యోహాను సువార్త 8 : 1 (TEV)
యేసు ఒలీవలకొండకు వెళ్లెను.
యోహాను సువార్త 8 : 2 (TEV)
తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెను.
యోహాను సువార్త 8 : 3 (TEV)
శాస్త్రులును పరిసయ్యులును, వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడు కొనివచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి
యోహాను సువార్త 8 : 4 (TEV)
బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;
యోహాను సువార్త 8 : 5 (TEV)
అట్టివారిని రాళ్లు రువి్వ చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.
యోహాను సువార్త 8 : 6 (TEV)
ఆయనమీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేలమీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.
యోహాను సువార్త 8 : 7 (TEV)
వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచిమీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి
యోహాను సువార్త 8 : 8 (TEV)
మరల వంగి నేలమీద వ్రాయు చుండెను.
యోహాను సువార్త 8 : 9 (TEV)
వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను.
యోహాను సువార్త 8 : 10 (TEV)
యేసు తలయెత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు
యోహాను సువార్త 8 : 11 (TEV)
ఆమెలేదు ప్రభువా అనెను. అందుకు యేసునేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.
యోహాను సువార్త 8 : 12 (TEV)
మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను.
యోహాను సువార్త 8 : 13 (TEV)
కాబట్టి పరిసయ్యులు నిన్నుగూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా
యోహాను సువార్త 8 : 14 (TEV)
యేసునేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.
యోహాను సువార్త 8 : 15 (TEV)
మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను.
యోహాను సువార్త 8 : 16 (TEV)
నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే.
యోహాను సువార్త 8 : 17 (TEV)
మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా.
యోహాను సువార్త 8 : 18 (TEV)
నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొను వాడను; నన్ను పంపిన తండ్రియు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడని చెప్పెను.
యోహాను సువార్త 8 : 19 (TEV)
వారు నీ తండ్రి యెక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రినికూడ ఎరిగి యుందురని వారితో చెప్పెను.
యోహాను సువార్త 8 : 20 (TEV)
ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్నచోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ యింకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు.
యోహాను సువార్త 8 : 21 (TEV)
మరియొకప్పుడు ఆయననేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే యుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.
యోహాను సువార్త 8 : 22 (TEV)
అందుకు యూదులునేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపు కొనునా అని చెప్పుకొనుచుండిరి.
యోహాను సువార్త 8 : 23 (TEV)
అప్పుడాయనమీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోకసంబంధుడను కాను.
యోహాను సువార్త 8 : 24 (TEV)
కాగా మీ పాపములలోనేయుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను.
యోహాను సువార్త 8 : 25 (TEV)
కాబట్టి వారునీ వెవరవని ఆయన నడుగగా యేసు వారితోమొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే.
యోహాను సువార్త 8 : 26 (TEV)
మిమ్మునుగూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు; నేను ఆయనయొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను.
యోహాను సువార్త 8 : 27 (TEV)
తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపక పోయిరి.
యోహాను సువార్త 8 : 28 (TEV)
కావున యేసుమీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే యేమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు.
యోహాను సువార్త 8 : 29 (TEV)
నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను.
యోహాను సువార్త 8 : 30 (TEV)
ఆయన యీ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వాసముంచిరి.
యోహాను సువార్త 8 : 31 (TEV)
కాబట్టి యేసు, తనను నమి్మన యూదులతోమీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;
యోహాను సువార్త 8 : 32 (TEV)
అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా
యోహాను సువార్త 8 : 33 (TEV)
వారుమేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయ బడుదురని యేల చెప్పుచున్నావని ఆయనతో అనిరి.
యోహాను సువార్త 8 : 34 (TEV)
అందుకు యేసుపాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
యోహాను సువార్త 8 : 35 (TEV)
దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసముచేయడు; కుమారు డెల్లప్పుడును నివాసముచేయును.
యోహాను సువార్త 8 : 36 (TEV)
కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసినయెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.
యోహాను సువార్త 8 : 37 (TEV)
మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు.
యోహాను సువార్త 8 : 38 (TEV)
నేను నా తండ్రియొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను; ఆ ప్రకారమే మీరు మీ తండ్రియొద్ద వినినవాటినే జరి గించుచున్నారని వారితో చెప్పెను.
యోహాను సువార్త 8 : 39 (TEV)
అందుకు వారు ఆయనతోమా తండ్రి అబ్రాహామనిరి; యేసుమీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.
యోహాను సువార్త 8 : 40 (TEV)
దేవునివలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు
యోహాను సువార్త 8 : 41 (TEV)
మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను; అందుకు వారుమేము వ్యభిచారమువలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా
యోహాను సువార్త 8 : 42 (TEV)
యేసు వారితో ఇట్లనెనుదేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.
యోహాను సువార్త 8 : 43 (TEV)
మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా?
యోహాను సువార్త 8 : 44 (TEV)
మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంత కుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధి కుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు.
యోహాను సువార్త 8 : 45 (TEV)
నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు.
యోహాను సువార్త 8 : 46 (TEV)
నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?
యోహాను సువార్త 8 : 47 (TEV)
దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పెను.
యోహాను సువార్త 8 : 48 (TEV)
అందుకు యూదులు నీవు సమరయు డవును దయ్యముపట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా
యోహాను సువార్త 8 : 49 (TEV)
యేసు నేను దయ్యముపట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరచుచున్నారు.
యోహాను సువార్త 8 : 50 (TEV)
నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువా డొకడు కలడు.
యోహాను సువార్త 8 : 51 (TEV)
ఒకడు నా మాట గైకొనిన యెడలవాడెన్నడును మరణము పొందడని3 మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను.
యోహాను సువార్త 8 : 52 (TEV)
అందుకు యూదులునీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగు దుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడ
యోహాను సువార్త 8 : 53 (TEV)
మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా; నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీ వెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి.
యోహాను సువార్త 8 : 54 (TEV)
అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకొనినయెడల నా మహిమ వట్టిది; మా దేవుడని మీరెవరినిగూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు.
యోహాను సువార్త 8 : 55 (TEV)
మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను.
యోహాను సువార్త 8 : 56 (TEV)
మీ తండ్రియైన అబ్రా హాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను.
యోహాను సువార్త 8 : 57 (TEV)
అందుకు యూదులునీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రాహామును చూచితివా అని ఆయనతో చెప్పగా,
యోహాను సువార్త 8 : 58 (TEV)
యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
యోహాను సువార్త 8 : 59 (TEV)
కాబట్టి వారు ఆయనమీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్లిపోయెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59

BG:

Opacity:

Color:


Size:


Font: