సమూయేలు రెండవ గ్రంథము 5 : 1 (TEV)
ఇశ్రాయేలువారి సకల గోత్రములవారు హెబ్రోనులో దావీదునొద్దకు వచ్చిచిత్తగించుము; మేము నీ ఎముకనంటినవారము రక్తసంబంధులము;
సమూయేలు రెండవ గ్రంథము 5 : 2 (TEV)
పూర్వ కాలమున సౌలు మామీద రాజై యుండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడునీవు ఇశ్రాయేలీయులనుబట్టి నా జనులను పాలించి వారిమీద అధిపతివై యుందువని యెహోవా నిన్నుగురించి సెల విచ్చియున్నాడని చెప్పిరి.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 3 (TEV)
మరియు ఇశ్రాయేలువారి పెద్దలందరు హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలువారిమీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 4 (TEV)
దావీదు ముప్పది యేండ్లవాడై యేల నారంభించి నలు వది సంవత్సరములు పరిపాలనచేసెను.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 5 (TEV)
హెబ్రోనులో అతడు యూదా వారందరిమీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరిమీద ముప్పదిమూడు సంవత్సరములు పరిపాలన చేసెను.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 6 (TEV)
యెబూసీయులు దేశములో నివాసులై యుండగా రాజును అతని పక్షమువారును యెరూ షలేమునకు వచ్చిరి.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 7 (TEV)
యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచినీవు వచ్చినయెడల ఇచ్చటి గ్రుడ్డి వారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి అయినను దావీదు పురమన బడిన1 సీయోను కోటను దావీదు స్వాధీన పరచుకొనెను. ఆ దినమున అతడు
సమూయేలు రెండవ గ్రంథము 5 : 8 (TEV)
యెబూసీయులను హతము చేయు వారందరు నీటి కాలువపైకి వెళ్లి, దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు; అతడు ఇంటిలోనికి రాలేడని సామెతపుట్టెను.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 9 (TEV)
దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను. మరియు మిల్లోనుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 10 (TEV)
దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 11 (TEV)
తూరురాజగు హీరాము, దూతలను దేవదారు మ్రాను లను వడ్రంగులను కాసెపనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 12 (TEV)
ఇశ్రాయేలీయులమీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచెననియు, ఇశ్రా యేలీయులనుబట్టి ఆయన జనుల నిమిత్తము, రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 13 (TEV)
దావీదు హెబ్రోనునుండి వచ్చిన తరువాత యెరూష లేములోనుండి యింక అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసికొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులును కుమార్తెలును పుట్టిరి
సమూయేలు రెండవ గ్రంథము 5 : 14 (TEV)
యెరూషలేములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూ యషోబాబు
సమూయేలు రెండవ గ్రంథము 5 : 15 (TEV)
నాతాను సొలొమోను ఇభారు ఏలీషూవ నెపెగు యాఫీయ
సమూయేలు రెండవ గ్రంథము 5 : 16 (TEV)
ఎలీషామా ఎల్యాదా ఎలీపేలెటు అనువారు.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 17 (TEV)
జనులు ఇశ్రాయేలీయులమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరు వచ్చిరి. దావీదు ఆ వార్తవిని ప్రాకారస్థలమునకు వెళ్లిపోయెను.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 18 (TEV)
ఫలిష్తీయులు దండెత్తివచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా
సమూయేలు రెండవ గ్రంథము 5 : 19 (TEV)
దావీదునేను ఫిలిష్తీయుల కెదురుగా పోయెదనా? వారిని నా చేతికప్పగింతువా? అని యెహోవా యొద్దవిచారించినప్పుడుపొమ్ము,నిస్సందేహముగా వారిని నీ చేతికప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 20 (TEV)
కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతముచేసి, జలప్రవాహములు కొట్టుకొనిపోవునట్లు యెహోవా నాశత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమను2 పేరు పెట్టెను.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 21 (TEV)
ఫలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టు కొనిరి.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 22 (TEV)
ఫిలిష్తీయులు మరల వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా
సమూయేలు రెండవ గ్రంథము 5 : 23 (TEV)
దావీదు యెహోవాయొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవానీవు వెళ్లవద్దుచుట్టు తిరిగిపోయి, కంబళిచెట్లకు ఎదురుగావారిమీద పడుము.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 24 (TEV)
కంబళిచెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతముచేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెనని సెల విచ్చెను.
సమూయేలు రెండవ గ్రంథము 5 : 25 (TEV)
దావీదు యెహోవా తనకాజ్ఞాపించిన ప్రకారము చేసి, గెబనుండి గెజెరువరకు ఫిలిష్తీయులను తరుముచు హతముచేసెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25

BG:

Opacity:

Color:


Size:


Font: