రాజులు మొదటి గ్రంథము 17 : 1 (TEV)
అంతట గిలాదు కాపురస్థుల సంబంధియును తిష్బీ యుడునైన ఏలీయా అహాబునొద్దకు వచ్చిఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవాజీవముతోడు నా మాట ప్రకారము గాక, యీ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటిం చెను.
రాజులు మొదటి గ్రంథము 17 : 2 (TEV)
పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై
రాజులు మొదటి గ్రంథము 17 : 3 (TEV)
నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;
రాజులు మొదటి గ్రంథము 17 : 4 (TEV)
ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా
రాజులు మొదటి గ్రంథము 17 : 5 (TEV)
అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను.
రాజులు మొదటి గ్రంథము 17 : 6 (TEV)
అక్కడ కాకోలములు ఉదయ మందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.
రాజులు మొదటి గ్రంథము 17 : 7 (TEV)
కొంతకాలమైనతరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను.
రాజులు మొదటి గ్రంథము 17 : 8 (TEV)
అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునీవు సీదోను పట్టణ సంబంధ మైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము;
రాజులు మొదటి గ్రంథము 17 : 9 (TEV)
నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక విధవరాలికి నేను సెల విచ్చితిని.
రాజులు మొదటి గ్రంథము 17 : 10 (TEV)
అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవినియొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసికొనిరమ్మని వేడుకొనెను.
రాజులు మొదటి గ్రంథము 17 : 11 (TEV)
ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడామెను మరల పిలిచినాకొక రొట్టెముక్కను నీ చేతిలో తీసికొని రమ్మని చెప్పెను.
రాజులు మొదటి గ్రంథము 17 : 12 (TEV)
అందుకామెనీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నాయొద్దనున్నవే గాని అప్పమొకటైన లేదు, మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసికొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితిననెను.
రాజులు మొదటి గ్రంథము 17 : 13 (TEV)
అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లనెనుభయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము; అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదటచేసి నాయొద్దకు తీసికొనిరమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసికొనుము.
రాజులు మొదటి గ్రంథము 17 : 14 (TEV)
భూమిమీద యెహోవా వర్షము కురిపించువరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువకాదు, బుడ్డిలో నూనె అయిపోదని
రాజులు మొదటి గ్రంథము 17 : 15 (TEV)
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియున్నాడు అనెను. అంతట ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాటచొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె యింటి వారును అనేకదినములు భోజనముచేయుచు వచ్చిరి.
రాజులు మొదటి గ్రంథము 17 : 16 (TEV)
యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు.
రాజులు మొదటి గ్రంథము 17 : 17 (TEV)
అటుతరువాత ఆ యింటి యజ మానురాలైన ఆమె కుమారుడు రోగియై ప్రాణము నిలువ జాలనంత వ్యాధిగలవాడాయెను.
రాజులు మొదటి గ్రంథము 17 : 18 (TEV)
ఆమె ఏలీయాతోదైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా
రాజులు మొదటి గ్రంథము 17 : 19 (TEV)
అతడునీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి, ఆమె కౌగిటిలోనుండి వానిని తీసికొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచముమీద వాని పరుండబెట్టి
రాజులు మొదటి గ్రంథము 17 : 20 (TEV)
యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన యీ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమెమీదికి కీడు రాజేసితివా అని యెహో వాకు మొఱ్ఱపెట్టి
రాజులు మొదటి గ్రంథము 17 : 21 (TEV)
ఆ చిన్న వానిమీద ముమ్మారు తాను పారచాచుకొనియెహోవా నా దేవా, నా మొఱ్ఱ ఆలకించి యీ చిన్న వానికి ప్రాణము మరల రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా
రాజులు మొదటి గ్రంథము 17 : 22 (TEV)
యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.
రాజులు మొదటి గ్రంథము 17 : 23 (TEV)
ఏలీయా ఆ చిన్నవాని తీసికొని గదిలోనుండి దిగి యింట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి--ఇదిగో నీ కుమారుడు; వాడు బ్రదుకుచున్నాడని చెప్పగా
రాజులు మొదటి గ్రంథము 17 : 24 (TEV)
ఆ స్త్రీ ఏలీయాతోనీవు దైవజనుడవై యున్నావనియు నీవు పలుకుచున్న యెహోవామాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదు ననెను.
❮
❯