నిర్గమకాండము 16 : 1 (TEV)
తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన రెండవనెల పదునైదవ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి.
నిర్గమకాండము 16 : 2 (TEV)
ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజ మంతయు మోషే అహరోనులమీద సణిగెను.
నిర్గమకాండము 16 : 3 (TEV)
ఇశ్రా యేలీయులుమేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావక పోతివిు? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా
నిర్గమకాండము 16 : 4 (TEV)
యెహోవా మోషేను చూచిఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.
నిర్గమకాండము 16 : 5 (TEV)
మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనినదానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలై యుండవలెననెను.
నిర్గమకాండము 16 : 6 (TEV)
అప్పుడు మోషే అహరోనులు ఇశ్రా యేలీయులందరితోయెహోవా ఐగుప్తు దేశ ములోనుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును.
నిర్గమకాండము 16 : 7 (TEV)
యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి.
నిర్గమకాండము 16 : 8 (TEV)
మరియు మోషేమీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయ మున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను
నిర్గమకాండము 16 : 9 (TEV)
అంతట మోషే అహరోనుతోయెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను.
నిర్గమకాండము 16 : 10 (TEV)
అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.
నిర్గమకాండము 16 : 11 (TEV)
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని
నిర్గమకాండము 16 : 12 (TEV)
నీవుసాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను.
నిర్గమకాండము 16 : 13 (TEV)
కాగా సాయంకాలమున పూరేడులువచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెముచుట్టు పడియుండెను.
నిర్గమకాండము 16 : 14 (TEV)
పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను.
నిర్గమకాండము 16 : 15 (TEV)
ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియకఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.
నిర్గమకాండము 16 : 16 (TEV)
మోషేఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగాప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములో నున్నవారికొరకు కూర్చుకొనవ లెననెను.
నిర్గమకాండము 16 : 17 (TEV)
ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చు కొనిరి.
నిర్గమకాండము 16 : 18 (TEV)
వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చు కొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమ తమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి.
నిర్గమకాండము 16 : 19 (TEV)
మరియు మోషేదీనిలో ఏమియు ఉదయమువరకు ఎవ రును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను.
నిర్గమకాండము 16 : 20 (TEV)
అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపట్టి కంపు కొట్టెను. మోషే వారిమీద కోపపడగా
నిర్గమకాండము 16 : 21 (TEV)
వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన యింటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను.
నిర్గమకాండము 16 : 22 (TEV)
ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చు కొనినప్పుడు సమాజముయొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి.
నిర్గమకాండము 16 : 23 (TEV)
అందుకు అతడుయెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహో వాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండ
నిర్గమకాండము 16 : 24 (TEV)
మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయము వరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు.
నిర్గమకాండము 16 : 25 (TEV)
మోషేనేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు.
నిర్గమకాండము 16 : 26 (TEV)
ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదనెను.
నిర్గమకాండము 16 : 27 (TEV)
అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవ దినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకక పోయెను.
నిర్గమకాండము 16 : 28 (TEV)
అందుకు యెహోవా మోషేతో ఇట్లనెనుమీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మ శాస్త్ర మును అనుసరించి నడువనొల్లరు?
నిర్గమకాండము 16 : 29 (TEV)
చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవ దినమున రెండు దినముల ఆహా రము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవ దినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను.
నిర్గమకాండము 16 : 30 (TEV)
కాబట్టి యేడవ దినమున ప్రజలు విశ్రమించిరి.
నిర్గమకాండము 16 : 31 (TEV)
ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను.
నిర్గమకాండము 16 : 32 (TEV)
మరియు మోషే ఇట్లనెనుయెహోవా ఆజ్ఞాపించినదే మనగానేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను.
నిర్గమకాండము 16 : 33 (TEV)
కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.
నిర్గమకాండము 16 : 34 (TEV)
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను.
నిర్గమకాండము 16 : 35 (TEV)
ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశము నకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తిను చుండిరి; వారు కనానుదేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి.
నిర్గమకాండము 16 : 36 (TEV)
ఓమెరు అనగా ఏపాలో దశమ భాగము.
❮
❯