యెషయా గ్రంథము 57 : 1 (TEV)
నీతిమంతులు నశించుట చూచి యెవరును దానిని మనస్సున పెట్టరు భక్తులైనవారు తీసికొనిపోబడుచున్నారు కీడు చూడకుండ నీతిమంతులు కొనిపోబడుచున్నారని యెవనికిని తోచదు.
యెషయా గ్రంథము 57 : 2 (TEV)
వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడచువారు తమ పడకలమీద పరుండి విశ్రమించుచున్నారు.
యెషయా గ్రంథము 57 : 3 (TEV)
మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యాసంతానమా, మీరక్కడికి రండి.
యెషయా గ్రంథము 57 : 4 (TEV)
మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులును కారా?
యెషయా గ్రంథము 57 : 5 (TEV)
మస్తచావృక్షములను చూచి పచ్చని ప్రతిచెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతిసందులక్రింద పిల్లలను చంపువార లారా,
యెషయా గ్రంథము 57 : 6 (TEV)
నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే యున్నది అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము నర్పించుచున్నావు.ఇవన్నియు జరుగగా నేను ఊరకుండదగునా?
యెషయా గ్రంథము 57 : 7 (TEV)
ఉన్నతమైన మహాపర్వతముమీద నీ పరుపు వేసి కొంటివి బలి అర్పించుటకు అక్కడికే యెక్కితివి తలుపువెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపకచిహ్నము ఉంచితివి
యెషయా గ్రంథము 57 : 8 (TEV)
నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి నీ పరుపు వెడల్పుచేసికొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమిం చితివి.
యెషయా గ్రంథము 57 : 9 (TEV)
నీవు తైలము తీసికొని రాజునొద్దకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసికొని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాళమంత లోతుగా నీవు లొంగితివి
యెషయా గ్రంథము 57 : 10 (TEV)
నీ దూరప్రయాణముచేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకొంటిని గనుక నీవు సొమ్మసిల్లలేదు.
యెషయా గ్రంథము 57 : 11 (TEV)
ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి? నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసికొనకపోతివి బహుకాలమునుండి నేను మౌనముగానుండినందు ననే గదా నీవు నాకు భయపడుట లేదు?
యెషయా గ్రంథము 57 : 12 (TEV)
నీ నీతి యెంతో నేనే తెలియజేసెదను, నీ క్రియలు నీకు నిష్‌ప్రయోజనములగును.
యెషయా గ్రంథము 57 : 13 (TEV)
నీవు మొఱ్ఱపెట్టునప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా? ఒకడు ఊపిరి విడిచినమాత్రమున అవియన్నియు కొట్టుకొనిపోవును నన్ను నమ్ముకొనువారు దేశమును స్వతంత్రించు కొందురు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు.
యెషయా గ్రంథము 57 : 14 (TEV)
ఎత్తుచేయుడి ఎత్తుచేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయుదానిని నా జనుల మార్గములోనుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు.
యెషయా గ్రంథము 57 : 15 (TEV)
మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.
యెషయా గ్రంథము 57 : 16 (TEV)
నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడును కోపించువాడను కాను ఆలాగుండినయెడల నా మూలముగా జీవాత్మ క్షీణిం చును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు.
యెషయా గ్రంథము 57 : 17 (TEV)
వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి.
యెషయా గ్రంథము 57 : 18 (TEV)
నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును.
యెషయా గ్రంథము 57 : 19 (TEV)
వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమా ధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
యెషయా గ్రంథము 57 : 20 (TEV)
భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును.
యెషయా గ్రంథము 57 : 21 (TEV)
దుష్టులకు నెమ్మదియుండదని నా దేవుడు సెలవిచ్చు చున్నాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: