సమూయేలు రెండవ గ్రంథము 22 : 1 (TEV)
యెహోవా తన్ను సౌలుచేతిలోనుండియు, తనశత్రువులందరి చేతిలోనుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పియెహోవాను స్తోత్రించెను. అతడిట్లనెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 2 (TEV)
యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 3 (TEV)
నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును.నా కేడెము నా రక్షణశృంగమునా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడుబలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 4 (TEV)
కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱ పెట్టితిని నా శత్రువుల చేతిలోనుండి ఆయన నన్ను రక్షించెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 5 (TEV)
మృత్యువుయొక్క అలలు నన్ను చుట్టుకొనగనువరదపొర్లువలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదరించగను
సమూయేలు రెండవ గ్రంథము 22 : 6 (TEV)
పాతాళపాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను
సమూయేలు రెండవ గ్రంథము 22 : 7 (TEV)
నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెనునా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 8 (TEV)
అప్పుడు భూమి కంపించి అదిరెనుపరమండలపు పునాదులు వణకెనుఆయన కోపింపగా అవి కంపించెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 9 (TEV)
ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెనుఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెనునిప్పు కణములను రాజబెట్టెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 10 (TEV)
మేఘములను వంచి ఆయన వచ్చెనుఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 11 (TEV)
కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను.గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 12 (TEV)
గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింపజేసెను.నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 13 (TEV)
ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 14 (TEV)
యెహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 15 (TEV)
తనబాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెనుమెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెనుయెహోవా గద్దింపునకుతన నాసికారంధ్రముల శ్వాసము వడిగావిడువగా ఆయన గద్దింపునకుప్రవాహముల అడుగుభాగములు కనబడెను
సమూయేలు రెండవ గ్రంథము 22 : 16 (TEV)
భూమి పునాదులు బయలుపడెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 17 (TEV)
ఉన్నతస్థలములనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెనునన్ను పట్టుకొని మహా జలరాసులలోనుండి తీసెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 18 (TEV)
బలవంతులగు పగవారు, నన్ను ద్వేషించువారు, నాకంటె బలిష్ఠులై యుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 19 (TEV)
ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 20 (TEV)
నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పిం చెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 21 (TEV)
నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమునుబట్టియే నాకు ప్రతిఫల మిచ్చెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 22 (TEV)
యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడచినవాడను కాను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 23 (TEV)
ఆయన న్యాయవిధుల నన్నిటిని నేను లక్ష్యపెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడనుకాను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 24 (TEV)
దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 25 (TEV)
కావున నేను నిర్దోషినై యుండుట యెహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 26 (TEV)
దయగలవారియెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతులయెడల నీవు యథార్థవంతుడవుగానుందువు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 27 (TEV)
సద్భావముగల వారియెడల నీవు సద్భావము చూపుదువు మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 28 (TEV)
శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేసెదవు
సమూయేలు రెండవ గ్రంథము 22 : 29 (TEV)
యెహోవా, నీవు నాకు దీపమై యున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 30 (TEV)
నీ సహాయముచేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయమువలన నేను ప్రాకారములనుదాటుదును.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 31 (TEV)
దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 32 (TEV)
యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?
సమూయేలు రెండవ గ్రంథము 22 : 33 (TEV)
దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడి పించును.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 34 (TEV)
ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేయును ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపును.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 35 (TEV)
నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు బెట్టును.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 36 (TEV)
నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 37 (TEV)
నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 38 (TEV)
నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 39 (TEV)
నేను వారిని మింగివేయుదును వారిని తుత్తినియలుగా కొట్టుదును వారు నా పాదముల క్రింద పడి లేవలేకయుందురు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 40 (TEV)
యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు నామీదికి లేచినవారిని నీవు అణచివేయుదువు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 41 (TEV)
నా శత్రువులను వెనుకకు మళ్లచేయుదువు నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేయుదును.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 42 (TEV)
వారు ఎదురు చూతురు గాని రక్షించువాడు ఒకడును లేకపోవును వారు యెహోవాకొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 43 (TEV)
నేల ధూళివలె వారిని నలుగగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంటవలె నేను వారిని పారపోసి అణగద్రొక్కెదను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 44 (TEV)
నా ప్రజల కలహములలో పడకుండ నీవు నన్నువిడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 45 (TEV)
అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్నుగూర్చి వినిన మాత్రముచేత నాకు విధేయులగుదురు
సమూయేలు రెండవ గ్రంథము 22 : 46 (TEV)
అన్యులు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 47 (TEV)
యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగును గాక
సమూయేలు రెండవ గ్రంథము 22 : 48 (TEV)
ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 49 (TEV)
ఆయనే నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించును నామీదికి లేచినవారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 50 (TEV)
అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానముచేసెదను.
సమూయేలు రెండవ గ్రంథము 22 : 51 (TEV)
నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమున కును నిత్యము కనికరము చూపువాడవు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51

BG:

Opacity:

Color:


Size:


Font: