సమూయేలు మొదటి గ్రంథము 17 : 1 (TEV)
ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమ... కూర్చి యూదా దేశములోని శోకోలో కూడి ఏఫెస్దమీ్మము దగ్గర శోకోకును అజేకాకును మధ్యను దిగి యుండగా
సమూయేలు మొదటి గ్రంథము 17 : 2 (TEV)
సౌలును ఇశ్రాయేలీయులును కూడివచ్చి ఏలాలోయలో దిగి ఫిలిష్తీయుల కెదురుగ యుద్ధపంక్తులు తీర్చిరి.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 3 (TEV)
ఫిలిష్తీయులు ఆతట్టు పర్వతము మీదను ఇశ్రా యేలీయులు ఈతట్టు పర్వతముమీదను నిలిచియుండగా ఉభయుల మధ్యను ఒక లోయయుండెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 4 (TEV)
గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 5 (TEV)
అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను, అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 6 (TEV)
మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి యుండెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 7 (TEV)
అతని యీటె కఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటెకొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 8 (TEV)
అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచియుద్ధపంక్తులు తీర్చుటకై మీ రెందుకు బయలుదేరి వచ్చితిరి?నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులుకారా? మీ పక్షముగా ఒకనిని ఏర్ప రచుకొని అతని నాయొద్దకు పంపుడి;
సమూయేలు మొదటి గ్రంథము 17 : 9 (TEV)
అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగినయెడల మేము మీకు దాసుల మగుదుము; నేనతని జయించి చంపినయెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 10 (TEV)
ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 11 (TEV)
సౌలును ఇశ్రా యేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 12 (TEV)
దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయు డైన యెష్షయి అనువాని కుమారుడు.యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 13 (TEV)
అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమా రుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,
సమూయేలు మొదటి గ్రంథము 17 : 14 (TEV)
దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని
సమూయేలు మొదటి గ్రంథము 17 : 15 (TEV)
దావీదు బేత్లెహేములోతన తండ్రి గొఱ్ఱలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 16 (TEV)
ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 17 (TEV)
యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచినీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరులదగ్గరకు త్వరగా పొమ్ము.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 18 (TEV)
మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొని రమ్మనిచెప్పి పంపివేసెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 19 (TEV)
సౌలును వారును ఇశ్రా యేలీయులందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా
సమూయేలు మొదటి గ్రంథము 17 : 20 (TEV)
దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తన కిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 21 (TEV)
సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులును యుద్ధసన్న ద్ధులై బయలుదేరు చుండిరి.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 22 (TEV)
దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి, పరు గెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశలప్రశ్నలు తన సహోదరుల నడిగెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 23 (TEV)
అతడు వారితో మాటలాడు చుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 24 (TEV)
ఇశ్రాయేలీయులందరు ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని యెదుటనుండి పారిపోగా
సమూయేలు మొదటి గ్రంథము 17 : 25 (TEV)
ఇశ్రాయేలీయులలో ఒకడువచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రా యేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరు చున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా
సమూయేలు మొదటి గ్రంథము 17 : 26 (TEV)
దావీదుజీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా
సమూయేలు మొదటి గ్రంథము 17 : 27 (TEV)
జనులువాని చంపినవానికి ఇట్లిట్లు చేయ బడునని అతని కుత్తరమిచ్చిరి.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 28 (TEV)
అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్న యగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితోనీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱ మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 29 (TEV)
అందుకు దావీదునేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి
సమూయేలు మొదటి గ్రంథము 17 : 30 (TEV)
అతనియొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆ ప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 31 (TEV)
దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువ నంపెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 32 (TEV)
ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరిమనస్సును క్రుంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా
సమూయేలు మొదటి గ్రంథము 17 : 33 (TEV)
సౌలుఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 34 (TEV)
అందుకు దావీదు సౌలుతో ఇట్లనెనుమీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱ పిల్లను ఎత్తికొని పోవుచుండగ.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 35 (TEV)
నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 36 (TEV)
మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదానివలె అగుననియు,
సమూయేలు మొదటి గ్రంథము 17 : 37 (TEV)
సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటి యొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలుపొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 38 (TEV)
పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవ చము తొడిగించెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 39 (TEV)
ఈ సామగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ల కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదుఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి
సమూయేలు మొదటి గ్రంథము 17 : 40 (TEV)
తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీ యుని చేరువకు పోయెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 41 (TEV)
డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకువచ్చి
సమూయేలు మొదటి గ్రంథము 17 : 42 (TEV)
చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 43 (TEV)
ఫిలిష్తీయుడుకఱ్ఱ తీసి కొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపిం చెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 44 (TEV)
నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగముల కును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీ యుడు దావీదుతో అనగా
సమూయేలు మొదటి గ్రంథము 17 : 45 (TEV)
దావీదునీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 46 (TEV)
ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 47 (TEV)
అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువా రందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 48 (TEV)
ఆ ఫిలిష్తీ యుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి
సమూయేలు మొదటి గ్రంథము 17 : 49 (TEV)
తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయునినుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందున వాడు నేలను బోర్లపడెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 50 (TEV)
దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 51 (TEV)
వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయునిమీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారి పోయిరి.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 52 (TEV)
అప్పుడు ఇశ్రాయేలువారును యూదావారును లేచిజయము జయమని అరచుచు లోయవరకును షరా యిము ఎక్రోనువరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీ యులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 53 (TEV)
అప్పుడు ఇశ్రా యేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 54 (TEV)
అయితే దావీదు ఆ ఫిలిష్తీ యుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 55 (TEV)
సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి అబ్నేరూ, ఈ ¸°వనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరురాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 56 (TEV)
అందుకు రాజుఈ పడుచువాడు ఎవని కుమా రుడో అడిగి తెలిసికొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 57 (TEV)
దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొనివచ్చెను.
సమూయేలు మొదటి గ్రంథము 17 : 58 (TEV)
సౌలు అతనిని చూచిచిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగాదావీదునేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58

BG:

Opacity:

Color:


Size:


Font: