రాజులు మొదటి గ్రంథము 9 : 1 (TEV)
సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును... కట్టుటయు, తాను చేయకోరినదంతటిని చేయుటయు ముగించిన తరువాత
రాజులు మొదటి గ్రంథము 9 : 2 (TEV)
గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవమారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై
రాజులు మొదటి గ్రంథము 9 : 3 (TEV)
అతనితో ఈలాగు సెలవిచ్చెనునా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన యీ మందిరమును పరిశుద్ధపరచియున్నాను; నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడు అక్కడ ఉండును.
రాజులు మొదటి గ్రంథము 9 : 4 (TEV)
నీ తండ్రి యైన దావీదు నడిచినట్లు నీవును యథార్థహృద యుడవై నీతిని బట్టి నడుచుకొని, నేను నీకు సెలవిచ్చిన దంతటిప్రకారము చేసి నా కట్టడలను విధులను అను సరించిన యెడల
రాజులు మొదటి గ్రంథము 9 : 5 (TEV)
నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయులమీద సింహాసనాసీనుడై యుండక మానడని నీ తండ్రియైన దావీదునకు నేను సెల విచ్చియున్నట్లు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలమువరకు స్థిరపరచుదును.
రాజులు మొదటి గ్రంథము 9 : 6 (TEV)
అయితే మీరేగాని మీ కుమారులే గాని యేమాత్రమైనను నన్ను వెంబడించుట మాని, నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక యితరమైన దేవతలను కొలిచి పూజిం చినయెడల
రాజులు మొదటి గ్రంథము 9 : 7 (TEV)
నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన యీ దేశ ములో వారిని ఉండనియ్యక వారిని నిర్మూలము చేసి, నా నామమునకు నేను పరిశుద్ధ పరచిన యీ మందిరమును నా సముఖములోనుండి కొట్టివేసెదను; ఇశ్రాయేలీ యులు సర్వజనములలో చెదరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు.
రాజులు మొదటి గ్రంథము 9 : 8 (TEV)
ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యనియెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలా గున ఎందుకు చేసెనని యడుగగా
రాజులు మొదటి గ్రంథము 9 : 9 (TEV)
జనులిట్లందురు ఐగుప్తు దేశములోనుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి యితర దేవతలను ఆధారము చేసికొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారిమీదికి రప్పించియున్నాడు.
రాజులు మొదటి గ్రంథము 9 : 10 (TEV)
సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని యిరువది సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తరువాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంతమట్టుకు దేవదారు మ్రానులను సరళ వృక్షపు మ్రానులను బంగారమును అతనికివచ్చియున్నందున
రాజులు మొదటి గ్రంథము 9 : 11 (TEV)
సొలొమోను గలిలయ దేశమందున్న యిరువది పట్టణములను హీరాము కప్పగించెను.
రాజులు మొదటి గ్రంథము 9 : 12 (TEV)
హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరునుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక
రాజులు మొదటి గ్రంథము 9 : 13 (TEV)
నా సహోదరుడా, నీవు నాకిచ్చిన యీ పట్టణములు ఏపాటివనెను. నేటివరకు వాటికి కాబూల్1 అని పేరు.
రాజులు మొదటి గ్రంథము 9 : 14 (TEV)
హీరాము రెండువందల నలువది మణుగుల బంగారమును రాజునకు పంపించెను.
రాజులు మొదటి గ్రంథము 9 : 15 (TEV)
యహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను, యెరూషలేముయొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గెజెరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టి వారిని పెట్టెను.
రాజులు మొదటి గ్రంథము 9 : 16 (TEV)
ఐగుప్తు రాజైన ఫరో గెజెరుమీదికి వచ్చి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తెయైన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను.
రాజులు మొదటి గ్రంథము 9 : 17 (TEV)
సొలొమోను గెజెరును కట్టించెను, మరియు దిగువను బేత్ హోరోనును,
రాజులు మొదటి గ్రంథము 9 : 18 (TEV)
బయతాతును అరణ్యములోనున్న తద్మోరు నును,
రాజులు మొదటి గ్రంథము 9 : 19 (TEV)
సొలొమోను భోజనపదార్థములకు ఏర్పాటైన పట్టణములను, రథములకు ఏర్పాటైన పట్టణములను, రౌతు లకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూష లేమునందును లెబానోనునందును తాను ఏలిన దేశమంతటి యందును ఏదేది కట్టుటకు కోరెనో అదియును కట్టించెను.
రాజులు మొదటి గ్రంథము 9 : 20 (TEV)
అయితే ఇశ్రాయేలీయులుకాని అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులు అను వారిలో శేషించిన వారుండిరి.
రాజులు మొదటి గ్రంథము 9 : 21 (TEV)
ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించియున్న వారి పిల్లలను సొలొమోను దాసత్వముచేయ నియమింపగా నేటివరకు ఆలాగు జరుగుచున్నది.
రాజులు మొదటి గ్రంథము 9 : 22 (TEV)
అయితే ఇశ్రాయేలీయులలో ఎవనినైనను సొలొమోను దాసునిగా చేయలేదు; వారు రాణువవారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి.
రాజులు మొదటి గ్రంథము 9 : 23 (TEV)
సొలొమోను యొక్క పనిమీదనున్న ప్రధానులు ఐదువందల ఏబదిమంది; వీరు పనివాండ్లమీద అధికారులుగా ఉండిరి.
రాజులు మొదటి గ్రంథము 9 : 24 (TEV)
ఫరో కుమార్తె దావీదు పురమునుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను.
రాజులు మొదటి గ్రంథము 9 : 25 (TEV)
మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠముమీద ఏడాదిలో మూడు మారులు దహనబలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు, యెహోవా సముఖ మందున్న పీఠముమీద ధూపద్రవ్యము వేయుచుండెను; పిమ్మట అతడు మందిరమును సమాప్తము చేసెను.
రాజులు మొదటి గ్రంథము 9 : 26 (TEV)
మరియు రాజైన సొలొమోను ఎదోముదేశపు ఎఱ్ఱ సముద్రతీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడ లను కట్టించెను.
రాజులు మొదటి గ్రంథము 9 : 27 (TEV)
సొలొమోను సేవకులతో కూడ హీరాము సముద్రప్రయాణముచేయ నెరిగిన ఓడవారైన తన దాసులను ఓడలమీద పంపెను.
రాజులు మొదటి గ్రంథము 9 : 28 (TEV)
వారు ఓఫీరను స్థలమునకు పోయి అచ్చటనుండి యెనిమిది వందల నలువది మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.
❮
❯