రోమీయులకు 3 : 1 (IRVTE)
{యూదులకున్న లాభం వారికి మరింత శిక్షకే దారి తీసింది} [PS] అలాగైతే యూదుల గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి?
రోమీయులకు 3 : 2 (IRVTE)
ప్రతి విషయంలో ఎక్కువే. మొదటిది, దేవుని వాక్కులు యూదులకే అప్పగించబడ్డాయి.
రోమీయులకు 3 : 3 (IRVTE)
కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా?
రోమీయులకు 3 : 4 (IRVTE)
కానేకాదు. “నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీపై విచారణ జరిగినప్పుడు గెలవడానికి” అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడే.
రోమీయులకు 3 : 5 (IRVTE)
మన దుర్నీతి దేవుని న్యాయాన్ని వెల్లడి చేస్తున్నప్పటికీ కోపం చూపే దేవుడు అన్యాయం చేసేవాడని చెప్పాలా? నేను మానవ వ్యవహార రీతిలో మాట్లాడుతున్నాను.
రోమీయులకు 3 : 6 (IRVTE)
అలా కానే కాదు. అలాగైతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు? [PE][PS]
రోమీయులకు 3 : 7 (IRVTE)
నా అబద్ధం ద్వారా దేవుని సత్యం విస్తరించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపినని తీర్పు పొందడం ఎందుకు?
రోమీయులకు 3 : 8 (IRVTE)
మంచి జరగడం కోసం చెడు జరిగిద్దాం అని మేము బోధిస్తున్నామని ఇప్పటికే కొందరు మాపై నిందారోపణ చేసినట్టు మేము నిజంగానే ఆ ప్రకారం చెప్పవచ్చు కదా? వారి మీదికి వచ్చే శిక్ష న్యాయమైనదే. {ఫలితార్థం-లోకమంతా దేవుని ఎదుట దోషిగా నిలిచింది} [PS]
రోమీయులకు 3 : 9 (IRVTE)
అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా.
రోమీయులకు 3 : 10 (IRVTE)
దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే, [QBR] “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. [QBR]
రోమీయులకు 3 : 11 (IRVTE)
గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు. [QBR]
రోమీయులకు 3 : 12 (IRVTE)
అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు. [QBR] మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు. [QBR]
రోమీయులకు 3 : 13 (IRVTE)
వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది. [QBR] వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు. [QBR] వారి పెదవుల కింద పాము విషం ఉంది. [QBR]
రోమీయులకు 3 : 14 (IRVTE)
వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి. [QBR]
రోమీయులకు 3 : 15 (IRVTE)
రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి. [QBR]
రోమీయులకు 3 : 16 (IRVTE)
వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి. [QBR]
రోమీయులకు 3 : 17 (IRVTE)
వారికి శాంతిమార్గం తెలియదు. [QBR]
రోమీయులకు 3 : 18 (IRVTE)
వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.” [PE][PS]
రోమీయులకు 3 : 19 (IRVTE)
ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు.
రోమీయులకు 3 : 20 (IRVTE)
ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది. రెండవ భాగం-కేవలం సిలువ వేయబడిన క్రీస్తుపై విశ్వాసం ద్వారా మాత్రమే మనిషిని నిర్దోషిగా తీర్చడం ఒక్కటే పాపనివారణ మార్గం. నిర్దోషిగా తీర్చడం, నిర్వచనం [PE][PS]
రోమీయులకు 3 : 21 (IRVTE)
ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి.
రోమీయులకు 3 : 22 (IRVTE)
అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి.
రోమీయులకు 3 : 23 (IRVTE)
భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు.
రోమీయులకు 3 : 24 (IRVTE)
నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు.
రోమీయులకు 3 : 25 (IRVTE)
క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు.
రోమీయులకు 3 : 26 (IRVTE)
ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు. [PE][PS]
రోమీయులకు 3 : 27 (IRVTE)
కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే.
రోమీయులకు 3 : 28 (IRVTE)
కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము. [PS]
రోమీయులకు 3 : 29 (IRVTE)
{నిర్దోషిగా తీర్చడం అనేది సార్వత్రిక పాప నివారణ మార్గం} [PS] దేవుడు యూదులకు మాత్రమేనా దేవుడు? యూదేతరులకు కాడా? అవును, వారికి కూడా దేవుడే.
రోమీయులకు 3 : 30 (IRVTE)
దేవుడు ఒక్కడే కాబట్టి, ఆయన సున్నతి గలవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేని వారిని విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీరుస్తాడు. [PS]
రోమీయులకు 3 : 31 (IRVTE)
{విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం అనేది ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తుంది} [PS] విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నామా? కాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: