దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 1 (TEV)
ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న... ఇశ్రాయేలువారందరును యూదా పట్టణములకు పోయి, యూదాదేశమంతటను, బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశముల యందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలముచేసి, దేవతాస్తంభములను ముక్కలుగా నరికి, ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టిరి; తరువాత ఇశ్రాయేలువారందరును తమ తమ పట్టణములలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్లిరి
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 2 (TEV)
అంతట హిజ్కియా యెవరి సేవాధర్మము వారు జరుపుకొనునట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను; దహనబలులను సమాధాన బలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకును, యెహోవా పాళెపు ద్వారముల యొద్దస్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియ మించెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 3 (TEV)
మరియు యెహోవాధర్మశాస్త్రమునందు వ్రాయ బడియున్న విధినిబట్టి జరుగు ఉదయాస్తమయముల దహన బలులను విశ్రాంతిదినములకును అమావాస్యలకును నియా మకకాలములకును ఏర్పడియున్న దహనబలులను అర్పిం చుటకై తనకు కలిగిన ఆస్తిలోనుండి రాజు ఒక భాగమును ఏర్పాటుచేసెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 4 (TEV)
మరియు యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులును లేవీయులును ధైర్యము వహించి తమ పని జరుపుకొనునట్లు ఎవరి భాగములను వారికి ఇయ్య వలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 5 (TEV)
ఆ యాజ్ఞ వెల్లడియగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొని వచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొని వచ్చిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 6 (TEV)
యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యూదా వారును ఎద్దులలోను గొఱ్ఱలలోను పదియవవంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదియవ వంతును తీసికొని వచ్చి కుప్పలుగా కూర్చిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 7 (TEV)
వారు మూడవ మాసమందు కుప్పలువేయ నారంభించి ఏడవ మాసమందు ముగించిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 8 (TEV)
హిజ్కియాయును అధి పతులును వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 9 (TEV)
హిజ్కియా ఆ కుప్పలనుగూర్చి యాజకులను లేవీయులను ఆలోచన యడిగినందుకు సాదోకు సంతతివాడును ప్రధానయాజ కుడునగు అజర్యా
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 10 (TEV)
యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటినుండి మేము సమృద్ధిగా భోజనముచేసినను చాలా మిగులుచున్నది; యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్పరాశి మిగిలినదని రాజుతోననగా
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 11 (TEV)
హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 12 (TEV)
వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండ కానుకలను పదియవ భాగములను ప్రతి ష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి; లేవీయు డైన కొనన్యా వాటిమీద విచారణకర్తగా నియమింపబడెను; అతని సహోదరుడైన షిమీ అతనికి సహకారిగా ఉండెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 13 (TEV)
మరియు యెహీయేలు అజజ్యాహు నహతు అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మ క్యాహు మహతు బెనాయాలనువారు రాజైన హిజ్కియా వలనను, దేవుని మందిరమునకు అధిపతియైన అజర్యావలనను, తాము పొందిన ఆజ్ఞచొప్పున కొనన్యా చేతిక్రిందను, అతని సహోదరుడగు షిమీ చేతిక్రిందను కనిపెట్టువారై యుండిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 14 (TEV)
తూర్పుతట్టు ద్వారమునొద్ద పాల కుడును ఇమ్నా కుమారుడునగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతిపరిశుద్ధమైనవాటిని పంచి పెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణలమీద నియమింపబడెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 15 (TEV)
అతని చేతిక్రింద ఏదెను మిన్యామీను యేషూవ షెమయా అమర్యా షెకన్యా అనువారు నమ్మకమైనవారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతులచొప్పున భాగము లిచ్చుటకు నియమింపబడిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 16 (TEV)
ఇదియుగాక గోత్రములలో మూడు సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారికందరికిని, వంతులచొప్పున సేవచేయుటకై ప్రతిదినము యెహోవా మందిరములోనికి వచ్చువారందరికిని,
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 17 (TEV)
ఇరువది సంవత్సర ములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై వంతుల చొప్పున సేవచేయుటకు తమ తమ పితరుల వంశములచొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు,
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 18 (TEV)
అనగా నమ్మకమైనవారై తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీ యులకును, తమ పిల్లలతోను భార్యలతోను కుమారులతోను కుమార్తెలతోను
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 19 (TEV)
సమాజమంతటను సరిచూడబడిన వారికిని, ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును, వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి యుండిరి. పేళ్లచేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికిని, లేవీయులలో వంశములచొప్పున సరిచూడబడిన వారికందరి కిని వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 20 (TEV)
హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను.
దినవృత్తాంతములు రెండవ గ్రంథము 31 : 21 (TEV)
తన దేవుని ఆశ్ర యించుటకై దేవుని మందిర సేవవిషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటివిషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21