2 యోహాను 1 : 1 (TEV)
పెద్దనైన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది.
2 యోహాను 1 : 2 (TEV)
నేనును, నేను మాత్రమే గాక సత్యము ఎరిగినవారందరును, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడు ఉండు సత్యమునుబట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము.
2 యోహాను 1 : 3 (TEV)
సత్యప్రేమలు మనయందుండగా తండ్రియైన దేవుని యొద్దనుండియు, తండ్రియొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్దనుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును.
2 యోహాను 1 : 4 (TEV)
తండ్రివలన మనము ఆజ్ఞను పొందినప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి1 నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను.
2 యోహాను 1 : 5 (TEV)
కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటనుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరి నొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను.
2 యోహాను 1 : 6 (TEV)
మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.
2 యోహాను 1 : 7 (TEV)
యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు.
2 యోహాను 1 : 8 (TEV)
అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.
2 యోహాను 1 : 9 (TEV)
క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు.
2 యోహాను 1 : 10 (TEV)
ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.
2 యోహాను 1 : 11 (TEV)
శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.
2 యోహాను 1 : 12 (TEV)
అనేక సంగతులు మీకు వ్రాయవలసియుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సులేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖా ముఖిగా మాటలాడ నిరీక్షించుచ
2 యోహాను 1 : 13 (TEV)
ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13