ఎఫెసీయులకు 3 : 1 (TEV)
ఈ హేతువుచేత అన్యజనులైన మీనిమిత్తము క్రీస్తు యేసుయొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను.
ఎఫెసీయులకు 3 : 2 (TEV)
మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటును గూర్చి మీరు వినియున్నారు.
ఎఫెసీయులకు 3 : 3 (TEV)
ఎట్లనగాక్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచ బడినదను సంగతినిగూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని.
ఎఫెసీయులకు 3 : 4 (TEV)
మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమునుగూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొన గలరు.
ఎఫెసీయులకు 3 : 5 (TEV)
ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియ పరచబడలేదు.
ఎఫెసీయులకు 3 : 6 (TEV)
ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవ ములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే.
ఎఫెసీయులకు 3 : 7 (TEV)
దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని.
ఎఫెసీయులకు 3 : 8 (TEV)
దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,
ఎఫెసీయులకు 3 : 9 (TEV)
పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి,
ఎఫెసీయులకు 3 : 10 (TEV)
శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్య మును అన్యజనులలో ప్రకటించుటకును,
ఎఫెసీయులకు 3 : 11 (TEV)
సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై యున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరి కిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను.
ఎఫెసీయులకు 3 : 12 (TEV)
ఆయనయందలి విశ్వా సముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి.
ఎఫెసీయులకు 3 : 13 (TEV)
కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమ కరములైయున్నవి.
ఎఫెసీయులకు 3 : 14 (TEV)
ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని
ఎఫెసీయులకు 3 : 15 (TEV)
మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను,
ఎఫెసీయులకు 3 : 16 (TEV)
క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను,
ఎఫెసీయులకు 3 : 17 (TEV)
తన మహిమైశ్వ ర్యముచొప్పున మీకు దయచేయవలెననియు,
ఎఫెసీయులకు 3 : 18 (TEV)
మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును,
ఎఫెసీయులకు 3 : 19 (TEV)
జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను.
ఎఫెసీయులకు 3 : 20 (TEV)
మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి,
ఎఫెసీయులకు 3 : 21 (TEV)
క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్‌.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21