రోమీయులకు 9 : 1 (IRVTE)
(1-2) నా హృదయంలో గొప్ప దుఃఖం, తీరని వేదన ఉన్నాయి. నేను అబద్ధమాడడం లేదు, క్రీస్తులో నిజమే చెబుతున్నాను. పరిశుద్ధాత్మలో నా మనస్సాక్షి నాతో కలిసి సాక్షమిస్తున్నది.
రోమీయులకు 9 : 2 (IRVTE)
రోమీయులకు 9 : 3 (IRVTE)
సాధ్యమైతే, శరీర సంబంధంగా నా సోదరులు, నా సొంత జాతి వారి కోసం, క్రీస్తు నుండి వేరుపడి దేవుని శాపానికి గురి కావడానికి కూడా నేను సిద్ధమే. (2) ఇశ్రాయేలుకున్న ఏడింతల ఆధిక్యతలు [PE][PS]
రోమీయులకు 9 : 4 (IRVTE)
వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్రం అనే బహుమానం, దైవారాధన ఆచారాలు, వాగ్దానాలు వీరివి.
రోమీయులకు 9 : 5 (IRVTE)
పూర్వీకులు వీరి వారే. శరీరరీతిగా క్రీస్తు వచ్చింది వీరిలో నుండే. ఈయన సర్వాధికారియైన దేవుడు, శాశ్వత కాలం స్తుతిపాత్రుడు, ఆమేన్‌. (3) అబ్రాహాము ద్వారా కేవలం సహజ సంతానమైన యూదులకూ ఆత్మ సంబంధమైన యూదులకూ తేడా [PE][PS]
రోమీయులకు 9 : 6 (IRVTE)
అయితే దేవుని మాట భంగమైనట్టు కాదు. ఇశ్రాయేలునుండి వచ్చిన వారంతా ఇశ్రాయేలీయులు కారు.
రోమీయులకు 9 : 7 (IRVTE)
అబ్రాహాముకు పుట్టిన వారంతా నిజమైన వారసులు కాదు, “ఇస్సాకు మూలంగా కలిగే వారినే నీ సంతానం అని పిలుస్తారు.”
రోమీయులకు 9 : 8 (IRVTE)
అంటే శరీర సంబంధులంతా దేవుని పిల్లలు కారు గానీ దేవుని వాగ్దానం ద్వారా పుట్టిన పిల్లలే సంతానమని లెక్కలోకి వస్తారు.
రోమీయులకు 9 : 9 (IRVTE)
ఆ వాగ్దానం గురించిన వాక్యమిదే, “తిరిగి ఇదే కాలంలో వస్తాను. అప్పుడు శారాకు కొడుకు పుడతాడు.” [PE][PS]
రోమీయులకు 9 : 10 (IRVTE)
అంతేకాదు, రిబ్కా మన తండ్రి ఇస్సాకు వలన గర్భం దాల్చినప్పుడు,
రోమీయులకు 9 : 11 (IRVTE)
దేవుని ఎన్నిక ప్రకారమైన ఆయన సంకల్పం, చేసే పనుల మూలంగా కాక వారిని పిలిచినవాడి మూలంగానే నెరవేరడం కోసం,
రోమీయులకు 9 : 12 (IRVTE)
పిల్లలు ఇంకా పుట్టి మంచీ చెడూ ఏమీ చేయక ముందే, “పెద్దవాడు చిన్నవాడికి సేవకుడు అవుతాడు” అని ఆమెతో చెప్పాడు.
రోమీయులకు 9 : 13 (IRVTE)
దీన్ని గురించి, “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని రాసి ఉంది. (4) దేవుని కృప ఆయన సార్వభౌమిక సంకల్పమే [PE][PS]
రోమీయులకు 9 : 14 (IRVTE)
కాబట్టి ఏమంటాము? దేవుడు అన్యాయం చేశాడనా? కానే కాదు.
రోమీయులకు 9 : 15 (IRVTE)
అందుకు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “నేను ఎవరిపై కనికరం చూపాలనుకుంటానో వారిపై కనికరం చూపిస్తాను. ఎవరిపై జాలి చూపాలనుకుంటానో వారిపై జాలి చూపిస్తాను.”
రోమీయులకు 9 : 16 (IRVTE)
కాబట్టి ఒకరు ఆశించడం వలన గానీ, ఒకరు ప్రయాస పడడం వలన గానీ కాదు, దేవుడు కనికరం చూపడం వల్లనే అవుతుంది. [PE][PS]
రోమీయులకు 9 : 17 (IRVTE)
దేవుని వాక్కు ఫరోతో చెప్పిందేమంటే, “నేను నీలో నా బలాన్ని ప్రదర్శించాలి, నా పేరు భూలోకమంతా ప్రచురం కావాలి. ఈ ఉద్దేశం కోసమే నిన్ను హెచ్చించాను.”
రోమీయులకు 9 : 18 (IRVTE)
కాబట్టి ఆయన ఎవరిని కనికరించాలి అనుకుంటాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలి అనుకుంటాడో వారిని కఠినపరుస్తాడు.
రోమీయులకు 9 : 19 (IRVTE)
అలాగైతే, “ఆయన సంకల్పాన్ని ఎదిరించి నిలిచేదెవరు? ఇంకా ఆయన మనలను తప్పు పట్టడమెందుకు?” అని నీవు నాతో అనవచ్చు.
రోమీయులకు 9 : 20 (IRVTE)
అది సరే గానీ, ఓ మనిషీ, దేవుణ్ణి ఎదురు ప్రశ్నించడానికి నీ వెవరివి? నన్నెందుకిలా చేశావు అని తయారైనది తనను తయారు చేసిన వానితో చెప్పగలదా?
రోమీయులకు 9 : 21 (IRVTE)
ఒకే మట్టి ముద్దలో నుండి ఒక పాత్రను ప్రత్యేకమైన వాడకం కోసం, ఇంకొకటి రోజువారీ వాడకం కోసం చేయడానికి కుమ్మరికి అధికారం లేదా? [PE][PS]
రోమీయులకు 9 : 22 (IRVTE)
ఆ విధంగా దేవుడు తన కోపాన్ని చూపాలనీ తన ప్రభావాన్ని వెల్లడి పరచాలనీ కోరుకుని, నాశనానికి నిర్ణయమై, కోపానికి గురైన పాత్రలను ఎంతో సహనంతో ఓర్చుకొంటే ఏమిటి?
రోమీయులకు 9 : 23 (IRVTE)
తద్వారా మహిమ పొందాలని ఆయన ముందుగా సిద్ధం చేసిన ఆ కరుణ పొందిన పాత్రల పట్ల,
రోమీయులకు 9 : 24 (IRVTE)
అంటే యూదులపై మాత్రమే కాక, యూదేతరుల్లో నుండి ఆయన పిలిచిన మనపై, తన మహిమైశ్వర్యాన్ని చూపాలని సంకల్పిస్తే ఏమిటి? (5) యూదుల గుడ్డితనం, యూదేతరులకు కృప గురించి ప్రవక్తలు ముందుగానే చెప్పారు [PE][PS]
రోమీయులకు 9 : 25 (IRVTE)
దీని గురించి హోషేయ గ్రంథంలో ఆయన ఇలా చెబుతున్నాడు, [QBR] “నా ప్రజలు కాని వారికి నా ప్రజలనీ, [QBR] ప్రేయసి కాని దానికి ప్రేయసి అనీ, పేరు పెడతాను. [QBR]
రోమీయులకు 9 : 26 (IRVTE)
మీరు నా ప్రజలు కారని వారితో ఎక్కడ చెప్పారో అక్కడే ‘జీవం గల దేవుని కుమారులు’ అని వారికి పేరు పెట్టడం జరుగుతుంది.” [PE][PS]
రోమీయులకు 9 : 27 (IRVTE)
(27-28) “ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకలాగా విస్తారంగా ఉన్నప్పటికీ శేషమే రక్షణ పొందుతుంది. ఎందుకంటే ప్రభువు తన మాటను ఈ భూలోకంలో త్వరితంగా, సంపూర్తిగా నెరవేరుస్తాడు” అని యెషయా కూడా ఇశ్రాయేలు గురించి పెద్ద స్వరంతో చెబుతున్నాడు.
రోమీయులకు 9 : 28 (IRVTE)
రోమీయులకు 9 : 29 (IRVTE)
యెషయా ముందుగానే చెప్పిన ప్రకారం, [QBR] “సైన్యాలకు అధిపతి అయిన ప్రభువు, మనకు పిల్లలను మిగిల్చి ఉండకపోతే సొదొమలా అయ్యేవాళ్ళం, [QBR] గొమొర్రాలాగా ఉండే వాళ్ళం.” [PE][PS]
రోమీయులకు 9 : 30 (IRVTE)
అలా అయితే మనం ఏమనగలం? న్యాయాన్ని వెదకని యూదేతరులు నీతిని, అంటే విశ్వాసమూలమైన నీతిని పొందారు.
రోమీయులకు 9 : 31 (IRVTE)
అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమాన్ని వెంటాడినా దాన్ని చేరుకోలేకపోయారు.
రోమీయులకు 9 : 32 (IRVTE)
ఎందుకు? ఎందుకంటే వారు దాన్ని విశ్వాసంతో కాక తమ క్రియల ద్వారా అందుకోవాలని చూశారు. [QBR]
రోమీయులకు 9 : 33 (IRVTE)
“ఇదిగో నేను సీయోనులో ఒక అడ్డురాయిని, [QBR] తొట్రుపడేలా చేసే ఒక అడ్డుబండను ఉంచుతాను. [QBR] ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గు పడడు” అని రాసి ఉన్న ప్రకారం వారు ఆ అడ్డురాయి తగిలి, తొట్రుపడ్డారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: