ద్వితీయోపదేశకాండమ 25 : 1 (TEV)
మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చు నప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతి మంతుడనియు దోషిని దోషియనియు తీర్పు తీర్చవలెను.
ద్వితీయోపదేశకాండమ 25 : 2 (TEV)
ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినయెడల న్యాయాధి పతి వాని పండుకొనబెట్టి వాని నేరముకొలది దెబ్బలు లెక్కపెట్టి తనయెదుట వాని కొట్టింపవలెను.
ద్వితీయోపదేశకాండమ 25 : 3 (TEV)
నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటి కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినయెడల నీ సహోద రుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో.
ద్వితీయోపదేశకాండమ 25 : 4 (TEV)
నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు.
ద్వితీయోపదేశకాండమ 25 : 5 (TEV)
సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.
ద్వితీయోపదేశకాండమ 25 : 6 (TEV)
చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలోనుండి తుడిచి వేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను.
ద్వితీయోపదేశకాండమ 25 : 7 (TEV)
అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లనియెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి, అనగా పెద్దలయొద్దకు పోయినా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవధర్మము చేయ నొల్లడని తెలుపుకొనవలెను.
ద్వితీయోపదేశకాండమ 25 : 8 (TEV)
అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాటలాడిన తరువాత అతడు నిలువబడిఆమెను పరిగ్రహించుటకు నా కిష్టము లేదనినయెడల అతని సహోదరుని భార్య
ద్వితీయోపదేశకాండమ 25 : 9 (TEV)
ఆ పెద్దలు చూచుచుండగా, అతని దాపున పోయి అతని కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమి్మవేసితన సహోదరుని యిల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయ బడునని చెప్పవలెను.
ద్వితీయోపదేశకాండమ 25 : 10 (TEV)
అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని యిల్లని వానికి పేరు పెట్టబడును.
ద్వితీయోపదేశకాండమ 25 : 11 (TEV)
మనుష్యులు ఒకనితో నొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్నవాని చేతిలోనుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వానిమానము పట్టుకొనినయెడల ఆమె చేతిని ఛేదింపవలెను.
ద్వితీయోపదేశకాండమ 25 : 12 (TEV)
నీ కన్ను కటాక్షింపకూడదు.
ద్వితీయోపదేశకాండమ 25 : 13 (TEV)
హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు.
ద్వితీయోపదేశకాండమ 25 : 14 (TEV)
హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు.
ద్వితీయోపదేశకాండమ 25 : 15 (TEV)
నీ దేవు డైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘా యుష్మంతుడవగునట్లు తక్కువవికాని న్యాయమైన తూనికె రాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువదికాని న్యాయమైన తూము నీకు ఉండవలెను.
ద్వితీయోపదేశకాండమ 25 : 16 (TEV)
ఆలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయముచేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు.
ద్వితీయోపదేశకాండమ 25 : 17 (TEV)
మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసినదానిని జ్ఞాపకము చేసికొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీ కెదురుగా వచ్చి
ద్వితీయోపదేశకాండమ 25 : 18 (TEV)
నీవు ప్రయాసవడి అలసియున్నప్పుడు నీవారిలో నీ వెనుక నున్న బలహీనులనందరిని హతముచేసెను.
ద్వితీయోపదేశకాండమ 25 : 19 (TEV)
కాబట్టి నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్య ముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండచేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

BG:

Opacity:

Color:


Size:


Font: