యోవేలు 1 : 1 (TEV)
పెతూయేలు కూమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యోహోవా వాక్కు
యోవేలు 1 : 2 (TEV)
పెద్దలారా, ఆలకించుడి దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలోగాని జరిగినదా?
యోవేలు 1 : 3 (TEV)
ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికిని తెలియజేయుదురు.
యోవేలు 1 : 4 (TEV)
గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి యున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి యున్నవి.పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి యున్నవి.
యోవేలు 1 : 5 (TEV)
మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి ద్రాక్షారసపానము చేయువారలారా, రోదనము చేయుడి.క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ మాయెను,
యోవేలు 1 : 6 (TEV)
లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్లు సింహపు కోరలవంటివి వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది.
యోవేలు 1 : 7 (TEV)
అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసియున్నవి నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి యున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు తెలుపాయెను
యోవేలు 1 : 8 (TEV)
పెనిమిటి పోయిన ¸°వనురాలు గోనెపట్ట కట్టు కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.
యోవేలు 1 : 9 (TEV)
నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి పోయెను. యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చు చున్నారు.
యోవేలు 1 : 10 (TEV)
పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను.
యోవేలు 1 : 11 (TEV)
భూమిమీది పైరు చెడిపోయెను గోధుమ కఱ్ఱలను యవల కఱ్ఱలను చూచి సేద్యగాండ్లారా, సిగ్గునొందుడి.ద్రాక్షతోట కాపరులారా, రోదనము చేయుడి.
యోవేలు 1 : 12 (TEV)
ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడి పోయెను దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట చెట్లన్నియు వాడిపోయినవి నరులకు సంతోషమేమియు లేకపోయెను.
యోవేలు 1 : 13 (TEV)
యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి. నా దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిర మునకు రాకుండ నిలిచిపోయెను.
యోవేలు 1 : 14 (TEV)
ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరిని మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.
యోవేలు 1 : 15 (TEV)
ఆహా, యెహోవా దినము వచ్చెనే అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.
యోవేలు 1 : 16 (TEV)
మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను మన ఆహారము నాశనమాయెను.
యోవేలు 1 : 17 (TEV)
విత్తనము మంటిపెడ్డల క్రింద కుళ్లిపోవుచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపుకొట్లు వట్టి వాయెను కళ్లపుకొట్లు నేలపడియున్నవి.
యోవేలు 1 : 18 (TEV)
మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొఱ్ఱమందలు చెడిపోవుచున్నవి.
యోవేలు 1 : 19 (TEV)
అగ్ని చేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి మంట తోటచెట్లన్నిటిని కాల్చివేసెను యెహోవా, నీకే నేను మొఱ్ఱ పెట్టుచున్నాను.
యోవేలు 1 : 20 (TEV)
నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేతస్థలములు కాలిపోవుటయు చూచి పశువులును నీకు మొఱ్ఱ పెట్టుచున్నవి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20