దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 1 (TEV)
అప్పుడు ఇశ్రాయేలీయులందరును హెబ్రోనులో నుండు దావీదునొద్దకు కూడి వచ్చిచిత్తగిం చుము, మేము నీకు ఎముకనంటినవారము రక్తసంబంధులము.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 2 (TEV)
ఇంతకు ముందు సౌలు రాజైయున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై యుంటివినా జనులగు ఇశ్రాయేలీ యులను నీవు ఏలి వారిమీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవిచేసిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 3 (TEV)
ఇశ్రాయేలీయుల పెద్దలందరును హెబ్రోనులోనున్న రాజు నొద్దకు రాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధనచేసెను; అప్పుడు వారు సమూ యేలుద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకము చేసిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 4 (TEV)
తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరును యెరూషలే మనబడిన యెబూసునకు పోయిరి; ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 5 (TEV)
అప్పుడునీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 6 (TEV)
ఎవడు మొదట యెబూ సీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 7 (TEV)
తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదుపురమను పేరు కలిగెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 8 (TEV)
దావీదు మిల్లో మొదలుకొని చుట్టును పట్టణమును కట్టించెను; యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగుచేసెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 9 (TEV)
సైన్యముల కధిపతియగు యెహోవా అతనికి తోడైయుండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 10 (TEV)
ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకా రము దావీదును పట్టాభిషేకము చేయుటకై అతని రాజ్యము నందు అతనితోను ఇశ్రాయేలీయులందరితోను కూడి సహాయముచేసిన దావీదునొద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 11 (TEV)
దావీదు నొద్దనుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోనివారు ముప్పదిమంది; వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు;ఇతడు ఒక యుద్ధమందు మూడు వందలమందిని చంపి వారిమీద ఈటె ఆడించినవాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 12 (TEV)
ఇతని తరువాతివాడు అహోహీయుడగు దోదోకుమారుడైన ఎలియాజరు; ఇతడు పరాక్రమ శాలులని పేరుపొందిన ముగ్గురిలో ఒకడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 13 (TEV)
ఫిలిష్తీయులు దానినిండ యవలుగల చేను ఉన్న పస్దమీ్మములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిష్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతోకూడ అచ్చట ఉండెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 14 (TEV)
వీరు ఆ చేనిలో నిలిచి దాని కాపాడి ఫిలిష్తీయులను హతముచేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 15 (TEV)
ముప్పదిమంది పరాక్రమ శాలులలో ముఖ్యులగు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి యుండెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 16 (TEV)
దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిష్తీయుల దండు బేత్లెహేమునందుండెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 17 (TEV)
దావీదు ఆశపడిబేత్లెహేమునందలి ఊరి గవినియొద్ది బావినీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చియిచ్చునని అనగా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 18 (TEV)
ఆ ముగ్గురును ఫిలిష్తీయుల దండులోనికి చొరబడి పోయి బేత్లెహేము ఊరి గవినియొద్ది బావినీళ్లు చేదుకొని దావీదునొద్దకు తీసికొని వచ్చిరి. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 19 (TEV)
నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను; ఈ ముగ్గురు పరా క్రమశాలులు ఇట్టి పనులు చేసిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 20 (TEV)
యోవాబు సహోదరు డైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు; ఇతడు ఒక యుద్ధమందు మూడువందలమందిని హతముచేసి తన యీటె వారిమీద ఆడించినవాడై యీ ముగ్గురిలోను పేరుపొందిన వాడాయెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 21 (TEV)
ఈ ముగ్గురిలోను కడమ యిద్దరికంటె అతడు ఘనతనొందినవాడై వారికి అధిపతియాయెను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 22 (TEV)
మరియు కబ్సెయేలు సంబంధుడును పరా క్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమక్రియలవలన గొప్ప వాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమా రుల నిద్దరిని చంపెను;మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపి వేసెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 23 (TEV)
అయిదు మూరల పొడవుగల మంచియెత్తరియైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను; ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెవంటి యీటె యొకటి యుండగా ఇతడు ఒక దుడ్డుకఱ్ఱ చేత పట్టుకొని వానిమీదికిపోయి ఆ యీటెను ఐగుప్తీయుని చేతిలోనుండి ఊడ లాగి దానితో వానిని చంపెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 24 (TEV)
యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 25 (TEV)
ముప్పదిమందిలోను ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు; దావీదు ఇతనిని తన దేహసంరక్షకుల కధిపతిగా ఉంచెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 26 (TEV)
మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అశాహేలు; బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 27 (TEV)
హరో రీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 28 (TEV)
తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 29 (TEV)
హుషాతీయుడైన సిబ్బెకై, అహో హీయుడైన ఈలై,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 30 (TEV)
నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 31 (TEV)
బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 32 (TEV)
గాయషుతోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 33 (TEV)
బహరూమీయుడైన అజ్మావెతు, షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 34 (TEV)
గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనా తాను,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 35 (TEV)
హరారీయుడైన శాకారు కుమారుడగు అహీ యాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 36 (TEV)
మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 37 (TEV)
కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 38 (TEV)
నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 39 (TEV)
అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 40 (TEV)
ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 41 (TEV)
హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 42 (TEV)
రూబేనీయుడైన షీజా కుమారుడును రూబే నీయులకు పెద్దయునైన అదీనా, అతనితోటివారగు ముప్పదిమంది,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 43 (TEV)
మయకా కుమారుడైన హానాను, మిత్నీ యుడైన యెహోషాపాతు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 44 (TEV)
ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కుమారులగు షామా యెహీ యేలు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 45 (TEV)
షిమీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 46 (TEV)
మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 11 : 47 (TEV)
ఎలీయేలు ఓబేదు, మెజోబాయా ఊరివాడైన యహశీయేలు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47

BG:

Opacity:

Color:


Size:


Font: