హొషేయ 13 : 1 (TEV)
ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలు దేవతనుబట్టి అపరాధియై అతడు నాశన మొందెను.
హొషేయ 13 : 2 (TEV)
ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయు దురు, అదంతయు పనివారు చేయు పనియే, వాటికి బలు లను అర్పించువారుదూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పు దురు.
హొషేయ 13 : 3 (TEV)
కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టు వలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.
హొషేయ 13 : 4 (TEV)
మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినది మొదలుకొని యెహోవా నగు నేనే మీ దేవుడను; నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు.
హొషేయ 13 : 5 (TEV)
మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే.
హొషేయ 13 : 6 (TEV)
తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.
హొషేయ 13 : 7 (TEV)
కాబట్టి నేను వారికి సింహమువంటివాడనైతిని; చిరుతపులి మార్గమున పొంచియున్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును.
హొషేయ 13 : 8 (TEV)
పిల్లలు పోయిన యెలుగుబంటి యొకనిమీద పడు నట్టు నేను వారిమీద పడి వారి రొమ్మును చీల్చివేయు దును; ఆడుసింహము ఒకని మింగివేయు నట్లు వారిని మింగివేతును; దుష్టమృగములు వారిని చీల్చివేయును.
హొషేయ 13 : 9 (TEV)
ఇశ్రాయేలూ, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు.
హొషేయ 13 : 10 (TEV)
నీ పట్టణ ములలో దేనియందును నీకు సహాయము చేయకుండ నీ రాజు ఏమాయెను? రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివిగదా; నీ అధిపతులు ఏమైరి?
హొషేయ 13 : 11 (TEV)
కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని; క్రోధముకలిగి అతని కొట్టివేయు చున్నాను.
హొషేయ 13 : 12 (TEV)
ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడి యున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది.
హొషేయ 13 : 13 (TEV)
ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదనపుట్టును, పిల్లపుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేనివాడై వృద్ధికి రాడు.
హొషేయ 13 : 14 (TEV)
అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.
హొషేయ 13 : 15 (TEV)
నిజముగా ఎఫ్రాయిము తన సహోదరు లలో ఫలాభివృద్ధినొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువు లన్నిటిని శత్రువు కొల్లపెట్టును.
హొషేయ 13 : 16 (TEV)
షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటుచేసెను గనుక అది శిక్షనొందును, జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకువేసి కొట్టబడుదురు, గర్భిణిస్త్రీల కడుపులు చీల్చబడును.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16