కీర్తనల గ్రంథము 95 : 1 (IRVTE)
రండి, యెహోవాకు పాట పాడదాం, మన రక్షణకు ఆధారశిలకు ఆనందంగా పాడదాం.
కీర్తనల గ్రంథము 95 : 2 (IRVTE)
కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం.
కీర్తనల గ్రంథము 95 : 3 (IRVTE)
యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు.
కీర్తనల గ్రంథము 95 : 4 (IRVTE)
భూమి అగాధస్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే.
కీర్తనల గ్రంథము 95 : 5 (IRVTE)
సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి.
కీర్తనల గ్రంథము 95 : 6 (IRVTE)
రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం.
కీర్తనల గ్రంథము 95 : 7 (IRVTE)
ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం. ఆయన చేతికింది గొర్రెలం. ఈ రోజున మీరు ఆయన స్వరం వింటే ఎంత బాగుండు!
కీర్తనల గ్రంథము 95 : 8 (IRVTE)
మెరీబా* మెరీబా కలహాలు దగ్గర, ఎడారిలో మస్సా దగ్గర ఉన్న సమయంలో మీ పూర్వీకుల్లాగా మీ గుండె కఠినం చేసుకోవద్దు.
కీర్తనల గ్రంథము 95 : 9 (IRVTE)
అక్కడ వాళ్ళు నా అధికారాన్ని సవాలు చేశారు నా కార్య కలాపాలు చూసి కూడా నా ఓపికను పరీక్షించారు.
కీర్తనల గ్రంథము 95 : 10 (IRVTE)
నలభై ఏళ్ళు నేను ఆ తరం వారితో కోపంగా ఉన్నాను. వాళ్ళ హృదయాలు దారి తప్పుతున్నాయి. వాళ్ళు నా పద్ధతులు† పద్ధతులు ఆజ్ఞలు తెలుసుకోలేదు అన్నాను.
కీర్తనల గ్రంథము 95 : 11 (IRVTE)
కాబట్టి, వాళ్ళు నా విశ్రాంతి స్థలంలో ఎన్నడూ ప్రవేశించరని నేను నా కోపంలో శపథం చేశాను.
❮
❯