1 థెస్సలొనీకయులకు 5 : 1 (TEV)
సహోదరులారా, ఆ కాలములనుగూర్చియు ఆ సమ యములనుగూర్చియు మీకు వ్రాయనక్కరలేదు.
1 థెస్సలొనీకయులకు 5 : 2 (TEV)
రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.
1 థెస్సలొనీకయులకు 5 : 3 (TEV)
లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొను చుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు
1 థెస్సలొనీకయులకు 5 : 4 (TEV)
సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు.
1 థెస్సలొనీకయులకు 5 : 5 (TEV)
మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము.
1 థెస్సలొనీకయులకు 5 : 6 (TEV)
కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.
1 థెస్సలొనీకయులకు 5 : 7 (TEV)
నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు.
1 థెస్సలొనీకయులకు 5 : 8 (TEV)
మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణ మును ధరించుకొందము.
1 థెస్సలొనీకయులకు 5 : 9 (TEV)
ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.
1 థెస్సలొనీకయులకు 5 : 10 (TEV)
మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతోకూడ జీవించునిమిత్తము ఆయన మనకొరకు మృతిపొందెను.
1 థెస్సలొనీకయులకు 5 : 11 (TEV)
కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి.
1 థెస్సలొనీకయులకు 5 : 12 (TEV)
మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారైయుండి మీకు బుద్ధి చెప్పువారిని మన్ననచేసి
1 థెస్సలొనీకయులకు 5 : 13 (TEV)
వారి పనినిబట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము; మరియు ఒకనితో నొకడు సమాధానముగా ఉండుడి.
1 థెస్సలొనీకయులకు 5 : 14 (TEV)
సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘ శాంతముగలవారై యుండుడి.
1 థెస్సలొనీకయులకు 5 : 15 (TEV)
ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండ చూచుకొనుడి;మీరు ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను ఎల్లప్పుడు మేలైనదానిని అనుసరించి నడుచుకొనుడి.
1 థెస్సలొనీకయులకు 5 : 16 (TEV)
ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి;
1 థెస్సలొనీకయులకు 5 : 17 (TEV)
యెడతెగక ప్రార్థనచేయుడి;
1 థెస్సలొనీకయులకు 5 : 18 (TEV)
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
1 థెస్సలొనీకయులకు 5 : 19 (TEV)
ఆత్మను ఆర్పకుడి.
1 థెస్సలొనీకయులకు 5 : 20 (TEV)
ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి.
1 థెస్సలొనీకయులకు 5 : 21 (TEV)
సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి.
1 థెస్సలొనీకయులకు 5 : 22 (TEV)
ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి.
1 థెస్సలొనీకయులకు 5 : 23 (TEV)
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహి తముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక.
1 థెస్సలొనీకయులకు 5 : 24 (TEV)
మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును.
1 థెస్సలొనీకయులకు 5 : 25 (TEV)
సహోదరులారా, మాకొరకు ప్రార్థనచేయుడి.
1 థెస్సలొనీకయులకు 5 : 26 (TEV)
పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
1 థెస్సలొనీకయులకు 5 : 27 (TEV)
సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను.
1 థెస్సలొనీకయులకు 5 : 28 (TEV)
మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక.
❮
❯