కీర్తనల గ్రంథము 98 : 1 (IRVTE)
ఒక కీర్తన. యెహోవాకు కొత్త పాట పాడండి. ఆయన అద్భుతాలు చేశాడు. ఆయన కుడి చెయ్యి, ఆయన పవిత్ర హస్తం మనకు విజయం తెచ్చాయి.
కీర్తనల గ్రంథము 98 : 2 (IRVTE)
యెహోవా తన రక్షణను వెల్లడిచేశాడు. రాజ్యాలన్నిటికీ తన న్యాయాన్ని కనపరిచాడు.
కీర్తనల గ్రంథము 98 : 3 (IRVTE)
ఆయన ఇశ్రాయేలు వంశం పట్ల తన నిబంధన విశ్వసనీయత, తన నమ్మకత్వం గుర్తు చేసుకున్నాడు. భూదిగంతాలు మన దేవుని విజయాన్ని చూస్తారు.
కీర్తనల గ్రంథము 98 : 4 (IRVTE)
లోకమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయండి. ఉల్లాసంగా పాడండి. పాటలెత్తి ఆనందంగా పాడండి. ప్రస్తుతులు పాడండి.
కీర్తనల గ్రంథము 98 : 5 (IRVTE)
తీగ వాయిద్యంతో యెహోవాకు ప్రశంసలు పాడండి. తీగ వాయిద్యంతో మధురంగా పాడండి.
కీర్తనల గ్రంథము 98 : 6 (IRVTE)
బాకాలతో కొమ్ముబూర ధ్వనితో, రాజైన యెహోవా ఎదుట సంతోషంగా కేకలు వేయండి.
కీర్తనల గ్రంథము 98 : 7 (IRVTE)
సముద్రం, దానిలో ఉన్నదంతా ఘోషిస్తుంది గాక. లోకం, దాని నివాసులు కేకలు వేస్తారు గాక!
కీర్తనల గ్రంథము 98 : 8 (IRVTE)
నదులు చప్పట్లు కొట్టాలి. కొండలు ఆనందంతో కేకలు పెట్టాలి.
కీర్తనల గ్రంథము 98 : 9 (IRVTE)
లోకానికి తీర్పు తీర్చడానికి, నీతితో ప్రపంచ ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి యెహోవా రాబోతున్నాడు.

1 2 3 4 5 6 7 8 9