యెషయా గ్రంథము 3 : 1 (TEV)
ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు
యెషయా గ్రంథము 3 : 2 (TEV)
శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను
యెషయా గ్రంథము 3 : 3 (TEV)
సోదెకాండ్రను పెద్దలను పంచాదశాధిపతులను ఘనత వహించినవారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగినవారిని మాంత్రికులను యెరూషలేములోనుండియు యూదాదేశములో నుండియు తీసివేయును.
యెషయా గ్రంథము 3 : 4 (TEV)
బాలకులను వారికి అధిపతులనుగా నియమించెదను వారు బాలచేష్టలుచేసి జనులను ఏలెదరు.
యెషయా గ్రంథము 3 : 5 (TEV)
ప్రజలలో ఒకడిట్లును మరియొకడట్లును ప్రతివాడు తన పొరుగువానిని ఒత్తుడు చేయును. పెద్దవానిపైని బాలుడును ఘనునిపైని నీచుడును గర్వించి తిరస్కారముగా నడుచును.
యెషయా గ్రంథము 3 : 6 (TEV)
ఒకడు తన తండ్రియింట తన సహోదరుని పట్టుకొని నీకు వస్త్రము కలదు నీవు మామీద అధిపతివై యుందువు ఈ పాడుస్థలము నీ వశముండనిమ్మనును
యెషయా గ్రంథము 3 : 7 (TEV)
అతడు ఆ దినమున కేకవేసినేను సంరక్షణ కర్తనుగా ఉండనొల్లను నాయింట ఆహారమేమియు లేదు వస్త్రమేమియు లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాదనును.
యెషయా గ్రంథము 3 : 8 (TEV)
యెరూషలేము పాడైపోయెను యూదా నాశన మాయెను యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయు నంతగా వారి మాటలును క్రియలును ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి.
యెషయా గ్రంథము 3 : 9 (TEV)
వారి ముఖలక్షణమే వారిమీద సాక్ష్యమిచ్చును. తమ పాపమును మరుగుచేయక సొదొమవారివలె దాని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడుచేసికొని యున్నారు వారికి శ్రమ
యెషయా గ్రంథము 3 : 10 (TEV)
మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు.
యెషయా గ్రంథము 3 : 11 (TEV)
దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.
యెషయా గ్రంథము 3 : 12 (TEV)
నా ప్రజలవిషయమై నేనేమందును? బాలురు వారిని బాధపెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించు వారు
యెషయా గ్రంథము 3 : 13 (TEV)
వారు నీ త్రోవల జాడను చెరిపివేయుదురు. యెహోవా వాదించుటకు నిలువబడియున్నాడు జనములను విమర్శించుటకు లేచియున్నాడు
యెషయా గ్రంథము 3 : 14 (TEV)
యెహోవా తన జనుల పెద్దలను వారి యధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు. మీరే ద్రాక్షలతోటను తినివేసితిరి మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ యిండ్లలోనే యున్నది
యెషయా గ్రంథము 3 : 15 (TEV)
నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేయుదురు? బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు? అని ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
యెషయా గ్రంథము 3 : 16 (TEV)
మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడచుచు, తమ కాళ్లగజ్జలను మ్రోగించు చున్నారు;
యెషయా గ్రంథము 3 : 17 (TEV)
కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును యెహోవా వారి మానమును బయలుపరచును.
యెషయా గ్రంథము 3 : 18 (TEV)
ఆ దినమున యెహోవా గల్లుగల్లుమను వారి పాద భూషణములను సూర్యబింబ భూషణములను చంద్రవంకలను భూషణములను
యెషయా గ్రంథము 3 : 19 (TEV)
కర్ణభూషణములను కడియములను నాణమైన ముసుకు లను
యెషయా గ్రంథము 3 : 20 (TEV)
కుల్లాయీలను కాళ్ల గొలుసులను ఒడ్డాణములను పరిమళ ద్రవ్యపు బరిణలను
యెషయా గ్రంథము 3 : 21 (TEV)
రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను
యెషయా గ్రంథము 3 : 22 (TEV)
ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను
యెషయా గ్రంథము 3 : 23 (TEV)
చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును.
యెషయా గ్రంథము 3 : 24 (TEV)
అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పైవస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా వాతయును ఉండును.
యెషయా గ్రంథము 3 : 25 (TEV)
ఖడ్గముచేత మనుష్యులు కూలుదురు యుద్ధమున నీ బలాఢ్యులు పడుదురు
యెషయా గ్రంథము 3 : 26 (TEV)
పట్టణపు గుమ్మములు బాధపడి దుఃఖించును ఆమె ఏమియు లేనిదై నేల కూర్చుండును.
❮
❯