1 తిమోతికి 6 : 1 (TEV)
దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడ కుండునట్లు దాసత్వమను కాడిక్రింద ఉన్నవారందరును, తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని యెంచ వలెను.
1 తిమోతికి 6 : 2 (TEV)
విశ్వాసులైన యజమానులుగల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక, తమ సేవాఫలము పొందువారు విశ్వాసులును ప్రియులునై యున్నారని మరి యెక్కువగా వారికి సేవచేయవలెను; ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము.
1 తిమోతికి 6 : 3 (TEV)
ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క హిత వాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీక రింపక, భిన్నమైనబోధనుపదేశించినయెడల
1 తిమోతికి 6 : 4 (TEV)
వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురను మానములును,
1 తిమోతికి 6 : 5 (TEV)
చెడిపోయిన మనస్సుకలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకొను మనుష్యుల వ్యర్థవివాదములును కలుగుచున్నవి.
1 తిమోతికి 6 : 6 (TEV)
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.
1 తిమోతికి 6 : 7 (TEV)
మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము.
1 తిమోతికి 6 : 8 (TEV)
కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము.
1 తిమోతికి 6 : 9 (TEV)
ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.
1 తిమోతికి 6 : 10 (TEV)
ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి.
1 తిమోతికి 6 : 11 (TEV)
దైవజనుడా, నీవైతే వీటివి విసర్జించి, నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపా దించుకొనుటకు ప్రయాసపడుము.
1 తిమోతికి 6 : 12 (TEV)
విశ్వాససంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్యజీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులయెదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి.
1 తిమోతికి 6 : 13 (TEV)
సమస్తమునకు జీవా ధారకుడైన దేవుని యెదుటను, పొంతిపిలాతునొద్ద ధైర్య ముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తుయేసు ఎదుటను,
1 తిమోతికి 6 : 14 (TEV)
మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను.
1 తిమోతికి 6 : 15 (TEV)
శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు.
1 తిమోతికి 6 : 16 (TEV)
సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వ ముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.
1 తిమోతికి 6 : 17 (TEV)
ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమి్మకయుంచక,సుఖముగా అనుభ వించుటకు సమస్తమును మనకు ధారాళముగ దయ చేయు దేవునియందే నమి్మకయుంచుడని ఆజ్ఞాపించుము.
1 తిమోతికి 6 : 18 (TEV)
వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము, రాబోవు కాలమునకు మంచి పునాది తమకొరకు వేసి కొనుచు, మేలుచేయువారును,
1 తిమోతికి 6 : 19 (TEV)
సత్‌క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని వారికి ఆజ్ఞా పించుము.
1 తిమోతికి 6 : 20 (TEV)
ఓ తిమోతి, నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అప విత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము.
1 తిమోతికి 6 : 21 (TEV)
ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విష యము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: