విలాపవాక్యములు 3 : 1 (TEV)
నేను ఆయన ఆగ్రహదండముచేత బాధ ననుభవించిన నరుడను.
విలాపవాక్యములు 3 : 2 (TEV)
ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు.
విలాపవాక్యములు 3 : 3 (TEV)
మాటి మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు
విలాపవాక్యములు 3 : 4 (TEV)
ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింప జేయుచున్నాడు. నా యెముకలను విరుగగొట్టుచున్నాడు
విలాపవాక్యములు 3 : 5 (TEV)
నాకు అడ్డముగా కంచె వేసియున్నాడు విషమును మాచిపత్రిని నా చుట్టు మొలిపించి యున్నాడు
విలాపవాక్యములు 3 : 6 (TEV)
పూర్వకాలమున చనిపోయినవారు నివసించునట్లు ఆయన చీకటిగల స్థలములలో నన్ను నివసింపజేసి యున్నాడు
విలాపవాక్యములు 3 : 7 (TEV)
ఆయన నా చుట్టు కంచె వేసియున్నాడు నేను బయలు వెళ్లకుండునట్లు బరువైన సంకెళ్లు నాకు వేసియున్నాడు
విలాపవాక్యములు 3 : 8 (TEV)
నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.
విలాపవాక్యములు 3 : 9 (TEV)
ఆయన నా మార్గములకు అడ్డముగా చెక్కుడురాళ్లు కట్టియున్నాడు నేను పోజాలకుండ నా త్రోవలను కట్టివేసి యున్నాడు
విలాపవాక్యములు 3 : 10 (TEV)
నా ప్రాణమునకు ఆయన పొంచియున్న ఎలుగుబంటి వలె ఉన్నాడు చాటైన చోటులలోనుండు సింహమువలె ఉన్నాడు
విలాపవాక్యములు 3 : 11 (TEV)
నాకు త్రోవలేకుండచేసి నా యవయవములను విడదీసి యున్నాడు నాకు దిక్కు లేకుండ చేసియున్నాడు
విలాపవాక్యములు 3 : 12 (TEV)
విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టియున్నాడు
విలాపవాక్యములు 3 : 13 (TEV)
తన అంబులపొదిలోని బాణములన్నియు ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను.
విలాపవాక్యములు 3 : 14 (TEV)
నావారికందరికి నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను దినమెల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదుడ నైతిని.
విలాపవాక్యములు 3 : 15 (TEV)
చేదువస్తువులు ఆయన నాకు తినిపించెను మాచిపత్రి ద్రావకముచేత నన్ను మత్తునిగా చేసెను
విలాపవాక్యములు 3 : 16 (TEV)
రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను.
విలాపవాక్యములు 3 : 17 (TEV)
నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి యున్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను.
విలాపవాక్యములు 3 : 18 (TEV)
నాకు బలము ఉడిగెను అనుకొంటిని యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని.
విలాపవాక్యములు 3 : 19 (TEV)
నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము.
విలాపవాక్యములు 3 : 20 (TEV)
ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా.
విలాపవాక్యములు 3 : 21 (TEV)
నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది.
విలాపవాక్యములు 3 : 22 (TEV)
యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
విలాపవాక్యములు 3 : 23 (TEV)
అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
విలాపవాక్యములు 3 : 24 (TEV)
యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమి్మక యుంచుకొనుచున్నాను.
విలాపవాక్యములు 3 : 25 (TEV)
తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
విలాపవాక్యములు 3 : 26 (TEV)
నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
విలాపవాక్యములు 3 : 27 (TEV)
¸°వనకాలమున కాడి మోయుట నరునికి మేలు.
విలాపవాక్యములు 3 : 28 (TEV)
అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ వలెను.
విలాపవాక్యములు 3 : 29 (TEV)
నిరీక్షణాధారము కలుగునేమో యని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను.
విలాపవాక్యములు 3 : 30 (TEV)
అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప వలెను. అతడు నిందతో నింపబడవలెను
విలాపవాక్యములు 3 : 31 (TEV)
ప్రభువు సర్వకాలము విడనాడడు.
విలాపవాక్యములు 3 : 32 (TEV)
ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి పడును.
విలాపవాక్యములు 3 : 33 (TEV)
హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు.
విలాపవాక్యములు 3 : 34 (TEV)
దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద త్రొక్కుటయు
విలాపవాక్యములు 3 : 35 (TEV)
మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొల గించుటయు
విలాపవాక్యములు 3 : 36 (TEV)
ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు ప్రభువు మెచ్చుకార్యములు కావు.
విలాపవాక్యములు 3 : 37 (TEV)
ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవా డెవడు?
విలాపవాక్యములు 3 : 38 (TEV)
మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా?
విలాపవాక్యములు 3 : 39 (TEV)
సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?
విలాపవాక్యములు 3 : 40 (TEV)
మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము.
విలాపవాక్యములు 3 : 41 (TEV)
ఆకాశమందున్న దేవునితట్టు మన హృదయమును మన చేతులను ఎత్తికొందము.
విలాపవాక్యములు 3 : 42 (TEV)
మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు.
విలాపవాక్యములు 3 : 43 (TEV)
కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుము చున్నావు దయ తలచక మమ్మును చంపుచున్నావు.
విలాపవాక్యములు 3 : 44 (TEV)
మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు.
విలాపవాక్యములు 3 : 45 (TEV)
జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి యున్నావు.
విలాపవాక్యములు 3 : 46 (TEV)
మా శత్రువులందరు మమ్మును చూచి యెగతాళి చేసెదరు.
విలాపవాక్యములు 3 : 47 (TEV)
భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి.
విలాపవాక్యములు 3 : 48 (TEV)
నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది.
విలాపవాక్యములు 3 : 49 (TEV)
యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు
విలాపవాక్యములు 3 : 50 (TEV)
నా కన్నీరు ఎడతెగక కారుచుండును.
విలాపవాక్యములు 3 : 51 (TEV)
నా పట్టణపు కుమార్తెలనందరిని చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని.
విలాపవాక్యములు 3 : 52 (TEV)
ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిర్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు.
విలాపవాక్యములు 3 : 53 (TEV)
వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి నాపైన రాయి యుంచిరి
విలాపవాక్యములు 3 : 54 (TEV)
నీళ్లు నా తలమీదుగా పారెను నాశనమైతినని నేననుకొంటిని.
విలాపవాక్యములు 3 : 55 (TEV)
యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా
విలాపవాక్యములు 3 : 56 (TEV)
నీవు నా శబ్దము ఆలకించితివి సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము.
విలాపవాక్యములు 3 : 57 (TEV)
నేను నీకు మొరలిడిన దినమున నీవు నాయొద్దకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివి.
విలాపవాక్యములు 3 : 58 (TEV)
ప్రభువా, నీవు నా ప్రాణవిషయమైన వ్యాజ్యెము లను వాదించితివి నా జీవమును విమోచించితివి.
విలాపవాక్యములు 3 : 59 (TEV)
యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి యున్నావు నా వ్యాజ్యెము తీర్చుము.
విలాపవాక్యములు 3 : 60 (TEV)
పగతీర్చుకొనవలెనని వారు నామీద చేయు ఆలోచన లన్నియు నీవెరుగుదువు.
విలాపవాక్యములు 3 : 61 (TEV)
యెహోవా, వారి దూషణయు వారు నామీద చేయు ఆలోచనలన్నిటిని
విలాపవాక్యములు 3 : 62 (TEV)
నామీదికి లేచినవారు పలుకు మాటలును దినమెల్ల వారు నామీద చేయు ఆలోచనయు నీవు వినియున్నావు.
విలాపవాక్యములు 3 : 63 (TEV)
వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కని పెట్టుము నేను వారి పాటలకు ఆస్పదమైతిని.
విలాపవాక్యములు 3 : 64 (TEV)
యెహోవా, వారి చేతిక్రియనుబట్టి నీవు వారికి ప్రతీ కారము చేయుదువు.
విలాపవాక్యములు 3 : 65 (TEV)
వారికి హృదయకాఠిన్యము నిత్తువు వారిని శపించుదువు.
విలాపవాక్యములు 3 : 66 (TEV)
నీవు కోపావేశుడవై వారిని తరిమి యెహోవాయొక్క ఆకాశముక్రింద నుండకుండ వారిని నశింపజేయుదువు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66

BG:

Opacity:

Color:


Size:


Font: