న్యాయాధిపతులు 2 : 1 (TEV)
యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీము నకువచ్చి యీలాగు సెలవిచ్చెనునేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశము నకు మిమ్మును చేర్చినీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.
న్యాయాధిపతులు 2 : 2 (TEV)
మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసి కొనకూడదు; వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు.
న్యాయాధిపతులు 2 : 3 (TEV)
మీరు చేసినపని యెట్టిది? కావున నేనుమీ యెదుటనుండి ఈ దేశనివాసులను వెళ్లగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను.
న్యాయాధిపతులు 2 : 4 (TEV)
యెహోవా దూత ఇశ్రా యేలీయులందరితో ఈ మాటలు చెప్పగా
న్యాయాధిపతులు 2 : 5 (TEV)
జనులు ఎలుగెత్తి యేడ్చిరి; కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడవారు యెహోవాకు బలి అర్పించిరి.
న్యాయాధిపతులు 2 : 6 (TEV)
యెహోషువ జనులను వెళ్లనంపినప్పుడు ఇశ్రాయేలీ యులు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్య ములకు పోయిరి.
న్యాయాధిపతులు 2 : 7 (TEV)
యెహోషువ దినములన్నిటను యెహో షువ తరువాత ఇంక బ్రదికినవారై యెహోవా ఇశ్రా యేలీయులకొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి.
న్యాయాధిపతులు 2 : 8 (TEV)
నూను కుమారుడును యెహోవాకు దాసుడు నైన యెహోషువ నూట పది సంవత్సరముల వయస్సుగల వాడై మృతినొందినప్పుడు అతని స్యాస్థ్యపు సరిహద్దులో నున్న తిమ్నత్సెరహులో జనులతని పాతిపెట్టిరి.
న్యాయాధిపతులు 2 : 9 (TEV)
అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయషుకొండకు ఉత్తరదిక్కున నున్నది.
న్యాయాధిపతులు 2 : 10 (TEV)
ఆ తరమువారందరు తమ పితరులయొద్దకు చేర్బబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా
న్యాయాధిపతులు 2 : 11 (TEV)
ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి
న్యాయాధిపతులు 2 : 12 (TEV)
తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహో వాకు కోపము పుట్టించిరి.
న్యాయాధిపతులు 2 : 13 (TEV)
వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి.
న్యాయాధిపతులు 2 : 14 (TEV)
కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచు కొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీ యులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి.
న్యాయాధిపతులు 2 : 15 (TEV)
యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.
న్యాయాధిపతులు 2 : 16 (TEV)
ఆ కాలమున యెహోవా వారికొరకు న్యాయాధి పతులను పుట్టించెను. వీరు దోచుకొనువారి చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంక న్యాయాధిపతుల మాట వినక
న్యాయాధిపతులు 2 : 17 (TEV)
తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గమునుండి త్వరగా తొలగి పోయి యితర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి; తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి.
న్యాయాధిపతులు 2 : 18 (TEV)
తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారికొరకు న్యాయాధిపతులను పుట్టించి, ఆయా న్యాయాధిపతులకు తోడైయుండి వారి దినములన్నిటను వారిశత్రువుల చేతులలోనుండి ఇశ్రాయేలీయులను రక్షిం చెను.
న్యాయాధిపతులు 2 : 19 (TEV)
ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి యితర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుటవలన తమ క్రియలలో నేమి తమ మూర్ఖప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వికులకంటె మరి మిగుల చెడ్డవారైరి.
న్యాయాధిపతులు 2 : 20 (TEV)
కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెనుఈ ప్రజలు నా మాట వినక, వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరు దురు
న్యాయాధిపతులు 2 : 21 (TEV)
గనుక నేను నియమించిన విధిననుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిననుసరించి నడుచుదురో లేదో ఆ జనములవలన ఇశ్రాయేలీయులను శోధించుటకై
న్యాయాధిపతులు 2 : 22 (TEV)
యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి యెదుటనుండి నేను వెళ్లగొట్టను.
న్యాయాధిపతులు 2 : 23 (TEV)
అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతి కప్పగింపకయు శీఘ్రముగా వెళ్లగొట్ట కయు మాని వారిని ఉండనిచ్చెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: