న్యాయాధిపతులు 10 : 1 (TEV)
అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రా యిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు.
న్యాయాధిపతులు 10 : 2 (TEV)
అతడు ఇరువదిమూడు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై ఉండి చనిపోయి షామీరులో పాతి పెట్టబడెను.
న్యాయాధిపతులు 10 : 3 (TEV)
అతని తరువాత గిలాదుదేశస్థుడైన యాయీరు నియ మింపబడినవాడై యిరువదిరెండు సంవత్సరములు ఇశ్రా యేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.
న్యాయాధిపతులు 10 : 4 (TEV)
అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.
న్యాయాధిపతులు 10 : 5 (TEV)
అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను.
న్యాయాధిపతులు 10 : 6 (TEV)
ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, బయలులు అష్తారోతులు అను సిరియనుల దేవత లను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజిం చుచువచ్చిరి.
న్యాయాధిపతులు 10 : 7 (TEV)
యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక
న్యాయాధిపతులు 10 : 8 (TEV)
వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతల నున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపుర మున్న ఇశ్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి.
న్యాయాధిపతులు 10 : 9 (TEV)
మరియు అమ్మోనీయులు యూదాదేశస్థులతోను బెన్యామీనీయులతోను ఎఫ్రాయి మీయులతోను యుద్ధముచేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను
న్యాయాధిపతులు 10 : 10 (TEV)
అప్పుడు ఇశ్రాయేలీయులుమేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి యున్నామని యెహోవాకు మొఱ్ఱపెట్టగా
న్యాయాధిపతులు 10 : 11 (TEV)
యెహోవా ఐగుప్తీయుల వశములోనుండియు అమోరీయుల వశ ములో నుండియు అమ్మోనీయుల వశములోనుండియు ఫిలిష్తీ యుల వశములోనుండియు మాత్రము గాక
న్యాయాధిపతులు 10 : 12 (TEV)
సీదోనీయు లును అమాలేకీయులును మాయోనీయులును మిమ్మును బాధ పరచినప్పుడు వారి వశములోనుండియు నేను మిమ్మును రక్షిం చితిని గదా
న్యాయాధిపతులు 10 : 13 (TEV)
అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షిం పను.
న్యాయాధిపతులు 10 : 14 (TEV)
పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొఱ్ఱపెట్టు కొనుడి; మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను.
న్యాయాధిపతులు 10 : 15 (TEV)
అప్పుడు ఇశ్రా యేలీయులుమేము పాపము చేసియున్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము; దయ చేసి నేడు మమ్మును రక్షింపుమని చెప్పి
న్యాయాధిపతులు 10 : 16 (TEV)
యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొల గింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను.
న్యాయాధిపతులు 10 : 17 (TEV)
అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి యుండిరి. ఇశ్రాయేలీయులును కూడుకొని మిస్పాలో దిగియుండిరి.
న్యాయాధిపతులు 10 : 18 (TEV)
కాబట్టి జనులు, అనగా గిలాదు పెద్దలుఅమ్మోనీయులతో యుద్ధముచేయ బూనుకొనువాడెవడో వాడు గిలాదు నివాసులకందరికిని ప్రధానుడగునని యొక నితో నొకడు చెప్పుకొనిరి.
❮
❯