ద్వితీయోపదేశకాండమ 23 : 1 (TEV)
గాయమునొందిన వృషణములు గలవాడేగాని మర్మాంగము కోయబడినవాడేగాని యెహోవా సమాజ ములో చేరకూడదు. కుండుడు యెహోవా సమాజ ములో చేరకూడదు.
ద్వితీయోపదేశకాండమ 23 : 2 (TEV)
వానికి పదియవ తరమువాడైనను యెహోవా సమాజములో చేరకూడదు.
ద్వితీయోపదేశకాండమ 23 : 3 (TEV)
అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.
ద్వితీయోపదేశకాండమ 23 : 4 (TEV)
ఏలయనగా మీరు ఐగుప్తులోనుండి వచ్చు చుండగా వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పెతోరులోనుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి.
ద్వితీయోపదేశకాండమ 23 : 5 (TEV)
అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమిం చెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాప మును ఆశీర్వాదముగా చేసెను.
ద్వితీయోపదేశకాండమ 23 : 6 (TEV)
నీ దినములన్నిట ఎన్న డును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు.
ద్వితీయోపదేశకాండమ 23 : 7 (TEV)
ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింప కూడదు. ఐగుప్తుదేశములో నీవు పరదేశివై యుంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు.
ద్వితీయోపదేశకాండమ 23 : 8 (TEV)
వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరమువారు యెహోవా సమాజములో చేరవచ్చును.
ద్వితీయోపదేశకాండమ 23 : 9 (TEV)
నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరునప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండ జాగ్రత్త పడవలెను.
ద్వితీయోపదేశకాండమ 23 : 10 (TEV)
రాత్రి జరిగినదానివలన మైలపడినవాడు మీలో ఉండినయెడల వాడు పాళెము వెలుపలికి వెళ్లిపోవలెను.
ద్వితీయోపదేశకాండమ 23 : 11 (TEV)
అతడు పాళెములో చేరకూడదు; సాయంకాలమున అతడు నీళ్లతో స్నానముచేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును.
ద్వితీయోపదేశకాండమ 23 : 12 (TEV)
పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్లవలెను.
ద్వితీయోపదేశకాండమ 23 : 13 (TEV)
మరియు నీ ఆయుధములుగాక గసిక యొకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్లునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను.
ద్వితీయోపదేశకాండమ 23 : 14 (TEV)
నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువు లను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించు చుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్థముగా ఉండవలెను.
ద్వితీయోపదేశకాండమ 23 : 15 (TEV)
తన యజమానునియొద్దనుండి తప్పించుకొని నీయొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు.
ద్వితీయోపదేశకాండమ 23 : 16 (TEV)
అతడు తన యిష్టప్రకారము నీ గ్రామములలో ఒకదాని యందు తాను ఏర్పరచుకొనిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను; నీవు వాని బాధింపకూడదు.
ద్వితీయోపదేశకాండమ 23 : 17 (TEV)
ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతెయు వేశ్యగా ఉండ కూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుష గామిగా ఉండకూడదు.
ద్వితీయోపదేశకాండమ 23 : 18 (TEV)
పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవు డైన యెహోవాకు హేయములు.
ద్వితీయోపదేశకాండమ 23 : 19 (TEV)
నీవు వెండినేగాని ఆహారద్రవ్యమునేగాని, వడ్డికి వేయ బడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు.
ద్వితీయోపదేశకాండమ 23 : 20 (TEV)
అన్యు నికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు.
ద్వితీయోపదేశకాండమ 23 : 21 (TEV)
నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరు వాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయ కూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.
ద్వితీయోపదేశకాండమ 23 : 22 (TEV)
నీవు మ్రొక్కు కొననియెడల నీయందు ఆ పాపముండదు.
ద్వితీయోపదేశకాండమ 23 : 23 (TEV)
నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను.
ద్వితీయోపదేశకాండమ 23 : 24 (TEV)
నీవు నీ పొరుగువాని ద్రాక్షతోటకు వచ్చునప్పుడు నీ యిష్టప్రకారము నీకు చాలినంతవరకు ద్రాక్షపండ్లు తిన వచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసికొనకూడదు.
ద్వితీయోపదేశకాండమ 23 : 25 (TEV)
నీ పొరుగువాని పంటచేనికి వచ్చునప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును గాని నీ పొరుగువాని పంటచేనిమీద కొడవలి వేయకూడదు.
❮
❯