ప్రకటన గ్రంథము 19 : 1 (IRVTE)
ఈ విషయాలు జరిగిన తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు పరలోకంలో నుండి ఒక పెద్ద శబ్దం నేను విన్నాను. [QBR] “హల్లెలూయ! రక్షణ, యశస్సు, బల ప్రభావాలు మన దేవునివే. [QBR]
ప్రకటన గ్రంథము 19 : 2 (IRVTE)
ఆయన తీర్పులు సత్యంగా న్యాయంగా ఉన్నాయి. [QBR] తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన మహా వేశ్యను ఆయన శిక్షించాడు. [QBR] ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతీకారం తీర్చాడు.” [PE][PS]
ప్రకటన గ్రంథము 19 : 3 (IRVTE)
రెండోసారి వారంతా, “హల్లెలూయ! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది” అన్నారు. [QBR]
ప్రకటన గ్రంథము 19 : 4 (IRVTE)
అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి, [QBR] “ఆమెన్, హల్లెలూయ!” అని చెబుతూ ఆయనను పూజించారు. [QBR]
ప్రకటన గ్రంథము 19 : 5 (IRVTE)
అప్పుడు, “దేవుని దాసులు, ఆయనకు భయపడే వారు, [QBR] గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి” అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది. [PE][PS]
ప్రకటన గ్రంథము 19 : 6 (IRVTE)
తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది. [QBR] “హల్లెలూయ! సర్వ శక్తిశాలి, మన ప్రభువు అయిన దేవుడు పరిపాలిస్తున్నాడు.” [PS]
ప్రకటన గ్రంథము 19 : 7 (IRVTE)
{గొర్రెపిల్ల కల్యాణం} [PS] “గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది. [QBR] పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది. [QBR] కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం. [QBR] ఆయనకు మహిమ ఆపాదించుదాం.” [QBR]
ప్రకటన గ్రంథము 19 : 8 (IRVTE)
ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, పరిశుభ్రమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు. [QBR] ఈ శ్రేష్ఠవస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు. [PE][PS]
ప్రకటన గ్రంథము 19 : 9 (IRVTE)
అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని రాయి.” అతడే ఇంకా, “ఇవి నిజంగా దేవుని మాటలు” అన్నాడు.
ప్రకటన గ్రంథము 19 : 10 (IRVTE)
అందుకు నేను అతణ్ణి పూజించడానికి అతని ముందు సాష్టాంగపడబోయాను. కానీ అతడు, “అలా చేయకు! యేసుకు సాక్షులుగా ఉన్న నీకూ నీ సోదరులకూ నేను తోటి దాసుణ్ణి మాత్రమే” అన్నాడు. [PS]
ప్రకటన గ్రంథము 19 : 11 (IRVTE)
{మహిమలో క్రీస్తు రాక} [PS] తరువాత పరలోకం తెరుచుకుని ఉండడం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు ‘నమ్మకమైన వాడు, సత్యవంతుడు.’ ఆయన న్యాయంగా తీర్పు చెబుతూ యుద్ధం చేస్తాడు.
ప్రకటన గ్రంథము 19 : 12 (IRVTE)
ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు.
ప్రకటన గ్రంథము 19 : 13 (IRVTE)
ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. ‘దేవుని వాక్కు’ అనే పేరు ఆయనకుంది. [PE][PS]
ప్రకటన గ్రంథము 19 : 14 (IRVTE)
ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నార బట్టలు వేసుకుని తెల్ల గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు.
ప్రకటన గ్రంథము 19 : 15 (IRVTE)
వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప లాఠీతో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్ష గానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు.
ప్రకటన గ్రంథము 19 : 16 (IRVTE)
ఆయన బట్టల మీదా, తొడ మీదా ‘రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు’ అనే పేరు రాసి ఉంది. [PS]
ప్రకటన గ్రంథము 19 : 17 (IRVTE)
{హర్మెగిద్దోన్ యుద్ధం} [PS] అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండడం నేను చూశాను. అతడు బిగ్గరగా కేక వేసి పైన ఎగిరే పక్షులను పిలిచాడు, “రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహా విందును ఆరగించండి.
ప్రకటన గ్రంథము 19 : 18 (IRVTE)
రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, బలవంతుల మాంసం, గుర్రాల మాంసం, వాటిపై స్వారీ చేసేవారి మాంసం, స్వతంత్రులూ, బానిసలూ, పలుకుబడి లేనివారూ, గొప్పవారూ అయిన మనుషులందరి మాంసం, వచ్చి తినండి” అన్నాడు. [PE][PS]
ప్రకటన గ్రంథము 19 : 19 (IRVTE)
క్రూరమృగం, భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండడం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు. 1. మృగం పతనం. 2. అబద్ధ ప్రవక్త పతనం [PE][PS]
ప్రకటన గ్రంథము 19 : 20 (IRVTE)
అప్పుడా మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేశాడు. ఈ ఇద్దరినీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు. 3. వారిని అనుసరించిన రాజుల పతనం [PE][PS]
ప్రకటన గ్రంథము 19 : 21 (IRVTE)
మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు కడుపారా ఆరగించాయి. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: