ఆమోసు 8 : 1 (TEV)
మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి
ఆమోసు 8 : 2 (TEV)
ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగావేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగానా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికనువారిని విచారణచేయక మానను.
ఆమోసు 8 : 3 (TEV)
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కు వగును, ప్రతిస్థలమందును అవి పారవేయబడును. ఊర కుండుడి.
ఆమోసు 8 : 4 (TEV)
దేశమందు బీదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,
ఆమోసు 8 : 5 (TEV)
తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొను వారలారా,
ఆమోసు 8 : 6 (TEV)
దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.
ఆమోసు 8 : 7 (TEV)
యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమా ణము చేయునదేమనగావారిక్రియలను నేనెన్నడును మరువను.
ఆమోసు 8 : 8 (TEV)
ఇందును గూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపునదివలె అది అణగి పోవును.
ఆమోసు 8 : 9 (TEV)
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్త మింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మ జేయుదును.
ఆమోసు 8 : 10 (TEV)
మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైన శ్రమ దినముగా ఉండును.
ఆమోసు 8 : 11 (TEV)
రాబోవు దినము లందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.
ఆమోసు 8 : 12 (TEV)
కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు;
ఆమోసు 8 : 13 (TEV)
ఆ దినమందు చక్కని కన్యలును ¸°వనులును దప్పిచేత సొమ్మసిల్లు దురు.
ఆమోసు 8 : 14 (TEV)
షోమ్రోనుయొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు, దానూ, నీ దేవుని జీవముతోడనియు, బెయే ర్షెబా మార్గ జీవముతోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండ కూలుదురు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14