అపొస్తలుల కార్యములు 18 : 1 (TEV)
అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అనుఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను.
అపొస్తలుల కార్యములు 18 : 2 (TEV)
యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చిన వారు.
అపొస్తలుల కార్యములు 18 : 3 (TEV)
వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.
అపొస్తలుల కార్యములు 18 : 4 (TEV)
అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను.
అపొస్తలుల కార్యములు 18 : 5 (TEV)
సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను.
అపొస్తలుల కార్యములు 18 : 6 (TEV)
వారు ఎదురాడి దూషించినప్పుడు, అతడు తన వస్త్రములు దులుపుకొనిమీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను నిర్దోషిని; యికమీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి
అపొస్తలుల కార్యములు 18 : 7 (TEV)
అక్కడనుండి వెళ్లి, దేవునియందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతని యిల్లు సమాజమందిరమును ఆనుకొనియుండెను.
అపొస్తలుల కార్యములు 18 : 8 (TEV)
ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటివారందరితోకూడ ప్రభువునందు విశ్వాస ముంచెను. మరియు కొరింథీయులలో అనేకులువిని విశ్వ సించి బాప్తిస్మము పొందిరి.
అపొస్తలుల కార్యములు 18 : 9 (TEV)
రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము.
అపొస్తలుల కార్యములు 18 : 10 (TEV)
నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా
అపొస్తలుల కార్యములు 18 : 11 (TEV)
అతడు వారిమధ్య దేవుని వాక్యము బోధించుచు, ఒక సంవత్సరము మీద ఆరునెలలు అక్కడ నివసించెను.
అపొస్తలుల కార్యములు 18 : 12 (TEV)
గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి
అపొస్తలుల కార్యములు 18 : 13 (TEV)
వీడు ధర్మ శాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరే పించుచున్నాడని చెప్పిరి.
అపొస్తలుల కార్యములు 18 : 14 (TEV)
పౌలు నోరు తెరచి మాట లాడబోగా గల్లియోనుయూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే.
అపొస్తలుల కార్యములు 18 : 15 (TEV)
ఇది యేదోయుక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి
అపొస్తలుల కార్యములు 18 : 16 (TEV)
వారిని న్యాయపీఠము ఎదుటనుండి తోలివేసెను.
అపొస్తలుల కార్యములు 18 : 17 (TEV)
అప్పుడందరు సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్ట సాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతినిగూర్చియు లక్ష్యపెట్టలేదు.
అపొస్తలుల కార్యములు 18 : 18 (TEV)
పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి.
అపొస్తలుల కార్యములు 18 : 19 (TEV)
వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి, తాను మాత్రము సమాజమందిరములో ప్రవేశించి, యూదులతో తర్కించుచుండెను.
అపొస్తలుల కార్యములు 18 : 20 (TEV)
వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా
అపొస్తలుల కార్యములు 18 : 21 (TEV)
అతడు ఒప్పకదేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను.
అపొస్తలుల కార్యములు 18 : 22 (TEV)
తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపువారిని కుశలమడిగి, అంతియొకయకు వచ్చెను.
అపొస్తలుల కార్యములు 18 : 23 (TEV)
అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియయందును సంచరించుచు శిష్యులనందరిని స్థిరపరచెను.
అపొస్తలుల కార్యములు 18 : 24 (TEV)
అలెక్సంద్రియవాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై యుండెను.
అపొస్తలుల కార్యములు 18 : 25 (TEV)
అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మముమాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి,
అపొస్తలుల కార్యములు 18 : 26 (TEV)
ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశద పరచిరి.
అపొస్తలుల కార్యములు 18 : 27 (TEV)
తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేసెను.
అపొస్తలుల కార్యములు 18 : 28 (TEV)
యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను.
❮
❯