యెషయా గ్రంథము 32 : 1 (TEV)
ఆలకించుడి, రాజు నీతినిబట్టి రాజ్యపరిపాలన చేయును అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు.
యెషయా గ్రంథము 32 : 2 (TEV)
మనుష్యుడు గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను ఉండును ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలెను ఉండును.
యెషయా గ్రంథము 32 : 3 (TEV)
చూచువారి కన్నులు మందముగా ఉండవు వినువారి చెవులు ఆలకించును.
యెషయా గ్రంథము 32 : 4 (TEV)
చంచలుల మనస్సు జ్ఞానము గ్రహించును నత్తివారి నాలుక స్పష్టముగా మాటలాడును.
యెషయా గ్రంథము 32 : 5 (TEV)
మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు.
యెషయా గ్రంథము 32 : 6 (TEV)
మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు.
యెషయా గ్రంథము 32 : 7 (TEV)
మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.
యెషయా గ్రంథము 32 : 8 (TEV)
ఘనులు ఘనకార్యములు కల్పించుదురు వారు ఘనకార్యములనుబట్టి నిలుచుదురు.
యెషయా గ్రంథము 32 : 9 (TEV)
సుఖాసక్తిగల స్త్రీలారా, లేచి నా మాట వినుడి నిశ్చింతగానున్న కుమార్తెలారా, నా మాట వినుడి.
యెషయా గ్రంథము 32 : 10 (TEV)
నిశ్చింతగల స్త్రీలారా, యిక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును ద్రాక్షపంట పోవును పండ్లు ఏరుటకు రావు.
యెషయా గ్రంథము 32 : 11 (TEV)
సుఖాసక్తిగల కన్యలారా, వణకుడి నిర్విచారిణులారా, తొందరపడుడి మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి.
యెషయా గ్రంథము 32 : 12 (TEV)
రమ్యమైన పొలము విషయమై ఫలభరితమైన ద్రాక్షా వల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు.
యెషయా గ్రంథము 32 : 13 (TEV)
నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు
యెషయా గ్రంథము 32 : 14 (TEV)
నగరి విడువబడును జనసమూహముగల పట్టణము విడువబడును కొండయు కాపరుల గోపురమును ఎల్లకాలము గుహ లుగా ఉండును
యెషయా గ్రంథము 32 : 15 (TEV)
అవి అడవిగాడిదలకు ఇష్టమైనచోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరిత మైన భూమి వృక్షవనముగానుండును.
యెషయా గ్రంథము 32 : 16 (TEV)
అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును ఫల భరితమైన భూమిలో నీతి దిగును
యెషయా గ్రంథము 32 : 17 (TEV)
నీతి సమాధానము కలుగజేయును నీతివలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనుల విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానములయందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు
యెషయా గ్రంథము 32 : 18 (TEV)
అయినను అరణ్యము ధ్వంసమగునప్పుడు వడగండ్లు పడును
యెషయా గ్రంథము 32 : 19 (TEV)
పట్టణము నిశ్చయముగా కూలిపోవును.
యెషయా గ్రంథము 32 : 20 (TEV)
సమస్త జలములయొద్దను విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరుగనిచ్చు మీరు ధన్యులు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: