నిర్గమకాండము 31 : 1 (TEV)
మరియు యెహోవా మోషేతో ఇట్లనెను
నిర్గమకాండము 31 : 2 (TEV)
చూడుము; నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వానిని పిలిచితిని.
నిర్గమకాండము 31 : 3 (TEV)
విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై
నిర్గమకాండము 31 : 4 (TEV)
రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును
నిర్గమకాండము 31 : 5 (TEV)
సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి యున్నాను.
నిర్గమకాండము 31 : 6 (TEV)
మరియు నేను దాను గోత్రములోని అహీ సామాకు కుమారుడైన అహోలీయాబును అతనికి తోడు చేసి తిని. నేను నీకాజ్ఞాపించినవన్నియు చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి యున్నాను.
నిర్గమకాండము 31 : 7 (TEV)
ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దానిమీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉప కరణములన్నిటిని
నిర్గమకాండము 31 : 8 (TEV)
బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటిని ధూపవేదికను
నిర్గమకాండము 31 : 9 (TEV)
దహన బలిపీఠ మును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను
నిర్గమకాండము 31 : 10 (TEV)
యాజకసేవచేయునట్లు సేవా వస్త్రములను యాజకుడైన అహరోనుయొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను
నిర్గమకాండము 31 : 11 (TEV)
అభిషేక తైలమును పరిశుద్ధ స్థలముకొరకు పరిమళ ధూపద్రవ్యములను నేను నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను.
నిర్గమకాండము 31 : 12 (TEV)
మరియు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఇశ్రాయేలీయులతోనిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను;
నిర్గమకాండము 31 : 13 (TEV)
మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును.
నిర్గమకాండము 31 : 14 (TEV)
కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజల లోనుండి కొట్టివేయబడును.
నిర్గమకాండము 31 : 15 (TEV)
ఆరు దినములు పనిచేయ వచ్చును; ఏడవదినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆ విశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును.
నిర్గమకాండము 31 : 16 (TEV)
ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన.
నిర్గమకాండము 31 : 17 (TEV)
నాకును ఇశ్రాయేలీయులకును అది ఎల్లప్పుడును గురుతైయుండును; ఏలయనగా ఆరుదినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి యేడవదినమున పని మాని విశ్రమించెనని చెప్పుము.
నిర్గమకాండము 31 : 18 (TEV)
మరియు ఆయన సీనాయి కొండమీద మోషేతో మాటలాడుట చాలించిన తరువాత ఆయన తన శాసన ములుగల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతనికిచ్చెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: