రాజులు రెండవ గ్రంథము 9 : 1 (TEV)
అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెనునీవు నడుము బిగించుకొని యీ తైలపుగిన్నె చేత పట్టుకొని రామో త్గిలాదునకు పోయి
రాజులు రెండవ గ్రంథము 9 : 2 (TEV)
అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెక్కడ నున్నాడని తెలిసికొని అతనిని దర్శించి, అతని సహోదరుల మధ్యనుండి అతనిని చాటుగా రప్పించి, లోపలి గదిలోకి అతనిని పిలుచుకొని పోయి
రాజులు రెండవ గ్రంథము 9 : 3 (TEV)
తైలపుగిన్నె తీసికొని అతని తలమీద తైలము పోసినేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపుతీసి పారి పొమ్ము.
రాజులు రెండవ గ్రంథము 9 : 4 (TEV)
¸°వనుడైన ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చునప్పటికి సైన్యాధిపతులు కూర్చుని యుండిరి.
రాజులు రెండవ గ్రంథము 9 : 5 (TEV)
అప్పుడతడు అధిపతీ, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా యెహూయిందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు అధిపతీ నిన్ను గూర్చినదే యనెను; అందుకు యెహూ లేచి యింటిలో ప్రవేశిం చెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 6 (TEV)
అప్పుడు ఆ ¸°వనుడు అతని తలమీద తైలము పోసి అతనితో ఇట్లనెనుఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగాయెహోవా జనులైన ఇశ్రాయేలు వారిమీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను.
రాజులు రెండవ గ్రంథము 9 : 7 (TEV)
కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసినదానిని బట్టియు, యెహోవా సేవకులందరిని హతము చేసిన దానిని బట్టియు,యెజెబెలునకు ప్రతికారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతివారిని హతముచేయుము.
రాజులు రెండవ గ్రంథము 9 : 8 (TEV)
అహాబు సంతతివారందరును నశింతురు; అల్పులలోనేమి ఘనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండ కుండ అందరిని నిర్మూలము చేయుము.
రాజులు రెండవ గ్రంథము 9 : 9 (TEV)
నెబాతు కుమారు డైన యరొబాము కుటుంబికులను అహీయా కుమారుడైన బయెషా కుటుంబికులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబికులను నేను అప్పగించుదును.
రాజులు రెండవ గ్రంథము 9 : 10 (TEV)
యెజెబెలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కలచేత తినివేయబడును. ఆ ¸°వనుడు ఈ మాటలు చెప్పి తలుపుతీసి పారిపోయెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 11 (TEV)
యెహూ బయలుదేరి తన యజమానుని సేవకులయొద్దకు రాగా ఒకడుఏమి సంభ వించినది? ఆ వెఱ్ఱివాడు నీయొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా, అతడువానిని వాని మాటలు మీరెరిగెయున్నారని చెప్పెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 12 (TEV)
కాబట్టి వారు అదంతయు వట్టిది; జరిగినదానిని మాకు తెలియజెప్పుమనగా అతడిట్లనెనునేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేయు చున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 13 (TEV)
అంతట వారు అతివేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించియెహూ రాజైయున్నాడని చాటించిరి.
రాజులు రెండవ గ్రంథము 9 : 14 (TEV)
ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాముమీద కుట్రచేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలువారందరును సిరియా రాజైన హజాయేలును ఎదిరించుటకై రామో త్గిలాదు దగ్గర కావలి యుండిరి.
రాజులు రెండవ గ్రంథము 9 : 15 (TEV)
అయితే యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనులవలన తాను పొందిన గాయములను బాగు చేసి కొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతట యెహూనీకనుకూలమైతే ఈ సంగతి తెలియ బడకుండునట్లు ఈ పట్టణములోనుండి యెవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనియ్యకుమని ఆజ్ఞ ఇచ్చి
రాజులు రెండవ గ్రంథము 9 : 16 (TEV)
రథముయెక్కి, యెజ్రెయేలు ఊరిలో యెహో రాము మంచము పట్టియుండగా అచ్చటికి పోయెను మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి యుండెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 17 (TEV)
యెజ్రెయేలు గోపురముమీద కావలివాడు నిలిచి యుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచిసైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచివారిని ఎదుర్కొనబోయిసమా ధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమని వానితో సెలవిచ్చెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 18 (TEV)
కాబట్టి యొకడు గుఱ్ఱ మెక్కిపోయి అతనిని ఎదుర్కొనిసమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూసమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడుపంపబడినవాడు వారిని కలిసికొనెను గాని తిరిగి రాక నిలిచెనని సమాచారము తెలిపెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 19 (TEV)
రాజు రెండవ రౌతును పంపగా వాడు వారియొద్దకు వచ్చిసమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూసమధానముతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 20 (TEV)
అప్పుడు కావలి వాడువీడును వారిని కలిసికొని తిరిగిరాక నిలిచెను మరియు అతడు వెఱ్ఱి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీకుమారుడైన యెహూ తోలడమువలెనే యున్న దనెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 21 (TEV)
రథము సిద్ధము చేయుమని యెహోరాము సెల వియ్యగా వారు అతని రథము సిద్ధముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోరామును యూదారాజైన అహజ్యాయును తమ తమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి.
రాజులు రెండవ గ్రంథము 9 : 22 (TEV)
అంతట యెహోరాముయెహూను చూచియెహూ సమాధానమా? అని అడు గగా యెహూనీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమా ధాన మెక్కడనుండి వచ్చుననెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 23 (TEV)
యెహోరాము రథము త్రిప్పి అహజ్యా, ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 24 (TEV)
అప్పుడు యెహూ తన బలముకొలది విల్లు ఎక్కు పెట్టి యెహోరామును భుజ ములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండ దూసి పోయెను గనుక అతడు తన రథమునందే యొరిగెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 25 (TEV)
కాగా యెహూ తన అధిపతియైన బిద్కరును పిలిచి యిట్లనెను అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము; మనమిద్దరమును అతని తండ్రియైన అహాబు వెనుక గుఱ్ఱములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతనిమీద ఈ శిక్షమోపిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.
రాజులు రెండవ గ్రంథము 9 : 26 (TEV)
అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతికారము చేయుదును; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి నీవు యెహోవా మాట చొప్పున అతని ఎత్తి యీ భూభాగమందు పడవేయుము అనెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 27 (TEV)
యూదారాజైన అహజ్యా జరిగిన దాని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను; అయినను యెహూ అతని తరిమి, రథమునందు అతని హతముచేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 28 (TEV)
అప్పుడు అతని సేవకులు అతనిని రథముమీద వేసి యెరూషలేమునకు తీసికొని పోయి దావీదు పురమందు అతని పితరుల సమా ధిలో అతని పాతిపెట్టిరి.
రాజులు రెండవ గ్రంథము 9 : 29 (TEV)
అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము ఏలు బడిలో పదకొండవ సంవత్సరమందు యూదాను ఏల నారంభించెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 30 (TEV)
యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజె బెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసికొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా
రాజులు రెండవ గ్రంథము 9 : 31 (TEV)
యెహూ గుమ్మముద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచినీ యజమానుని చంపినవాడా, జిమీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా
రాజులు రెండవ గ్రంథము 9 : 32 (TEV)
అతడు తలయెత్తి కిటికీ తట్టు చూచినా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి.
రాజులు రెండవ గ్రంథము 9 : 33 (TEV)
దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుఱ్ఱములమీదను చిందెను. మరియు గుఱ్ఱ ములచేత అతడు దానిని త్రొక్కించెను.
రాజులు రెండవ గ్రంథము 9 : 34 (TEV)
అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాతఆ శాపగ్రస్తు రాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొనిపాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా
రాజులు రెండవ గ్రంథము 9 : 35 (TEV)
వారు దానిని పాతిపెట్ట బోయిరి; అయితే దాని కపాలమును పాదములును అర చేతులును తప్ప మరి ఏమియు కనబడలేదు.
రాజులు రెండవ గ్రంథము 9 : 36 (TEV)
వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెనుఇది యెజెబెలని యెవరును గుర్తుపట్టలేకుండ యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును.
రాజులు రెండవ గ్రంథము 9 : 37 (TEV)
యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగ మందున్న పెంటవలె నుండును అని తన సేవకుడును తిష్బీ యుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున యిది జరిగెను.
❮
❯