యెహొషువ 18 : 1 (TEV)
ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరు షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి.
యెహొషువ 18 : 2 (TEV)
ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంక పొందని యేడుగోత్రములు ఉండెను.
యెహొషువ 18 : 3 (TEV)
కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెనుమీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీన పరచుకొన వెళ్లకుండ మీరెన్నాళ్లు తడవుచేసెదరు?
యెహొషువ 18 : 4 (TEV)
ప్రతి గోత్రమునుండి ముగ్గురేసి మనుష్యులను నాయొద్దకు రప్పించిన యెడల నేను వారిని పంపెదను; వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యములచొప్పున దాని వివరమును వ్రాసి నా యొద్దకు తీసికొనివచ్చెదరు.
యెహొషువ 18 : 5 (TEV)
వారు ఏడువంతులుగా దాని పంచుకొందురు. యూదా వంశస్థులు దక్షిణదిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను. యోసేపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దులోపల నిలిచి యుండవలెను.
యెహొషువ 18 : 6 (TEV)
మీరు ఏడు వంతులుగా దేశవివరమును వ్రాసి నా యొద్దకు తీసికొని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతుచీట్లు వేసెదను.
యెహొషువ 18 : 7 (TEV)
లేవీయు లకు మీ మధ్య ఏ వంతును కలుగదు, యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యము. గాదీయు లును రూబేనీయులును మనష్షే అర్ధగోత్రపువారును యొర్దాను అవతల తూర్పుదిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు.
యెహొషువ 18 : 8 (TEV)
ఆ మనుష్యులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్లబోవు వారితోమీరు ఆ దేశములో బడి నడుచుచు దాని వివరమును వ్రాసి నాయొద్దకు తిరిగి రండి; అప్పుడు నేను షిలోహులో మీకొరకు యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేయించెద ననగా
యెహొషువ 18 : 9 (TEV)
ఆ మనుష్యులు వెళ్లి దేశసంచారము చేయుచు ఏడువంతులుగా, గ్రామములచొప్పున, దాని వివరమును పుస్తకములో వ్రాసి షిలోహులోని పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి.
యెహొషువ 18 : 10 (TEV)
వారికొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేసి వారి వారి వంతులచొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచి పెట్టెను.
యెహొషువ 18 : 11 (TEV)
బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున, వంతుచీటి వచ్చెను; వారి చీటివలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యోసేపు పుత్రుల సరిహద్దుకును మధ్యనుండెను.
యెహొషువ 18 : 12 (TEV)
ఉత్తరదిక్కున వారి సరిహద్దు యొర్దాను మొదలుకొని యెరికోకు ఉత్తరదిక్కున పోయి పడమరగా కొండల దేశమువరకు వ్యాపించెను, దాని సరిహద్దు బేతావెను అర ణ్యమువరకు సాగెను.
యెహొషువ 18 : 13 (TEV)
అక్కడనుండి ఆ సరిహద్దు లూజు వైపున, అనగా బేతేలను లూజు దక్షిణమువరకు సాగి క్రింది బెత్‌హోరోనుకు దక్షిణముననున్న కొండమీది అతారోతు అద్దారువరకు వ్యాపించెను.
యెహొషువ 18 : 14 (TEV)
అక్కడనుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్‌హోరోనుకును ఎదురుగా నున్న కొండనుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడ నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిర్యాత్బాలు అనగా కిర్యత్యారీమువరకు వ్యాపించెను, అది పడమటిదిక్కు.
యెహొషువ 18 : 15 (TEV)
దక్షిణదిక్కున కిర్యత్యారీముకొననుండి దాని సరిహద్దు పడమటిదిక్కున నెఫ్తోయ నీళ్ల యూటవరకు సాగి
యెహొషువ 18 : 16 (TEV)
ఉత్తరదిక్కున రెఫాయీయుల లోయలోనున్న బెన్‌ హిన్నోము లోయయెదుటనున్న కొండప్రక్కననుండి దక్షిణదిక్కున బెన్‌హిన్నోము లోయమార్గమున యెబూ సీయుల ప్రదేశమువరకు సాగి ఏన్‌రోగేలువరకు వ్యాపించెను.
యెహొషువ 18 : 17 (TEV)
అది ఉత్తర దిక్కునుండి ఏన్‌షెమెషువరకు వ్యాపించి అదుమీ్మమునకు ఎక్కుచోటికి ఎదురుగానున్న గెలీలోతువరకు సాగి రూబేనీయుడైన బోహను రాతి యొద్దకు దిగెను.
యెహొషువ 18 : 18 (TEV)
అది ఉత్తరదిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి అరాబావరకు దిగి అక్కడనుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్‌హోగ్లావరకు సాగెను.
యెహొషువ 18 : 19 (TEV)
అక్కడనుండి ఆ సరిహద్దు యొర్దాను దక్షిణదిక్కునఉప్పు సముద్రముయొక్క ఉత్తరాఖాతమువరకు వ్యాపించెను. అది దక్షిణదిక్కున దానికి సరిహద్దు.
యెహొషువ 18 : 20 (TEV)
తూర్పుదిక్కున యొర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టునున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీనీయులకు వారి వంశ ములచొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది.
యెహొషువ 18 : 21 (TEV)
బెన్యామీనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేవనగా యెరికో బేత్‌హోగ్లా యెమెక్కెసీసు
యెహొషువ 18 : 22 (TEV)
బేతరాబా సెమ రాయిము బేతేలు ఆవీము పారా ఒఫ్రా
యెహొషువ 18 : 23 (TEV)
కెపరమ్మోని ఒప్ని గెబా అనునవి,
యెహొషువ 18 : 24 (TEV)
వాటి పల్లెలు పోగా పండ్రెండు పట్టణములు.
యెహొషువ 18 : 25 (TEV)
గిబియోను రామా బెయేరోతు మిస్పే
యెహొషువ 18 : 26 (TEV)
కెఫీరా మోసా రేకెము ఇర్పెయేలు తరలా
యెహొషువ 18 : 27 (TEV)
సేలా ఎలెపు యెరూషలేము అనబడిన ఎబూసీ గిబియా కిర్యతు అను నవి; వాటి పల్లెలు పోగా పదునాలుగు పట్టణములు.
యెహొషువ 18 : 28 (TEV)
వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: