దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 1 (TEV)
అహరోను సంతతివారికి కలిగిన వంతులేవనగా, అహరోను కుమారులు నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 2 (TEV)
నాదాబును అబీహుయును సంతతిలేకుండ తమ తండ్రికంటె ముందుగా చనిపోయిరి గనుక ఎలియా జరును ఈతామారును యాజకత్వము జరుపుచువచ్చిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 3 (TEV)
దావీదు ఎలియాజరు సంతతివారిలో సాదోకును ఈతామారు సంతతివారిలో అహీమెలెకును ఏర్పరచి, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టి పని నియమించెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 4 (TEV)
వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతివారిలోని పెద్దలకంటె ఎలియాజరు సంతతివారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతివారిలో పదునారుగురు తమ పితరుల యింటివారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో ఎనిమిదిమంది తమ తమ పితరుల యింటివారికి పెద్దలుగాను నియమింపబడిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 5 (TEV)
ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 6 (TEV)
లేవీయులలో శాస్త్రిగానున్న నెతనేలు కుమారుడగు షెమయా రాజు ఎదుటను, అధిపతుల యెదు టను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు ఎదుటను, యాజకులయెదుటను, లేవీయుల యెదుటను, పితరుల యిండ్లపెద్దలైన వారి యెదుటను వారి పేళ్లు దాఖలు చేసెను; ఒక్కొక్క పాత్రలోనుండి యొక పితరుని యింటి చీటి ఎలియాజరు పేరటను ఇంకొకటి ఈతా మారు పేరటను తీయబడెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 7 (TEV)
మొదటి చీటి యెహోయారీబునకు, రెండవది యెదా యాకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 8 (TEV)
మూడవది హారీమునకు, నాలుగవది శెయొరీము నకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 9 (TEV)
అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 10 (TEV)
ఏడవది హక్కోజునకు, ఎనిమిదవది అబీయాకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 11 (TEV)
తొమి్మదవది యేషూవకు పదియవది షెకన్యాకు పదకొండవది ఎల్యాషీబునకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 12 (TEV)
పండ్రెండవది యాకీమునకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 13 (TEV)
పదుమూడవది హుప్పాకు, పదునాలుగవది యెషెబాబునకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 14 (TEV)
పదునయిదవది బిల్గాకు, పదునారవది ఇమ్మేరునకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 15 (TEV)
పదునేడవది హెజీరునకు, పదునెనిమిదవది హప్పి స్సేసునకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 16 (TEV)
పందొమి్మదవది పెతహయాకు ఇరువదియవది యెహెజ్కేలునకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 17 (TEV)
ఇరువదియొకటవది యాకీనునకు, ఇరువది రెండవది గామూలునకు,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 18 (TEV)
ఇరువది మూడవది దెలాయ్యాకు, ఇరువదినాలుగవది మయజ్యాకు పడెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 19 (TEV)
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడగు అహరోనునకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతిచొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఈలాగున ఏర్పాటు ఆయెను.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 20 (TEV)
శేషించిన లేవీ సంతతివారెవరనగా అమ్రాము సంతతిలో షూబాయేలును, షూబాయేలు సంతతిలో యెహెద్యాహును,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 21 (TEV)
రెహబ్యా యింటిలో అనగా రెహబ్యా సంతతిలో పెద్దవాడైన ఇష్షీయాయును,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 22 (TEV)
ఇస్హారీ యులలో షెలోమోతును, షెలోమోతు సంతతిలో యహతును,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 23 (TEV)
హెబ్రోను సంతతిలో పెద్దవాడైన యెరీయా, రెండవవాడైన అమర్యా, మూడవవాడైన యహజీయేలు, నాలుగవవాడైన యెక్మెయాములును,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 24 (TEV)
ఉజ్జీయేలు సంతతిలో మీకాయును మీకా సంతతిలో షామీరును,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 25 (TEV)
ఇష్షీయా సంతతిలో జెకర్యాయును,
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 26 (TEV)
మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 27 (TEV)
యహజీయాహువలన మెరారికి కలిగిన కుమారులెవరనగా బెనో షోహము జక్కూరు ఇబ్రీ.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 28 (TEV)
మహలికి ఎలియాజరు కలిగెను, వీనికి కుమారులు లేకపోయిరి.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 29 (TEV)
కీషు ఇంటివాడు అనగా కీషు కుమారుడు యెరహ్మెయేలు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 30 (TEV)
మూషి కుమారులు మహలి ఏదెరు యెరీమోతు,వీరు తమ పితరుల యిండ్లనుబట్టి లేవీ యులు.
దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24 : 31 (TEV)
వీరును తమ సహోదరులైన అహరోను సంతతివారు చేసినట్లు రాజైన దావీదు ఎదుటను సాదోకు అహీమెలెకు అను యాజకులలోను లేవీయులలోను పితరుల యిండ్ల పెద్దలయెదుటను తమలోనుండు పితరుల యింటి పెద్దలకును తమ చిన్న సహోదరులకును చీట్లు వేసికొనిరి.
❮
❯