దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 1 (TEV)
దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయెను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 2 (TEV)
మరియు అతడు ఇశ్రా యేలీయుల యధిపతులందరిని యాజకులను లేవీయులను సమకూర్చెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 3 (TEV)
అప్పుడు లేవీయులు ముప్పది సంవత్సర ములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు కవిలెలో చేర్చబడిరి; వారి సంఖ్య ముప్పది యెనిమిది వేల పురుషులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 4 (TEV)
వీరిలో ఇరువది నాలుగువేలమంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను,ఆరు వేలమంది అధి పతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 5 (TEV)
నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరినాలుగు వేలమంది స్తుతిచేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్యవిశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 6 (TEV)
గెర్షోను కహాతు మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లద్దాను షిమీ అనువారుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 7 (TEV)
లద్దాను కుమారులు ముగ్గురు;
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 8 (TEV)
పెద్దవాడగు యెహీయేలు, జేతాము యోవేలు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 9 (TEV)
షిమీ కుమారులు ముగ్గురు, షెలోమీతు హజీయేలు హారాను, వీరు లద్దాను వంశముయొక్క పితరుల పెద్దలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 10 (TEV)
యహతు జీనా యూషు బెరీయా అను నలుగురును షిమీ కుమారులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 11 (TEV)
యహతు పెద్దవాడు జీనా రెండవవాడు. యూషునకును బెరీయాకును కుమా రులు అనేకులు లేకపోయిరి గనుక తమ పితరుల యింటి వారిలో వారు ఒక్కవంశముగా ఎంచబడిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 12 (TEV)
కహాతు కుమారులు నలుగురు, అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీ యేలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 13 (TEV)
అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధ మైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యే కింపబడిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 14 (TEV)
దైవజనుడగు మోషే సంతతివారు లేవి గోత్రపువారిలో ఎంచబడిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 15 (TEV)
మోషే కుమారులు గెర్షోము ఎలీయెజెరు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 16 (TEV)
గెర్షోము కుమారులలో షెబూయేలు పెద్దవాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 17 (TEV)
ఎలీయెజెరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి, అయితే రెహబ్యాకు అనేకమంది కుమారులుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 18 (TEV)
ఇస్హారు కుమారులలో షెలోమీతు పెద్దవాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 19 (TEV)
హెబ్రోను కుమారులలో యెరీయా పెద్దవాడు, అమర్యా రెండవవాడు,యహజీయేలు మూడవవాడు, యెక్మెయాము నాలుగవవాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 20 (TEV)
ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్ద వాడు యెషీయా రెండవవాడు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 21 (TEV)
మెరారి కుమారులు మహలి మూషి; మహలి కుమారులు ఎలియాజరు కీషు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 22 (TEV)
ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 23 (TEV)
మూషి కుమారులు ముగ్గురు, మహలి ఏదెరు యెరీమోతు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 24 (TEV)
వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్ద లైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 25 (TEV)
ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 26 (TEV)
లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 27 (TEV)
దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 28 (TEV)
వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 29 (TEV)
సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 30 (TEV)
అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడు టకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 31 (TEV)
సమాజపు గుడారమును కాపాడుటయు, పరిశుద్ధస్థలమును కాపాడుటయు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 23 : 32 (TEV)
యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులగు అహరోను సంతతివారికి సహాయము చేయుటయు వారికి నియమింపబడిన పనియైయుండెను.
❮
❯