యోహాను సువార్త 12 : 1 (TEV)
కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి.
యోహాను సువార్త 12 : 2 (TEV)
మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతో కూడ భోజమునకు కూర్చున్నవారిలో ఒకడు.
యోహాను సువార్త 12 : 3 (TEV)
అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని,యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో ని
యోహాను సువార్త 12 : 4 (TEV)
ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా
యోహాను సువార్త 12 : 5 (TEV)
యీ అత్తరెందుకు మూడు వందల దేనార ములకు అమి్మ బీదలకు ఇయ్యలేదనెను.
యోహాను సువార్త 12 : 6 (TEV)
వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.
యోహాను సువార్త 12 : 7 (TEV)
కాబట్టి యేసునన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి;
యోహాను సువార్త 12 : 8 (TEV)
బీదలు ఎల్లప్పు డును మీతో కూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను.
యోహాను సువార్త 12 : 9 (TEV)
కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరునుకూడ చూడవచ్చిరి.
యోహాను సువార్త 12 : 10 (TEV)
అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాస ముంచిరి గనుక
యోహాను సువార్త 12 : 11 (TEV)
ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.
యోహాను సువార్త 12 : 12 (TEV)
మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జనసమూ హము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని
యోహాను సువార్త 12 : 13 (TEV)
ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.
యోహాను సువార్త 12 : 14 (TEV)
సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు
యోహాను సువార్త 12 : 15 (TEV)
అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.
యోహాను సువార్త 12 : 16 (TEV)
ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చు కొనిరి.
యోహాను సువార్త 12 : 17 (TEV)
ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతు లలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతో కూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి.
యోహాను సువార్త 12 : 18 (TEV)
అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి.
యోహాను సువార్త 12 : 19 (TEV)
కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంట పోయినదని చెప్పుకొనిరి.
యోహాను సువార్త 12 : 20 (TEV)
ఆ పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు గ్రీసుదేశస్థులు ఉండిరి.
యోహాను సువార్త 12 : 21 (TEV)
వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా
యోహాను సువార్త 12 : 22 (TEV)
ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి.
యోహాను సువార్త 12 : 23 (TEV)
అందుకు యేసు వారితో ఇట్లనెనుమనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి యున్నది.
యోహాను సువార్త 12 : 24 (TEV)
గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును.
యోహాను సువార్త 12 : 25 (TEV)
తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యోహాను సువార్త 12 : 26 (TEV)
ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును.
యోహాను సువార్త 12 : 27 (TEV)
ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నే నేమందును?తండ్రీ, యీ గడియ తటస్థింపకుండనన్ను తప్పించుము; అయి నను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని;
యోహాను సువార్త 12 : 28 (TEV)
తండ్రీ, నీ నామము మహిమపరచు మని చెప్పెను. అంతటనేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.
యోహాను సువార్త 12 : 29 (TEV)
కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహముఉరిమెను అనిరి. మరికొందరుదేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి.
యోహాను సువార్త 12 : 30 (TEV)
అందుకు యేసు ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను.
యోహాను సువార్త 12 : 31 (TEV)
ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును;
యోహాను సువార్త 12 : 32 (TEV)
నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.
యోహాను సువార్త 12 : 33 (TEV)
తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.
యోహాను సువార్త 12 : 34 (TEV)
జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి.
యోహాను సువార్త 12 : 35 (TEV)
అందుకు యేసుఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడ
యోహాను సువార్త 12 : 36 (TEV)
మీరు వెలుగు సంబంధు లగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాస ముంచుడని వారితో చెప్పెను.
యోహాను సువార్త 12 : 37 (TEV)
యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి.
యోహాను సువార్త 12 : 38 (TEV)
ప్రభువా, మా వర్తమానము నమి్మనవాడెవడు? ప్రభువుయొక్క బాహువు ఎవనికి బయలుపరచ బడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను.
యోహాను సువార్త 12 : 39 (TEV)
ఇందుచేత వారు నమ్మలేక పోయిరి, ఏలయనగా
యోహాను సువార్త 12 : 40 (TEV)
వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండు నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను.
యోహాను సువార్త 12 : 41 (TEV)
యెషయా ఆయన మహిమను చూచినందున ఆయననుగూర్చి ఈ మాటలు చెప్పెను.
యోహాను సువార్త 12 : 42 (TEV)
అయినను అధికారులలో కూడ అనే కులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమో యని పరిసయ్యులకు భయ పడి వారు ఒప్పుకొనలేదు.
యోహాను సువార్త 12 : 43 (TEV)
వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.
యోహాను సువార్త 12 : 44 (TEV)
అంతట యేసు బిగ్గరగా ఇట్లనెనునాయందు విశ్వాస ముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవానియందే విశ్వాసముంచుచున్నాడు.
యోహాను సువార్త 12 : 45 (TEV)
నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు.
యోహాను సువార్త 12 : 46 (TEV)
నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి యుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.
యోహాను సువార్త 12 : 47 (TEV)
ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నే నతనికి తీర్పుతీర్చను; నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని.
యోహాను సువార్త 12 : 48 (TEV)
నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు; నేను చెప్పినమాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును.
యోహాను సువార్త 12 : 49 (TEV)
ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు.
యోహాను సువార్త 12 : 50 (TEV)
మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నాననెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50

BG:

Opacity:

Color:


Size:


Font: