నిర్గమకాండము 14 : 1 (TEV)
మరియు యెహోవా మోషేతో ఈలాగు సెల విచ్చెను
నిర్గమకాండము 14 : 2 (TEV)
ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు
నిర్గమకాండము 14 : 3 (TEV)
ఫరో ఇశ్రాయేలీయులనుగూర్చివారు ఈ దేశములో చిక్కుబడి యున్నారు; అరణ్యము వారిని మూసి వేసెనని అను కొనును.
నిర్గమకాండము 14 : 4 (TEV)
అయితే నేను ఫరో హృదయమును కఠినపరచె దను; అతడు వారిని తరుమగా; నేను ఫరోవలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయుల
నిర్గమకాండము 14 : 5 (TEV)
ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్ప బడిమనమెందుకీలాగు చేసితివిు? మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చి తివిు అని చెప్పు కొనిరి.
నిర్గమకాండము 14 : 6 (TEV)
అంతట అతడు తన రథమును సిద్ధపరచుకొని, తన జనమును తనతోకూడ తీసికొని పోయెను.
నిర్గమకాండము 14 : 7 (TEV)
మరియు అతడు శ్రేష్ఠమైన ఆరువందల రథములను ఐగుప్తు రథముల నన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడు కొనిపోయెను.
నిర్గమకాండము 14 : 8 (TEV)
యెహోవా ఐగుప్తురాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరి మెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లు చుండిరి.
నిర్గమకాండము 14 : 9 (TEV)
ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱము లన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి.
నిర్గమకాండము 14 : 10 (TEV)
ఫరో సమీపించుచుండగా ఇశ్రా యేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి.
నిర్గమకాండము 14 : 11 (TEV)
అంతట వారు మోషేతోఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల?
నిర్గమకాండము 14 : 12 (TEV)
మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినమాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటెె ఐగుప్తీయు లకు దాసుల మగుటయే మేలని చెప్పిరి.
నిర్గమకాండము 14 : 13 (TEV)
అందుకు మోషేభయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.
నిర్గమకాండము 14 : 14 (TEV)
యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.
నిర్గమకాండము 14 : 15 (TEV)
అంతలో యెహోవా మోషేతోనీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము.
నిర్గమకాండము 14 : 16 (TEV)
నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.
నిర్గమకాండము 14 : 17 (TEV)
ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృద యములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చు కొందును.
నిర్గమకాండము 14 : 18 (TEV)
నేను ఫరోవలనను అతని రథములవలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.
నిర్గమకాండము 14 : 19 (TEV)
అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవ దూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను
నిర్గమకాండము 14 : 20 (TEV)
అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల
నిర్గమకాండము 14 : 21 (TEV)
మోషే సము ద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను.
నిర్గమకాండము 14 : 22 (TEV)
నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.
నిర్గమకాండము 14 : 23 (TEV)
ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.
నిర్గమకాండము 14 : 24 (TEV)
అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి
నిర్గమకాండము 14 : 25 (TEV)
వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రా యేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవా వారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.
నిర్గమకాండము 14 : 26 (TEV)
అంతలో యెహోవా మోషేతోఐగుప్తీయుల మీది కిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.
నిర్గమకాండము 14 : 27 (TEV)
మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.
నిర్గమకాండము 14 : 28 (TEV)
నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.
నిర్గమకాండము 14 : 29 (TEV)
అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.
నిర్గమకాండము 14 : 30 (TEV)
ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీ యులను సముద్రతీరమున చూచిరి.
నిర్గమకాండము 14 : 31 (TEV)
యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్య మును ఇశ్రాయేలీ యులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.
❮
❯