కీర్తనల గ్రంథము 95 : 1 (IRVTE)
రండి, యెహోవాకు పాట పాడదాం, మన రక్షణకు ఆధారశిలకు ఆనందంగా పాడదాం. [QBR]
కీర్తనల గ్రంథము 95 : 2 (IRVTE)
కృతజ్ఞతతో ఆయన సన్నిధికి వద్దాం, ఆయనకు స్తుతి గీతాలు పాడదాం. [QBR]
కీర్తనల గ్రంథము 95 : 3 (IRVTE)
యెహోవా గొప్ప దేవుడు. దేవుళ్ళందరికీ పైగా ఉన్న గొప్ప రాజు. [QBR]
కీర్తనల గ్రంథము 95 : 4 (IRVTE)
భూమి అగాధస్థలాలు ఆయన చేతిలో ఉన్నాయి. పర్వత శిఖరాలు ఆయనవే. [QBR]
కీర్తనల గ్రంథము 95 : 5 (IRVTE)
సముద్రం ఆయనది. ఆయనే దాన్ని చేశాడు. ఆయన చేతులు పొడి నేలను చేశాయి. [QBR]
కీర్తనల గ్రంథము 95 : 6 (IRVTE)
రండి సాగిలపడి ఆరాధన చేద్దాం. మన సృష్టికర్త యెహోవా ఎదుట మోకరిల్లుదాం. [QBR]
కీర్తనల గ్రంథము 95 : 7 (IRVTE)
ఆయన మన దేవుడు. మనం ఆయన పోషించే ప్రజలం. ఆయన చేతికింది గొర్రెలం. ఈ రోజున మీరు ఆయన స్వరం వింటే ఎంత బాగుండు! [QBR]
కీర్తనల గ్రంథము 95 : 8 (IRVTE)
మెరీబా [* మెరీబా కలహాలు ] దగ్గర, ఎడారిలో మస్సా దగ్గర ఉన్న సమయంలో మీ పూర్వీకుల్లాగా మీ గుండె కఠినం చేసుకోవద్దు. [QBR]
కీర్తనల గ్రంథము 95 : 9 (IRVTE)
అక్కడ వాళ్ళు నా అధికారాన్ని సవాలు చేశారు నా కార్య కలాపాలు చూసి కూడా నా ఓపికను పరీక్షించారు. [QBR]
కీర్తనల గ్రంథము 95 : 10 (IRVTE)
నలభై ఏళ్ళు నేను ఆ తరం వారితో కోపంగా ఉన్నాను. వాళ్ళ హృదయాలు దారి తప్పుతున్నాయి. వాళ్ళు నా పద్ధతులు [† పద్ధతులు ఆజ్ఞలు ] తెలుసుకోలేదు అన్నాను. [QBR]
కీర్తనల గ్రంథము 95 : 11 (IRVTE)
కాబట్టి, వాళ్ళు నా విశ్రాంతి స్థలంలో ఎన్నడూ ప్రవేశించరని నేను నా కోపంలో శపథం చేశాను. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: