ఆదికాండము 17 : 1 (TEV)
అబ్రాము తొంబదితొమి్మది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైనేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.
ఆదికాండము 17 : 2 (TEV)
నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెద నని అతనితో చెప్పెను.
ఆదికాండము 17 : 3 (TEV)
అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను;
ఆదికాండము 17 : 4 (TEV)
నీవు అనేక జనములకు తండ్రివగుదువు.
ఆదికాండము 17 : 5 (TEV)
మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అన బడును.
ఆదికాండము 17 : 6 (TEV)
నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజు లును నీలోనుండి వచ్చెదరు.
ఆదికాండము 17 : 7 (TEV)
నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.
ఆదికాండము 17 : 8 (TEV)
నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.
ఆదికాండము 17 : 9 (TEV)
మరియు దేవుడునీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొన వలెను.
ఆదికాండము 17 : 10 (TEV)
నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగామీలో ప్రతి మగవాడును సున్నతి పొంద వలెను.
ఆదికాండము 17 : 11 (TEV)
మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.
ఆదికాండము 17 : 12 (TEV)
ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను.
ఆదికాండము 17 : 13 (TEV)
నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీర మందు నిత్య నిబంధనగా ఉండును.
ఆదికాండము 17 : 14 (TEV)
సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టి వేయ బడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను.
ఆదికాండము 17 : 15 (TEV)
మరియు దేవుడునీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు; ఏలయనగా ఆమె పేరు శారా
ఆదికాండము 17 : 16 (TEV)
నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగజేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలు గుదురని అబ్రాహాముతో చెప్పెను.
ఆదికాండము 17 : 17 (TEV)
అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవి్వనూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అను కొనెను.
ఆదికాండము 17 : 18 (TEV)
అబ్రాహాముఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా
ఆదికాండము 17 : 19 (TEV)
దేవుడునీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపర చెదను.
ఆదికాండము 17 : 20 (TEV)
ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధిక ముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను;
ఆదికాండము 17 : 21 (TEV)
అయితే వచ్చు సంవత్సరము ఈ కాల మందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.
ఆదికాండము 17 : 22 (TEV)
దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్దనుండి పరమునకు వెళ్లెను.
ఆదికాండము 17 : 23 (TEV)
అప్పుడు అబ్రా హాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తన
ఆదికాండము 17 : 24 (TEV)
అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంబది తొమి్మది యేండ్లవాడు.
ఆదికాండము 17 : 25 (TEV)
అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగచర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదుమూడేండ్లవాడు.
ఆదికాండము 17 : 26 (TEV)
ఒక్కదినమందే అబ్రా హామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి.
ఆదికాండము 17 : 27 (TEV)
అతని యింట పుట్టినవారును అన్యునియొద్ద వెండితో కొనబడినవారును అతని యింటిలోని పురుషు లందరును అతనితో కూడ సున్నతి పొందిరి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27

BG:

Opacity:

Color:


Size:


Font: