యెహొషువ 19 : 1 (TEV)
రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా, అనగా వారి వంశములచొప్పున షిమ్యోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్యనుండెను.
యెహొషువ 19 : 2 (TEV)
వారికి కలిగిన స్వాస్థ్య మేదనగా బెయేర్షెబా షెబ మోలాదా
యెహొషువ 19 : 3 (TEV)
హజర్షువలు బాలా ఎజెము ఎల్తోలదు బేతూలు హోర్మా
యెహొషువ 19 : 4 (TEV)
సిక్లగు బేత్మర్కాబోదు హజర్సూసా
యెహొషువ 19 : 5 (TEV)
బేత్లెబాయోతు షారూ హెను అనునవి,
యెహొషువ 19 : 6 (TEV)
వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణ ములు.
యెహొషువ 19 : 7 (TEV)
అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు.
యెహొషువ 19 : 8 (TEV)
దక్షిణమున రామతను బాలత్బెయేరువరకు ఆ పట్టణ ముల చుట్టునున్న పల్లెలన్నియు ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశములచొప్పున కలిగిన స్వాస్థ్యము.
యెహొషువ 19 : 9 (TEV)
షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము; ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి.
యెహొషువ 19 : 10 (TEV)
మూడవవంతు చీటి వారి వంశముచొప్పున జెబూలూ నీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదువరకు సాగెను.
యెహొషువ 19 : 11 (TEV)
వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయాము నకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి
యెహొషువ 19 : 12 (TEV)
శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి
యెహొషువ 19 : 13 (TEV)
అక్కడనుండి తూర్పు తట్టు గిత్తహెపెరువరకును ఇత్కా చీనువరకును సాగి నేయావరకు వ్యాపించు రిమ్మోనుదనుక పోయెను.
యెహొషువ 19 : 14 (TEV)
దాని సరిహద్దు హన్నాతోనువరకు ఉత్తరదిక్కున చుట్టుకొని అక్కడనుండి యిప్తాయేలు లోయలో నిలిచెను.
యెహొషువ 19 : 15 (TEV)
కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బేత్లెహేము అను పండ్రెండు పట్టణములును వాటి పల్లెలును.
యెహొషువ 19 : 16 (TEV)
ఆ పట్టణము లును వాటి పల్లెలును వారి వంశములచొప్పున జెబూలూ నీయులకు కలిగిన స్వాస్థ్యము.
యెహొషువ 19 : 17 (TEV)
నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను.
యెహొషువ 19 : 18 (TEV)
వారి సరిహద్దు యెజ్రె యేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షీయోను అనహరాతు రబ్బీతు కిష్యోను
యెహొషువ 19 : 19 (TEV)
అబెసు రెమెతు ఏన్గన్నీము
యెహొషువ 19 : 20 (TEV)
ఏన్‌హద్దా బేత్పస్సెసు అను స్థలములవరకు
యెహొషువ 19 : 21 (TEV)
సాగి తాబోరు షహచీమా బేత్షెమెషు
యెహొషువ 19 : 22 (TEV)
అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను.
యెహొషువ 19 : 23 (TEV)
వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతో కూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
యెహొషువ 19 : 24 (TEV)
అయిదవ వంతు చీటి వారి వంశములచొప్పున ఆషేరీ యుల పక్షముగా వచ్చెను.
యెహొషువ 19 : 25 (TEV)
వారి సరిహద్దు హెల్క తుహలి బెతెను అక్షాపు
యెహొషువ 19 : 26 (TEV)
అలమ్మేలెకు అమాదు మిషె యలు. పడమట అది కర్మెలువరకును షీహోర్లిబ్నాతు వరకును సాగి
యెహొషువ 19 : 27 (TEV)
తూర్పుదిక్కున బేత్దాగోనువరకు తిరిగి జెబూలూను భాగమును యిప్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయీయేలునకును ఉత్తర దిక్కునపోవుచు
యెహొషువ 19 : 28 (TEV)
ఎడమవైపున అది కాబూలువరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను.
యెహొషువ 19 : 29 (TEV)
అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.
యెహొషువ 19 : 30 (TEV)
ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరువదిరెండు పట్టణములు.
యెహొషువ 19 : 31 (TEV)
వాటి పల్లెలతో కూడ ఆ పట్టణములు వారి వంశములచొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
యెహొషువ 19 : 32 (TEV)
ఆరవ వంతు చీటి వారి వంశములచొప్పున నఫ్తాలీ యుల పక్షమున వచ్చెను.
యెహొషువ 19 : 33 (TEV)
వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సిందూరవనమును అదామియను కను మను యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి
యెహొషువ 19 : 34 (TEV)
అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూ లూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను.
యెహొషువ 19 : 35 (TEV)
కోటగల పట్ట ణము లేవనగా జిద్దీము జేరు హమ్మతు రక్కతు కిన్నెరెతు
యెహొషువ 19 : 36 (TEV)
అదామా రామా హాసోరు
యెహొషువ 19 : 37 (TEV)
కెదెషు ఎద్రెయీ ఏన్‌హాసోరు
యెహొషువ 19 : 38 (TEV)
ఇరోను మిగ్దలేలు హొరేము బేతనాతు బేత్షెమెషు అను నవి; వాటి పల్లెలుగాక పందొమి్మది పట్టణములు.
యెహొషువ 19 : 39 (TEV)
ఆ పట్ట ణములును వాటి పల్లెలును వారి వంశములచొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
యెహొషువ 19 : 40 (TEV)
ఏడవ వంతు చీటి వారి వంశములచొప్పున దానీయుల పక్షముగా వచ్చెను.
యెహొషువ 19 : 41 (TEV)
వారి స్వాస్థ్యపు సరిహద్దు జొర్యా
యెహొషువ 19 : 42 (TEV)
ఎష్తాయోలు ఇర్షెమెషు షెయల్బీను
యెహొషువ 19 : 43 (TEV)
అయ్యా లోను యెతా ఏలోను
యెహొషువ 19 : 44 (TEV)
తిమ్నా ఎక్రోను ఎత్తెకే గిబ్బెతోను
యెహొషువ 19 : 45 (TEV)
బాలాతా యెహుదు బెనేబెరకు
యెహొషువ 19 : 46 (TEV)
గత్రిమ్మోను మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించెను.
యెహొషువ 19 : 47 (TEV)
దానీ యుల సరిహద్దు వారియొద్దనుండి అవతలకు వ్యాపించెను. దానీయులు బయలుదేరి లెషెముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరునుబట్టి ఆ లెషెమునకు దానను పేరు పెట్టిరి.
యెహొషువ 19 : 48 (TEV)
వాటి పల్లెలుగాక యీ పట్టణములు వారి వంశ ములచొప్పున దానీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
యెహొషువ 19 : 49 (TEV)
సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచి పెట్టుట ముగించిన తర్వాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి.
యెహొషువ 19 : 50 (TEV)
యెహోవా సెలవిచ్చిన దానినిబట్టి వారు అతడు అడిగిన పట్టణమును, అనగా ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశములోనున్న తిమ్న త్సెరహును అతని కిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలోనివసించెను.
యెహొషువ 19 : 51 (TEV)
యాజకుడైన ఎలియాజ రును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీ యుల గోత్రములయొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారము నొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకముచేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51

BG:

Opacity:

Color:


Size:


Font: