దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 1 (TEV)
తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను, అతనికి ఒక యిల్లు కట్టుటకై దేవదారు మ్రానులను, కాసెపనివారిని వడ్లవారిని పంపెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 2 (TEV)
తన జనులగు ఇశ్రా యేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీ యులమీద రాజుగాస్థిరపరచెనని దావీదు గ్రహించెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 3 (TEV)
పమ్మట యెరూషలేమునందు దావీదు ఇంక కొందరు స్త్రీలను వివాహము చేసికొని యింక కుమారులను కుమార్తె లను కనెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 4 (TEV)
యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరు లేవనగా, షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 5 (TEV)
ఇభారు ఏలీషూవ ఎల్పాలెటు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 6 (TEV)
నోగహు నెపెగు యాఫీయ
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 7 (TEV)
ఎలీషామా బెయెల్యెదా ఎలీపేలెటు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 8 (TEV)
దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా అభిషేకము చేయబ డెనని విని, ఫిలిష్తీయులందరు దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 9 (TEV)
ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలోదిగిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 10 (TEV)
ఫిలిష్తీయులమీదికి నేను పోయినయెడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా? అని దావీదు దేవునియొద్ద విచారణచేయగా యెహోవాపొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెల విచ్చెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 11 (TEV)
వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతముచేసిజలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము2 అను పేరుపెట్టెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 12 (TEV)
వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చి వేయవలెనని దావీదు సెలవిచ్చెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 13 (TEV)
ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 14 (TEV)
దావీదు తిరిగి దేవునియొద్ద విచారణచేసెను. అందుకు దేవుడునీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టు తిరిగి కంబళిచెట్లకు ఎదురుగా నిలిచి
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 15 (TEV)
కంబళిచెట్ల కొనలయందు కాళ్లచప్పుడు నీకు వినబడునప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారిమీద పడుము; ఆ చప్పుడు వినబడునప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లి యున్నాడని తెలిసికొనుమని సెల విచ్చెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 16 (TEV)
దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబి యోను మొదలుకొని గాజెరువరకు తరిమి హతముచేసిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 14 : 17 (TEV)
కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతట ప్రసిద్ధియాయెను; యెహోవా అతని భయము అన్యజనుల కందరికి కలుగజేసెను.
❮
❯