దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 1 (TEV)
ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొని... వచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 2 (TEV)
దహనబలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 3 (TEV)
పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్షపండ్ల అడను పంచి పెట్టెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 4 (TEV)
మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయ నకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియ మించెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 5 (TEV)
వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెమీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 6 (TEV)
బెనాయా యహజీయేలు అను యాజ కులు ఎప్పుడును దేవుని నిబంధన మందసము ఎదుట బూరలు ఊదువారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 7 (TEV)
ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 8 (TEV)
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.ఆయన నామమును ప్రకటనచేయుడిఆయన కార్యములను జనములలో తెలియజేయుడి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 9 (TEV)
ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడిఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 10 (TEV)
ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి యెహోవాను వెదకువారు హృదయమునందు సంతో షించుదురు గాక.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 11 (TEV)
యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడిఆయన సన్నిధి నిత్యము వెదకుడి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 12 (TEV)
ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారాఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 13 (TEV)
ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసి కొనుడిఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసికొనుడి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 14 (TEV)
ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 15 (TEV)
మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్పసంఖ్యగల జనులుగానుకనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 16 (TEV)
ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 17 (TEV)
ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 18 (TEV)
వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన సెల విచ్చెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 19 (TEV)
యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 20 (TEV)
వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండిరాజ్యమునకును తిరుగులాడుచుండగా
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 21 (TEV)
నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడుచేయవద్దనియు సెలవిచ్చి
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 22 (TEV)
ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్యలేదు వారి నిమిత్తము రాజులను గద్దించెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 23 (TEV)
సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 24 (TEV)
అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములనుప్రచురించుడి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 25 (TEV)
యెహోవా మహా ఘనత వహించినవాడు ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 26 (TEV)
జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 27 (TEV)
ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 28 (TEV)
జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 29 (TEV)
యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొనిఆయనయెదుట సాగిలపడుడి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 30 (TEV)
భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి అప్పుడు భూలోకము కదలకుండును అప్పుడది స్థిరపరచబడును.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 31 (TEV)
యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి. ఆకాశములు ఆనందించునుగాక భూమి సంతోషించునుగాక
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 32 (TEV)
సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక పొలములును వాటియందుండు సర్వమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 33 (TEV)
భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సయించును.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 34 (TEV)
యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 35 (TEV)
దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము మమ్మును చేర్చుకొనుము.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 36 (TEV)
మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము. అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక. ఈలాగున వారు పాడగా జనులందరు ఆమేన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 37 (TEV)
అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసముమీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదె దోమును వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 38 (TEV)
యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 39 (TEV)
గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 40 (TEV)
ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 41 (TEV)
యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతిచేయుటకై వీరితోకూడ హేమానును యెదూతూనును పేళ్లవరుసను ఉదాహరింపబడిన మరి కొందరిని నియమించెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 42 (TEV)
బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతము లను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను.మరియు యెదూతూను కుమారులను అతడు ద్వార పాలకులుగా నియమించెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16 : 43 (TEV)
తరువాత జనులందరును తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి; దావీదును తన యింటి వారిని దీవించుటకై వారియొద్దకు పోయెను.
❮
❯