడా శరణుగా చేసుకో. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 10 (IRVTE)
ఏ హానీ నిన్ను ముంచెత్తదు. ఏ ఆపదా నీ ఇంటి దరిదాపులకు రాదు. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 11 (IRVTE)
నువ్వు చేసే వాటన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను పురమాయిస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 12 (IRVTE)
నువ్వు జారి బండ రాయిపై పడిపోకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 13 (IRVTE)
నువ్వు సింహాలనూ నాగుపాములను నీ కాళ్ళ కింద తొక్కుతావు, సింహం కూనలను, పాములను అణగదొక్కుతావు. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 14 (IRVTE)
అతనికి నా మీద భక్తి విశ్వాసాలున్నాయి గనక నేనతన్ని రక్షిస్తాను. అతడు నా పట్ల స్వామిభక్తి గలవాడు గనక నేనతన్ని కాపాడతాను. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 15 (IRVTE)
అతడు నాకు మొరపెడితే నేనతనికి జవాబిస్తాను. కష్టాల్లో నేను అతనితో ఉంటాను, అతనికి విజయమిచ్చి అతన్ని సత్కరిస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 91 : 16 (IRVTE)
దీర్ఘాయుష్షుతో అతన్ని తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను. [PE]
❮
❯