యోహాను సువార్త 10 : 1 (TEV)
గొఱ్ఱల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొకమార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునైయున్నాడు.
యోహాను సువార్త 10 : 2 (TEV)
ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱల కాపరి.
యోహాను సువార్త 10 : 3 (TEV)
అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడి పించును.
యోహాను సువార్త 10 : 4 (TEV)
మరియు అతడు తన సొంత గొఱ్ఱలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబ డించును.
యోహాను సువార్త 10 : 5 (TEV)
అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
యోహాను సువార్త 10 : 6 (TEV)
ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులెట్టివో వారు గ్రహించుకొనలేదు.
యోహాను సువార్త 10 : 7 (TEV)
కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను
యోహాను సువార్త 10 : 8 (TEV)
గొఱ్ఱలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱలు వారి స్వరము వినలేదు.
యోహాను సువార్త 10 : 9 (TEV)
నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును.
యోహాను సువార్త 10 : 10 (TEV)
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యోహాను సువార్త 10 : 11 (TEV)
నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును.
యోహాను సువార్త 10 : 12 (TEV)
జీతగాడు గొఱ్ఱల కాపరికాడు గనుక గొఱ్ఱలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱలను పట్టి చెదరగొట్టును.
యోహాను సువార్త 10 : 13 (TEV)
జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును.
యోహాను సువార్త 10 : 14 (TEV)
నేను గొఱ్ఱల మంచి కాపరిని.
యోహాను సువార్త 10 : 15 (TEV)
తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱలను ఎరుగుదును, నా గొఱ్ఱలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను.
యోహాను సువార్త 10 : 16 (TEV)
ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును.
యోహాను సువార్త 10 : 17 (TEV)
నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు.
యోహాను సువార్త 10 : 18 (TEV)
ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.
యోహాను సువార్త 10 : 19 (TEV)
ఈ మాటలనుబట్టి యూదులలో మరల భేదము పుట్టెను.
యోహాను సువార్త 10 : 20 (TEV)
వారిలో అనేకులువాడు దయ్యము పట్టిన వాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.
యోహాను సువార్త 10 : 21 (TEV)
మరి కొందరుఇవి దయ్యము పట్టినవాని మాటలుకావు; దయ్యము గ్రుడ్డివారి కన్నులు తెరవగలదా అనిరి.
యోహాను సువార్త 10 : 22 (TEV)
ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగు చుండెను.
యోహాను సువార్త 10 : 23 (TEV)
అది శీతకాలము. అప్పుడు యేసు దేవాల యములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా
యోహాను సువార్త 10 : 24 (TEV)
యూదులు ఆయనచుట్టు పోగైఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి.
యోహాను సువార్త 10 : 25 (TEV)
అందుకు యేసుమీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.
యోహాను సువార్త 10 : 26 (TEV)
అయితే మీరు నా గొఱ్ఱలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు.
యోహాను సువార్త 10 : 27 (TEV)
నా గొఱ్ఱలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును.
యోహాను సువార్త 10 : 28 (TEV)
నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహ రింపడు.
యోహాను సువార్త 10 : 29 (TEV)
వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;
యోహాను సువార్త 10 : 30 (TEV)
నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.
యోహాను సువార్త 10 : 31 (TEV)
యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా
యోహాను సువార్త 10 : 32 (TEV)
యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను.
యోహాను సువార్త 10 : 33 (TEV)
అందుకు యూదులునీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో
యోహాను సువార్త 10 : 34 (TEV)
అందుకు యేసుమీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా?
యోహాను సువార్త 10 : 35 (TEV)
లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడలనేను దేవుని కుమారుడనని చెప్పినందుకు,
యోహాను సువార్త 10 : 36 (TEV)
తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితోనీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?
యోహాను సువార్త 10 : 37 (TEV)
నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి,
యోహాను సువార్త 10 : 38 (TEV)
చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసి కొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను.
యోహాను సువార్త 10 : 39 (TEV)
వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను.
యోహాను సువార్త 10 : 40 (TEV)
యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చు చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను.
యోహాను సువార్త 10 : 41 (TEV)
అనేకులు ఆయనయొద్దకు వచ్చియోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి.
యోహాను సువార్త 10 : 42 (TEV)
అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
❮
❯