యోనా 1 : 1 (TEV)
యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
యోనా 1 : 2 (TEV)
నీనెవెపట్ట ణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.
యోనా 1 : 3 (TEV)
అయితే యెహోవా సన్ని ధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.
యోనా 1 : 4 (TEV)
అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.
యోనా 1 : 5 (TEV)
కాబట్టి నావికులు భయ పడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను
యోనా 1 : 6 (TEV)
అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించు నేమో అనెను.
యోనా 1 : 7 (TEV)
అంతలో ఓడ వారు ఎవనినిబట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని యొకరితో ఒకరు చెప్పుకొని, చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చెను.
యోనా 1 : 8 (TEV)
కాబట్టి వారు అతని చూచి యెవరినిబట్టి ఈ కీడు మాకు సంభ వించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చి తివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా
యోనా 1 : 9 (TEV)
అతడు వారితో ఇట్లనెను నేను హెబ్రీయుడను; సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులుగల వాడనై యున్నాను.
యోనా 1 : 10 (TEV)
తాను యెహోవా సన్నిధిలోనుండి పారి పోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి యుండెను గనుక వారా సంగతి తెలిసికొని మరింత భయ పడినీవు చేసిన పని ఏమని అతని నడిగిరి.
యోనా 1 : 11 (TEV)
అప్పుడు వారుసముద్రము పొంగుచున్నది, తుపాను అధికమౌ చున్నది, సముద్రము మామీదికి రాకుండ నిమ్మళించునట్లు మేము నీ కేమి చేయవలెనని అతని నడుగగా యోనా
యోనా 1 : 12 (TEV)
నన్నుబట్టియే యీ గొప్పతుపాను మీమీదికివచ్చెనని నాకు తెలిసియున్నది; నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండ నిమ్మళించునని అతడు వారితో చెప్పినను
యోనా 1 : 13 (TEV)
వారు ఓడను దరికి తెచ్చు టకు తెడ్లను బహు బలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుపాను బలముచేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను.
యోనా 1 : 14 (TEV)
కాబట్టి వారు యెహోవా, నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసితివి; ఈ మనుష్యునిబట్టి మమ్మును లయము చేయకుందువు గాక; నిర్దోషిని చంపితిరన్న నేరము మామీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసికొని
యోనా 1 : 15 (TEV)
యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి; పడవేయగానే సముద్రము పొంగకుండ ఆగెను.
యోనా 1 : 16 (TEV)
ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్లు చేసిరి.
యోనా 1 : 17 (TEV)
గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి యుండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను.
❮
❯